Woman Gives Birth on Road: రోడ్డు ప్రమాదం.. ఆడబిడ్డను ప్రసవించి గర్భిణి మృతి
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ గర్భిణి ఘటనా స్థలంలోనే ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం కొద్దిసేపటికే గాయాల కారణంగా ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లో జరిగింది.
- Narender Thiru
- Published On : July 21, 2022 / 04:43 PM IST
Woman Gives Birth On Road
Woman Gives Birth on Road: ఉత్తర ప్రదేశ్‌లో దారుణం జరిగింది. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ గర్భిణి, బిడ్డను ప్రసవించి వెంటనే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన ఫిరోజాబాద్ జిల్లా, నర్ఖి ప్రాంతంలో బుధవారం జరిగింది. ఆగ్రాలోని దనౌలాకు చెందిన రాము, అతడి భార్య కామిని (ఎనిమిది నెలల గర్భిణి) కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తున్నారు.
Hyderabad Youtuber Suicide: వ్యూయర్స్ పెరగడం లేదని హైదరాబాద్ యూట్యూబర్ ఆత్మహత్య
ఈ క్రమంలో బార్త్రా గ్రామ సమీపంలో వీరి బైక్‌ను ఒక ట్రక్కు ఢీకొట్టింది. దీంతో రాము, అతడి భార్య కామిని దూరంగా ఎగిరి రోడ్డుపై పడ్డారు. ఈ ప్రమాదంలో ఇద్దరికీ గాయాలయ్యాయి. గర్భంతో ఉన్న కామిని ఘటనా స్థలంలోనే ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం కొద్ది సేపటికే గాయాలతో ప్రాణాలు కోల్పోయింది. అయితే, శిశువు సురక్షితంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు ఈ ఘటన జరగడంతో స్థానికుల్లో ఆగ్రహం పెల్లుబికింది. స్థానికులు రోడ్డుపై బైఠాయించి, ఆందోళన చేపట్టారు.
Droupadi Murmu: కుటుంబంలో తీవ్ర విషాదం.. అయినా చెదరని ద్రౌపది ముర్ము ధైర్యం
ఘటనకు సంబంధించి విచారణ జరిపి న్యాయం చేస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
