Droupadi Murmu: కుటుంబంలో తీవ్ర విషాదం.. అయినా చెదరని ద్రౌపది ముర్ము ధైర్యం

రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేసిన ద్రౌపది ముర్ము జీవితంలో విజయాలతోపాటు విషాదాలు కూడా ఉన్నాయి. కుటుంబంలో తీవ్ర విషాదాలు ఎదురైనా మొక్కవోని దీక్షతో తన ప్రయాణం కొనసాగించారు. దేశ అత్యున్నత పదవి కోసం పోటీలో నిలిచారు.

Droupadi Murmu: కుటుంబంలో తీవ్ర విషాదం.. అయినా చెదరని ద్రౌపది ముర్ము ధైర్యం

Droupadi Murmu

Droupadi Murmu: ఎన్డీయే తరఫున రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేసిన ద్రౌపది ముర్ము ఈ ఎన్నికలో విజయం సాధిస్తే.. రాష్ట్రపతి పదవి చేపట్టిన తొలి ఆదివాసి మహిళగా నిలుస్తారు. గతంలో ఆమె ఝార్ఖండ్ గవర్నర్‌గానే కాకుండా మరెన్నో రాజకీయ పదవుల్లో సేవలందించారు. గురువారం ఈ ఎన్నికకు సంబంధించి కౌంటింగ్ కొనసాగుతోంది. మొదటి రౌండ్‌లో ద్రౌపది ముర్మునే ముందున్నారు. సాయంత్రానికి పూర్తి ఫలితాలు విడుదలవుతాయి.

Hyderabad Youtuber Suicide: వ్యూయర్స్ పెరగడం లేదని హైదరాబాద్ యూట్యూబర్ ఆత్మహత్య

ప్రతిపక్షాలు మాత్రం ద్రౌపది ముర్ము గెలిస్తే ‘రబ్బర్ స్టాంప్’గా మిగిలిపోతారు అని విమర్శలు చేసినా వాటిని ఆమె పట్టించుకోలేదు. విమర్శల్ని పట్టించుకోకుండా ఎన్నికల్లో తన ప్రయత్నం కొనసాగించారు. ఈ ఎన్నికలో పోటీ చేస్తున్నట్లు ఆమె పేరు ప్రకటించగానే ద్రౌపది ముర్ము జీవితం గురించి తెలుసుకునేందుకు దేశం ఆసక్తి కనబరిచింది. అయితే, దేశంలో అత్యున్నత పదవికి పోటీ పడుతున్న ఆమె జీవితంలో విజయాలతోపాటు, విషాదాలు కూడా ఉన్నాయి. 2009-2014 మధ్య కాలంలో ఆమె వ్యక్తిగత జీవితంలో తీవ్ర విషాదాన్ని ఎదుర్కొన్నారు. ఈ ఐదేళ్ల కాలంలో భర్తతోపాటు, ఇద్దరు కొడుకుల్ని పోగొట్టుకున్నారు. అలాగే తల్లిని, సోదరుడ్ని కూడా కోల్పోయారు. 2009లో ద్రౌపది ముర్ము కొడుకు లక్ష్మణ్ ముర్ము అనుమానాస్పద స్థితిలో మరణించాడు. బెడ్‌పై విగత జీవిగా కనిపించాడు.

Sonia Gandhi: మొదటిరోజు ముగిసిన సోనియా గాంధీ విచారణ.. మళ్లీ సోమవారం హాజరుకావాలన్న ఈడీ

తర్వాత 2012లో రెండో కొడుకు రోడ్డు ప్రమాదంలో మరణించాడు. తర్వాత 2014లో కార్డియాక్ అరెస్ట్ కారణంగా భర్త మరణించాడు. ద్రౌపది ముర్ము కూతురు ఇతిశ్రీ ముర్ము ప్రస్తుతం బ్యాంకులో పని చేస్తున్నారు. ఆమె భర్త ఒక రగ్బీ ప్లేయర్. ద్రౌపది ముర్ము రాజకీయాల్లోకి రావడానికి ముందు ఒడిశాలోని రాయ్‌రంగపూర్‌లో టీచర్‌గా పని చేశారు. ద్రౌపది ముర్ము బాల్యంలో కూడా అనేక అవాంతరాలు ఎదుర్కొన్నట్లు ఆమె బంధువులు తెలిపారు. ఆమె చదువుకోవడానికి వెళ్తుంటే.. ఆడపిల్ల చదువుకుని ఏం చేస్తుందని హేళన చేసేవారని గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు తనేం చేయగలదో నిరూపించారని బంధువులు చెప్పారు.