Women’s Creativity : ఎలక్ట్రిక్ పోల్ చుట్టూ ఉన్నది గట్టు కాదా ? మహిళల క్రియేటివిటీ అదుర్స్

ఇద్దరు మహిళలు ఎలక్ట్రిక్ పోల్ చుట్టూ ఓ ప్లాట్ ఫామ్‌ను కట్టేశారు. దాని అంచుల మీద నడిచారు. నిజంగా ఇలాగే అనిపించేలా వారు గీసిన ఆర్ట్ వర్క్ నెటిజన్లను మెస్మరైజ్ చేస్తోంది. వారి క్రియేటివిటీని జనం మెచ్చుకుంటున్నారు.

Women’s creativity is amazing : ఇంటర్నెట్‌లో కొంతమంది టాలెంట్ చూస్తుంటే వావ్ అనిపిస్తోంది. ఇంతమంది క్రియేవ్ పీపుల్ ఉన్నారా? అని ఆశ్చర్యమనిపిస్తోంది. ఇద్దరు మహిళలు ఎలక్ట్రిక్ పోల్ చుట్టూ గీసిన ఆర్ట్ వర్క్ చూస్తే అద్భుతం అంటారు.

Women on moped : మోపెడ్‌పై ముద్దులు పెడుతూ మహిళలు వీడియో వైరల్

సోషల్ మీడియాలో రోజు రోజుకి ఎన్నో అద్భుతమైన వీడియోలు వైరల్ అవుతున్నాయి. అందులో ఎన్నో కళల్లో నైపుణ్యం ఉన్నవారంతా ముందుకు వస్తున్నారు. ఇద్దరు మహిళలు ఎలక్ట్రిక్ పోల్ చుట్టూ గట్టు మీద తిరుగుతున్నారేమో అని భ్రమ కలిగించేలా గీసిన ఆర్ట్ ఇంటర్నెట్‌లో ప్రశంసలు అందుకుంటోంది. పోల్ చుట్టూ గీతలు గీస్తూ ప్లాట్ ఫామ్ లాంటి నిర్మాణం కడుతున్నట్లు భ్రమను కలిగిస్తారు. అది గీయడం పూర్తైన తరువాత దాని అంచున నడుస్తున్నట్లుగా కూడా కనిపిస్తారు. ఎంతో నిరాడంబరంగా ఉన్న ఇద్దరు మహిళల మొహంలో సంతోషం కనిపిస్తుంది. ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌లో పూనమ్ ఆర్ట్ అకాడమీ @punamartacademy పేరుతో పోస్ట్ చేసిన ఈ వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది.

Bengaluru : చీరల షాపులో చితక్కొట్టుకున్న మహిళలు .. సిగపట్లతో రాద్ధాంతం

మహిళల ఆర్ట్ వర్క్‌ను అందరూ మెచ్చుకుంటున్నారు. చూసేవారికి అది నిజమేనేమో అనే భ్రమను కలిగించేలా గీసిన వారి ఆర్ట్ అందరినీ అబ్బురపరుస్తోంది.

ట్రెండింగ్ వార్తలు