Women on moped : మోపెడ్‌పై ముద్దులు పెడుతూ మహిళలు వీడియో వైరల్

మోపెడ్ పై వెళ్తున్న ఇద్దరు మహిళలు తమ జర్నీని చక్కగా ఆస్వాదించారు. చేతులు ఊపుతూ, ముద్దులు పెడుతూ ముందుకు సాగారు. ఏ మాత్రం అభ్యంతరకరంగా అనిపించని ఓ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది.

Women on moped : మోపెడ్‌పై ముద్దులు పెడుతూ మహిళలు వీడియో వైరల్

Women on moped

Women riding moped are viral : అందమైన రోడ్డు.. మోపెడ్ పై ఇద్దరు మహిళలు సంతోషంగా డ్రైవ్ చేసుకుంటూ ముందుకి వెళ్తున్నారు. ఫిల్మ్ మేకర్ షబీర్‌జీద్ షేర్ చేసిన ఈ బ్యూటిఫుల్ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది.

Viral Video : మహిళలూ.. బైక్ నడిపేటప్పుడు జాగ్రత్త.. రెప్పపాటులో ఎంత ఘోరం జరిగిందో చూడండి..

ఓ పెద్దావిడ మోపెడ్‌ను డ్రైవ్ చేస్తోంది. వెనుక ఇంకో మహిళ కూర్చుని ఉంది. సాఫీగా ఉన్న రోడ్డుమీద సంతోషంగా వారు ప్రయాణిస్తున్నారు. అందంగా నవ్వుతూ.. చేతులు ఊపుతూ.. ముద్దులు పెడుతూ మోపెడ్‌పై ముందుకు సాగారు. ఈ వీడియో అందరి మనసులు గెలుచుకుంది. ఈ వీడియో క్లిప్‌ 1.1 మిలియన్ మంది చూడటమే కాదు.. షేర్లు, లైక్స్, కామెంట్లతో వైరల్ అవుతోంది. సినీ నిర్మాత షబీర్‌జీద్  shabzyed తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ  వీడియో షేర్ చేశారు. ఎంతో ఆత్మవిశ్వాసంతో ఆ పెద్దావిడ మోపెడ్ నడుపుతున్న విధానం, కల్మషం లేని వారి చిరునవ్వులు చూసేవారిని ఎంతగానో ఆకట్టుకున్నాయ.

Kanpur: ఆగి ఉన్న బైక్‌‌లను కారుతో ఢీకొట్టిన మహిళ.. వీడియో వైరల్

‘హ్యాపీ వైబ్స్ మాత్రమే’..’ఎంత బాగుంది’.. ‘సూపర్’ .. అంటూ జనాలు కామెంట్లు పెడుతున్నారు. ఏవో స్టంట్లు, ఫీట్లు చేసి వైరల్ అవ్వాలని కొందరు చాలా తాపత్రయపడతారు. ఈ మహిళలు ఎంతో నేచురల్‌గా తమ మోపెడ్ రైడ్‌తో ఇలా వైరల్ అయ్యారు.

 

View this post on Instagram

 

A post shared by Shabeerzyed (@shabzyed)