Ram Charan: ముందు ప్రమోషన్స్.. ‘పెద్ది’ విడుదల తర్వాతే సర్జరీ.. రామ్ చరణ్ డెడికేషన్ కు మెగా ఫ్యాన్స్ ఫిదా
పెద్ది సినిమా విషయంలో రామ్ చరణ్(Ram Charan) డెడికేషన్ కి ఫిదా అవుతున్న ఆడియన్స్.
Ram Charan is undergoing hand surgery following the release of his film peddi
- ‘పెద్ది’ కోసం రామ్ చరణ్ కష్టం.
- గాయం వల్ల సర్జరీ వాయిదా వేత.
- నొప్పి భరిస్తూనే సినిమా ప్రమోషన్స్.
Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘పెద్ది’. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమా జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్స్, సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని అంచనాలను భారీగా పెంచేశాయి. విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో రామ్ చరణ్ వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ ప్రమోషన్స్ కార్యక్రమాల్లో బిజీగా గడుపుతున్నారు.
Karuppu: ‘కరుప్పు’ బ్లాక్ బస్టర్ హిట్.. కెమెరామెన్‌కు సూర్య కాస్లీ కారు గిఫ్ట్
ఈ సినిమా షూటింగ్ సమయంలో రియల్ రెజ్లర్లతో చేసిన యాక్షన్ సీక్వెన్స్ వల్ల రామ్ చరణ్ (Ram Charan)మణికట్టుకు తీవ్ర గాయమైంది. ఆ సమయంలోనే వైద్యులు ఆయనకు వెంటనే సర్జరీ చేయాలని సూచించారు. చరణ్ చేతికి ఇంకా కట్టు ఉండటంతో ఆయన ఆపరేషన్ చేయించుకోలేదనే ప్రచారం జరిగింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో చరణ్ స్పందిస్తూ.. సినిమా ప్రమోషన్స్ బిజీ వల్ల సర్జరీని వాయిదా వేసుకున్నట్లు స్పష్టం చేశారు.
‘పెద్ది’ సినిమా విడుదలైన తర్వాతే తాను సర్జరీ చేయించుకుంటానని రామ్ చరణ్ ప్రకటించడం మెగా అభిమానులను ఎమోషనల్‌కు గురి చేస్తోంది. అంతటి నొప్పిని భరిస్తూనే సినిమా కోసం ఆయన చూపిస్తున్న నిబద్ధతను చూసి నెటిజన్లు, ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. సినిమా విజయం కోసం రామ్ చరణ్ పడుతున్న ఈ కష్టం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వసూళ్ల వర్షం కురిపిస్తుందో చూడాలి.
