Crime
Youth Molested 100 Women : ఒకరు కాదు..ఇద్దరు కాదు..ఏకంగా వంద మంది మహిళలు, యువతులను వేధించాడు ఆ పోకిరి. ఇతని వేధింపులకు చెక్ పెట్టారు పోలీసులు. ఓ మహిళను వేధించగా…ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో..కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. తాను ఇప్పటి వరకు వంద మంది మహిళలను వేధించానని పోలీసుల ఎదుట ఒప్పుకున్నాడు. అతడిన అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు. ఈ ఘటన చెన్నైలో చోటు చేసుకుంది.
Read More : Most Eligible Bachelor : ఫస్ట్‌డే అయ్యగారు ఎంత వసూలు చేశారంటే
నార్త్ జగన్నాధన్ నగరానికి చెందిన దినేష్ కుమార్ మహిళలు, యువతులను వేధించడం ఒక హాబీగా పెట్టుకున్నాడు. ఓ కేటరింగ్ కాలేజీలో చదివిన ఇతను..చెన్నైలోని ఎగ్మోర్ ప్రాంతంలో ఓ హోటల్ లో పని చేస్తున్నాడు. రోడ్డు మీద వెళుతున్న వారిని వేధించసాగాడు. రాత్రి పొద్దు పోయిన తర్వాత…ఉదయాన్నే కార్యాలయాలకు వెళ్లే..వెళ్లి వచ్చే మహిళలను వేధించాడు. ఇలాగే..ఆర్మీ అధికారి కూతురును వేధించాడు. గత వారం ఆర్మీ అధికారి..తన ఇద్దరు కూతుళ్లతో మార్నింగ్ వాక్ కు వచ్చారు. వారి వెనుకానే నడుస్తూ..వచ్చిన…దినేష్ కుమార్…ఒకామెను అభ్యంతకరంగా తాకి బైక్ పై పరాయ్యాడు.
Read More : Power Cut : ఏపీలో రోజూ 4 గంటలు కరెంట్ కట్..? ఇందులో నిజమెంత
వెంటనే ఆ ఆర్మీ అధికారి పట్టుకొనేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. కానీ..అతను వెళ్లే బైక్ నెంబర్ నోట్ చేసుకుని నేరుగా పీఎస్ కు వెళ్లి కంప్లైట్ ఇచ్చారు. టూ వీలర్ రిజిస్ట్రేషన్ నెంబర్ ను ట్రాక్ చేయడంతో పాటు సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలించారు. నిందితుడు ఎక్కడున్నాడో తెలుసుకున్న పోలీసులు..అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటి వరకు 100 మంది మహిళలను వేధించినట్లు దినేష్ పోలీసుల ఎదుట ఒప్పుకున్నాడు.