Eve Teasing : సరదాగా చున్నీ లాగాను అన్న ఆకతాయి..ఏడాది జైలుశిక్ష వేసిన కోర్టు

రోడ్డు మీద వెళుతున్న యువతి చున్నీ లాగి అభ్యంగా ప్రవర్తించిన ఆకతాయికి కోర్టు ఏఢాది జైలు శిక్ష విధించింది.

Youth who pulled woman’s dupatta gets 1-year imprisonment :  రోడ్డమీద అమ్మాయి కనిపిస్తే చాలు ఆకతాయిల నోరు చేతులు దురద పుడతాయేమో.వెంటపడతారు. వేధిస్తారు. వెకిలిచేష్టలతో..అస్లీల మాటలతో వేధిస్తారు.వాళ్లతో ఎందుకులే..ఇటువంటి వెధవలను గురించి పట్టించుకుంటే బయటకు రాలేం అని చాలామంది అమ్మాయిలు లైట్ తీసుకుంటారు.దాన్ని ఆసరాగా తీసుకుని పోకిరీలు మరింతగా రెచ్చిపోతుంటారు. వేధింపులు స్థాయి పెంచుతారు.కొంతమంది వెధవలైతే చున్నీలు రాగటం..మీద చేయి వేసి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటారు.

Rear more : Punishment : యువకుడికి చెప్పుల దండ వేసి మూత్రంలో ముంచి ఊరేగించిన గ్రామస్తులు

అటువంటివారితో ఎందుకని చాలామంది అమ్మాయిలు పట్టించుకోరు. కానీ ముంబయికి చెందిన ఓ యువతి అలా ఊరుకోలేదు. తనను ఏడిపించి చున్నీ పట్టుకుని లాగి నానా అల్లరి చేసినవాడిపై కేసు పెట్టింది. నేను నా పనిమీద వీధిలో నడుచుకుంటు వెళుతుంటే అబ్రార్ ఖాన్ అనే 23 ఏళ్ల యువకుడు నా చున్నీ పట్టుకుని లాగి అసభ్యంగా మాట్లాడాడు అని కేసు పెట్టింది.ఇది 2016లో జరిగింది.

ఈ కేసుపై విచారణ చేసిన పోలీసులు అన్ని ఆధారాలతో సదరు నిందితుడిని ముంబై మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో సబ్మిట్ చేయగా గత ఐదు సంవత్సరాలుగా ఈ కేసు విచారణలు జరిగిన తరువాత ఎట్టకేలకు కోర్టు అతడు నేరం చేశాడని నిర్ధారించింది. కానీ నిందుతుడు మాత్రం నేను ఇకపై బుద్దిగా ఉంటానని ఏ అమ్మాయి జోలికి పోను అంటూ కోర్టును ప్రాధేయపడ్డాడు. కానీ కోర్టు ఊరుకోలేదు. ఏడాది జైలు శిక్షతో పాటు రూ.5 వేలు జరిమానా విధించింది.దీంతో నిందుతుడు అబ్బార్ ఖాన్ ఇకపై మంచిగా నడుచుకుంటానని దానికి సంబంధించి బాండ్ రాసిచ్చేందుకు సిద్ధమని కోర్టును వేడుకున్నాడు. ప్రొబేషన్ ఆఫ్ ఆఫెండర్స్ యాక్ట్ కింద అప్పీలు చేసుకున్నాడు. కానీ..న్యాయస్థానం మాత్రం అతడి విన్నపాన్ని తిరస్కరించింది.

Read more : చెల్లెలిపై ఈవ్ టీజింగ్…అడ్డుకున్నందుకు కాల్చి చంపారు

మహిళల మర్యాద, గోప్యత హక్కులకు భంగం కలిగించే నేరాల్లో నిందితులను.. ఇలా బాండ్‌పై విడుదల చేయలేమని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా జడ్జ్ శరద్ ఎస్ పరదేశి పలు కీలక వ్యాఖ్యలు చేశారు.‘‘నిందితుడు మహిళ పట్ల చాలా అభ్యంతరకర రీతిలో ప్రవర్తించాడు. ప్రొబెషన్ ఆఫ్ అఫెండర్స్ యాక్ట్ కింది అతడిని బాండ్‌పై విడుదల చేస్తే సమాజానికి తప్పుడు సంకేతాలు వెళతాయి. ఆకతాయిలకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. అతడిని విడుదల చేస్తే..దీన్ని అలుసుగా తీసుకుని నిందితుడు..మళ్లీ ఇదే తరహా నేరాలకు పాల్పడే అవకాశం ఉంది.’’ అని తేల్చిన కోర్టు శిక్షను అమలు చేయాలని పోలీసులకు ఆదేశించింది.

 

ట్రెండింగ్ వార్తలు