YS Sharmila New Party : అసెంబ్లీలో 50 శాతం మహిళలే..చేసి చూపిస్తాం – షర్మిల

టీఆర్ఎస్ పార్టీ మహిళల విషయంలో ఏమి చేయలేదని షర్మిల వ్యాఖ్యానించారు. మహిళల అభివృద్ధికి సీఎం కేసీఆర్ చేసిందేమి లేదని తెలిపారు. మహిళలు ఎదగాలి అంటే...పాలనలో సగభాగం ఉండాలన్నారు. జనాభాలో సగభాగం ఉన్న మహిళలు అధికార నిచ్చెనలో మాత్రం అట్టడుగున ఉన్నారని సభలో వెల్లడించారు.

YS Sharmila News Party : తెలంగాణ రాష్ట్రంలో నూతన పార్టీ ఏర్పాటు చేసిన దివంగత నేత వైఎస్సార్ కుమార్తె షర్మిల.. కీలక ప్రకటనలు చేశారు. పార్టీకి సంబంధించిన విధి విధానాలను వెల్లడించారు. 1. సంక్షేమం, 2. స్వయం అభివృద్ధి, 3. సమానత్వంగా తమ పార్టీ లక్ష్యాలుగా వెల్లడించారు. వైఎస్సార్ సంక్షేమ పాలన తీసుకరావడమే తమ పార్టీ లక్ష్యమని షర్మిల ప్రకటించారు. మహిళల ప్రాధాన్యత అంశాన్ని ప్రస్తావించారు.

Read More : Skyscrapers : ఆకాశహర్మ్యాల నిర్మాణాలపై చైనా నిషేధం

మహిళాభివృద్ధి : –
ప్రస్తుతం అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ మహిళల విషయంలో ఏమి చేయలేదన్నారు. మహిళల అభివృద్ధికి సీఎం కేసీఆర్ చేసిందేమి లేదని వ్యాఖ్యానించారు. మహిళలు ఎదగాలి అంటే…పాలనలో సగభాగం ఉండాలన్నారు. జనాభాలో సగభాగం ఉన్న మహిళలు అధికార నిచ్చెనలో మాత్రం అట్టడుగున ఉన్నారని సభలో వెల్లడించారు. మహిళలు పాలనకు పనికిరారనే భావన అందరిలో పోవాలని పిలుపునిచ్చారు. అసెంబ్లీలో 50 శాతం మహిళలను కూర్చోబెట్టాలనేదే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ లక్ష్యమన్నారు. తాము చెప్పడమే కాదు..చేసి చూపిస్తామన్నారు వైఎస్ షర్మిల.

Read More : Spy Cemera : బాత్ రూమ్‌లో స్పై కెమెరా.. షాకైన మహిళా డాక్టర్

రాజన్న సంక్షేమ పాలన : –
రాజన్న సంక్షేమ పాలన తీసుకు రావడమే ధ్యేయమంటూ తెలంగాణ రాజకీయాల్లో షర్మిల రంగ ప్రవేశం చేశారు. పార్టీ ప్రకటన కంటే ముందుగానే..తండ్రి అనుచరులు, అభిమానులతో సమావేశాలు ఏర్పాటు చేయడమే కాకుండ పలు జిల్లాల్లో పర్యటన చేశారు. పార్టీ ప్రకటన కంటే ముందు..ఏపీలోని కడప జిల్లా ఇడుపులపాయలో తండ్రి సమాధి వద్ద పార్టీ జెండాను ఉంచి ప్రార్థనలు చేశారు.

Read More : YS Sharmila News Party : అసెంబ్లీలో 50 శాతం మహిళలే..చేసి చూపిస్తాం – షర్మిల
పార్టీ స్థాపన లక్ష్యాలు, అజెండా : –

అనంతరం కడప నుంచి ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం బేగంపేటకు చేరుకున్నారు. పంజాగుట్టలోని వైఎస్‌ విగ్రహానికి పూలమాల వేసి సాయంత్రానికి రాయదుర్గంలోని జేఆర్సీ కన్వెన్షన్‌ కేంద్రానికి చేరుకోన్నారు. వేదికపై ఉన్న తెలంగాణ అమరవీరుల స్థూపానికి, వైఎస్​ విగ్రహానికి నివాళి అర్పించారు. అనంతరం షర్మిల పార్టీ స్థాపన లక్ష్యాలు, అజెండాపై వివరించారు.

ట్రెండింగ్ వార్తలు