Skyscrapers : ఆకాశహర్మ్యాల నిర్మాణాలపై చైనా నిషేధం

ఆకాశహర్మ్యాల నిర్మాణంపై చైనా నిషేధం విధించింది.

Skyscrapers : ఆకాశహర్మ్యాల నిర్మాణాలపై చైనా నిషేధం

China2.0

Skyscrapers ఆకాశహర్మ్యాల నిర్మాణంపై చైనా నిషేధం విధించింది. కొన్ని ప్రాజెక్టుల నాణ్యత విషయంలో ప్రజల భద్రత గురించి ఆందోళనలు పెరుగుతన్న నేపథ్యంలో 500 మీటర్లు(1,640 అడుగులు)కన్నా ఎత్తైన ఆకాశహర్మ్యాల నిర్మాణాలపై నిషేధం విధించినట్లు మంగళవారం ఆ దేశానికి చెందిన ప్రధాన ఆర్థిక ప్రణాళిక సంస్థ, జాతీయ అభివృద్ధి మరియు సంస్కరణ కమిషన్ మంగళవారం ఒక నోటీసులో పేర్కొంది.

చైనాలో నిర్మాణ ప్రమాణాలు మరియు వేగవంతమైన పట్టణీకరణ కారణంగా భవనాలు కూలిపోవడం అరుదేమీ కాదు. ఇటీవల చైనా యొక్క ఎత్తైన ఆకాశహర్మ్యాలలో ఒకటైన 300 మీటర్ల ఎత్తైన (980 అడుగులు) షెన్‌జెన్ ఎలక్ట్రానిక్స్ గ్రూప్ ప్లాజా తరచుగా షేక్ అవుతుండటంతో అది ఏ రోజు కూలిపోతుందో తెలియక స్థానిక ప్రజలు భయభ్రాంతులకు గురవడంతో..మే 18 న ప్రభుత్వం ఆ బిల్డింగ్ లోని వారిని ఖాళీ చేయించిన కొద్ది రోజుల వ్యవధిలోనే తాజా ఆదేశాలు రావడం గమనార్హం.

అదేవిధంగా,సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్ల కొన్ని ప్రాజెక్టులలో నాణ్యత లోపంపై ఆందోళనలు, ప్రజా భద్రతా ప్రమాదాలను వంటి అంశాలను పేర్కొంటూ 250 మీటర్ల కంటే ఎత్తైన టవర్ల నిర్మాణాన్ని ఖచ్చితంగా పరిమితం చేయాలని తాజాగా చైనా ఉన్నత ఆర్థిక ప్రణాళిక సంస్థ.. స్థానిక అధికారులను ఆదేశించింది. 100 మీటర్లకు మించిన భవనాల నిర్మాణం.. ఫైర్ రెస్క్యూ(అగ్నిప్రమాదాల నుంచి కాపాడే) సామర్ధ్యం మరియు భవనాలు నిర్మించబడే నగరం యొక్క స్థాయికి సమానంగా ఉండేలా చూడాలని ఆదేశించింది.

ఇది ప్రధానంగా భద్రత కోసమే అని హాంకాంగ్ యూనివర్శిటీలోని అసోసియేట్ లా ప్రొఫెసర్ కియావో షిటాంగ్ తెలిపారు. ప్రపంచంలో 10 భవనాలు మాత్రమే 500 మీటర్లకు పైగా ఉన్నాయి మరియు వాటిలో సగం చైనాలోని ప్రధాన భూభాగంలో ఉన్నాయని షిటాంగ్ చెప్పారు.