Self-Made Billionaires : పాత ఆలోచనలతో కొత్త డబ్బు రాదు .. బిలియనీర్ కావాలంటే కొన్ని క్వాలిటీస్ ఉండాలి

అసంతృప్తి ఎక్కువగా ఉన్న వ్యక్తులే ఎక్కువ డబ్బు సంపాదనకు ప్రయత్నాలు చేస్తారట.. బిలియనీర్లు ఎక్కువగా సంబరాలు చేసుకోరట. వారు వెళ్లిన మార్గాలు వేరైనా వారి విజయ రహస్యాలు మాత్రం ఒకటే.. బిలియనీర్లలో కామన్ గా కనిపించే లక్షణాలు కొన్ని ఉన్నాయి.

Self-Made Billionaires

Self-Made Billionaires : ప్రపంచ కుబేరులు వాళ్లు ఎదిగిన మార్గాలు వేరు కావచ్చు.. కానీ వారందరిలో కనిపించే అద్భుతమైన లక్షణాలు మాత్రం దగ్గరగానే ఉంటాయి. మరి వారిలో కామన్‌గా కనిపించే లక్షణాలేంటో లుక్కేద్దాం.

Rich Indians: ఇండియాకు గుడ్ బై చెబుతున్న కుబేరులు.. ఇబ్బంది లేదంటున్న ఆర్థిక నిపుణులు.. ఎందుకంటే?

35 మంది బిలియనర్లను పరిశీలించిన తర్వాత .. వారిని ఇంటర్వ్యూ చేసిన తరువాత షాకింగ్ విషయాలు బయటపడ్డాయట. బిలియనీర్లకు ఎంత సంపాదించినా సంతృప్తి అనేది ఉండదట. బాగా సంపాదించాలి అనుకునే వారిలో ఏమీ చేయకుండా ఉండటం, ఆత్మసంతృప్తి పొందటం అనేవి ప్రమాదకరమైన లక్షణాలట. ఎప్పుడూ ఇంకా ఎంత సంపాదించాలి అనే ప్రయత్నాలు చేస్తూ తమ విజయాన్ని సాధిస్తారట. బిలియనీర్లు సంపాదన విషయంలో సొంత మార్గాలు ఎంచుకుంటారట. లేదా వాటిని సృష్టిస్తారట. రాత్రికి రాత్రే బిలియనీర్లు తయారవ్వరు. వారు ఎంత కష్టపడితే ఈరోజు ఆ స్థాయికి వెళ్లి ఉంటారో ఊహించలేం.

 

బిలియనీర్ కావాలనే ఆలోచన ఉంటే సరిపోదు.. సంపన్నులు కావడం వెనక అపారమైన కృషి ఉంటుంది. కలను నెరవేర్చుకోవడం కోసం నిరంతరం పట్టుదల, అంకితభావంతో ముందుకు సాగడం కూడా వీరి ప్రధాన లక్షణాల్లో ఒకటి. డీల్ అమలు చేయాలన్నా, వ్యాపారం పెంచుకోవాలన్నా అందరితో కలిసి మెలసి ఉండాలి. కనెక్ట్ అవ్వాలి. వారిని అనుకూలంగా ఉండేలా చూసుకోవాలి. ఒక బిలియనీర్ ఇతర వ్యక్తుల్ని ఒప్పించడం వారితో కమ్యూనికేట్ చేయడం కూడా అతని విజయ రహస్యం.

Mumbai : ప్రపంచంలో అత్యంత సంపన్న బిచ్చగాడు భారతీయుడేనట.. ఏ సిటీలో ఉన్నాడంటే..

బిలియనీర్లు కొత్తగా ఆలోచిస్తుంటారు. కొత్త మార్గాలు అన్వేషిస్తుంటారు. పాత ఆలోచనలతో కొత్త డబ్బు రాదు. కాబట్టి నిరంతరం క్రియేటివికి పెద్ద పీట వేస్తారు. బిలియనీర్లకు కొత్త ఆవిష్కరణలు చేయడం, వాటిని సృష్టించడం వాటిని మార్చగల సామర్థ్యం కలిగి ఉంటారు. వారి వెంట ఎప్పుడు ఎంతో ప్రతిభ ఉన్న టీం ఉంటుంది. ఇతర వ్యక్తుల సాయం లేకుండా బిలియనీర్లు అన్నీ సాధించలేరు.

 

అసంతృప్తి ఎక్కువగా ఉన్న వ్యక్తులే ఎక్కువ డబ్బు సంపాదనకు ప్రయత్నాలు చేస్తారట. బిలియనీర్లు ఎక్కువగా సంబరాలు చేసుకోరు. సంపాదించిన డబ్బులు బ్యాంకులో వేసుకుని తిరిగి పనిలో పడతారు. ఎప్పుడూ రిస్క్ చేయడానికి రెడీగా ఉంటారు. ఎవరూ పుడుతూనే సామర్థ్యంతో పుట్టరు. తాము ఏర్పరచుకున్న లక్ష్యాలకు తగిన సలహా ఇచ్చేవారిని ఎంచుకుంటారు. లక్ష్యం పూర్తయ్యే వరకూ పని, లేదా లక్ష్యంపైనే ఫోకస్ పెడతారు. ఏదైనా సాధించాలంటే బిగ్ పిక్చర్ థింకింగ్ చాలా అవసరం. ప్రతి అడ్డంకిని అధిగమించిన వారు మాత్రమే సంకల్ప బలంతో ముందుకు సాగుతారు. సంపన్నులు కాగలుగుతారు.

Forbes Richest Women 2023: అమెరికాలో సత్తాచాటారు..! స్వయంకృషితో ఎదిగిన మహిళా సంపన్నుల జాబితాలో నలుగురు భారతీయ సంతతి మహిళలు