Best Fruits For Diabetes : మధుమేహ వ్యాధిగ్రస్తులు పండ్లు తినటం మంచిదేనా ? తినాల్సిన 10 ఉత్తమ పండ్ల రకాలు ఇవే !

పండ్లలో సహజ చక్కెర ఫ్రక్టోజ్ ఉంటుంది. దాంతోపాటుగా కార్పోహైడ్రేట్లు ఉంటాయి. శరీరానికి కావాల్సిన పోషకాలు అనగా విటమిన్ సి, ట్రిప్టోఫాన్, పొటాషియం, ఐరన్ వంటి ముఖ్యమైన ఖనిజాలు అందుతాయి.

Best Fruits For Diabetes

Best Fruits For Diabetes : మధుమేహంతో బాధపడుతున్నవారు పండ్లు తినకూడదన్న అపోహ చాలా మందిలో ఉంది. డయాబెటిక్‌గా ఉన్నప్పుడు పండ్లు తినడం వల్ల హాని కలుగుతుందని చెప్పేవారు ఉన్నారు. అయితే షుగరు ఉన్నవారు ఏ పండ్లను తినాలి, ఎలాంటి పండ్లకు దూరంగా ఉండాలి. ఉత్తమమైన పండ్ల ను ఎంపిక చేసుకోవటం ఎలా అన్న దానిపై అనేక సందేహాలు ఉన్నాయి.

READ ALSO : Tiger Nuts : డయాబెటిస్ నియంత్రణలో ఉంచే టైగర్ నట్స్ !

ఆకలితో ఉన్నసమయంలో పండ్లు తీసుకోవటం ఆరోగ్యానికి చాలా మంది. పండ్లలో కార్బోహైడ్రేట్ల తోపాటు అవసరమైన విటమిన్లు, ఖనిజాలు , ఫైబర్స్ వంటివి ఉంటాయి. సమతుల్య ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడానికి పండ్లు మనకు చాలా అవసరం.

డయాబెటిస్ రోగులు పండ్లు ఎందుకు తినాలి ?

పండ్లలో సహజ చక్కెర ఫ్రక్టోజ్ ఉంటుంది. దాంతోపాటుగా కార్పోహైడ్రేట్లు ఉంటాయి. శరీరానికి కావాల్సిన పోషకాలు అనగా విటమిన్ సి, ట్రిప్టోఫాన్, పొటాషియం, ఐరన్ వంటి ముఖ్యమైన ఖనిజాలు అందుతాయి. పండ్లో ఉండే ఫైబర్ ప్రేగు కదలికతోపాటు, కొలెస్ట్రాల్ మరియు చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. బరువును కూడా కంట్రల్ లో ఉంచేందుకు తోడ్పడుతుంది. పండ్లలో ఉండే ఫైటోకెమికల్స్, యాంటీఆక్సిడెంట్లు వంటి కొన్ని సమ్మేళనాలు క్యాన్సర్, గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

డయాబెటిక్‌గా ఉన్నప్పుడు పండ్లకు దూరంగా ఉండాలనేది అపోహ మాత్రమే. చాలా మంది పరిశోధకులు ఆరోగ్యకరమైన జీవనశైలికి పండ్లు అవసరమని సిఫార్సు చేస్తున్నారు. తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ కలిగిన పండ్లు (GI విలువ 50 కంటే తక్కువ) మధుమేహ రోగులకు తినాటానికి మంచివి.

READ ALSO : Diabetes : ఈ ఆహారాలు డయాబెటిస్ ను అదుపులో ఉంచుతాయట ! అవేంటో తెలుసా ?

డయాబెటిస్ రోగులు తినాల్సిన 10 పండ్ల రకాలు ;

1. యాపిల్ ;

యాపిల్స్ కేవలం పోషకమైనవి మాత్రమే కాకుండా కడుపు నిండుగా ఉంచేందుకు సహాయపడతాయి. ఒక అధ్యయనం ప్రకారం, వాటిని మితంగా తీసుకుంటే టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుంది. రోజుకు ఒక యాపిల్ తినటం వల్ల డాక్టర్ అవసరం ఉండదన్న పాత సామెతలో నిజం ఉందని తేలింది. వీటిలో విటమిన్ సి మరియు ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. యాపిల్ పై తొక్కలో ఉండే పాలీఫెనాల్ సమ్మేళనాలు ఇన్సులిన్ ఉత్పత్తి చేయడానికి ప్యాంక్రియాస్‌ను ప్రేరేపిస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. ఆపిల్ టైప్-2 మధుమేహం, హృదయ సంబంధ సమస్యల ప్రమాదాలను తగ్గించడంలో ఉపకరిస్తుంది.

2. అరటి ;

అరటిపండులో ఫైబర్, పిండి పదార్థాలు, కేలరీలు ఉంటాయి. వీటిలో పొటాషియం, విటమిన్ సి కూడా పుష్కలంగా ఉన్నాయి. అరటిపండులో ముఖ్యమైన పోషకాలు ఉన్నందువల్ల సమతుల్య ఆహారంగా చెప్పవచ్చు. అయితే కొన్ని రకాల అరటిపండ్లు పండిపోయిన తరువాత ఎక్కువ చక్కెరను కలిగి ఉంటాయి. ఇవి తింటే చక్కెర స్థాయిలు పెరుగుతాయి. అందువల్ల, డయాబెటిక్ రోగులు తక్కువ తీపి కలిగి కొంచెం మధ్యస్ధంగా పండిన వాటిని తినటం మంచిది. పొటాషియం మరియు విటమిన్ సి పుష్కలంగా ఉండటం వల్ల మధుమేహ వ్యాధిగ్రస్తులకు అరటిపండు ఉత్తమమైన పండ్లలో ఒకటిగా నిపుణులు సూచిస్తున్నారు. అలాగని అతిగా తినకూడదు.

READ ALSO : Fighting Diabetes : డయాబెటిస్‌తో పోరాడటంతోపాటు, రక్తంలో చక్కెరను అదుపులో ఉంచే ఈ చిరుధాన్యం గురించి తెలుసా ?

3. స్ట్రాబెర్రీలు ;

స్ట్రాబెర్రీలు డయాబెటిక్ రోగులకు మంచి ఆహారం. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో స్ట్రాబెర్రీలు సహాయపడతాయి. స్ట్రాబెర్రీస్‌లో పిండి పదార్థాలు, ఫైబర్‌లు ఉంటాయి. దీనిలోని విటమిన్ సి రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. శరీర జీవక్రియను పెంచి బరువును తగ్గించడంలో సహాయపడుతుంది. కొలెస్ట్రాల్ స్థాయిని కూడా తగ్గిస్తుంది. హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. వారి తక్కువ GI విలువ కారణంగా, మధుమేహ రోగులకు వైద్యులు సిఫార్సు చేస్తున్నారు.

4. స్టార్ ఫ్రూట్:

ఈ పుల్లని పండులో డైటరీ ఫైబర్ , విటమిన్ సి పుష్కలంగా ఉన్నాయి. ఇది యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రక్రియలను ప్రభావితం చేస్తుంది మరియు సెల్ డ్యామేజ్‌ని నివారించటంలో సహాయపడుతుంది. వీటిలో తక్కువ చక్కెరలు ఉంటాయి. మధుమేహులు ఈ పండ్లను తీసుకోవటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

READ ALSO : Diabetic Nephropathy : డయాబెటిస్‌ ఉన్నవారు కిడ్నీ సమస్యలను ఎదుర్కోవటం ఎలాగంటే ?

5. సిట్రస్ పండ్లు ;

ఇవి విటమిన్ సి, ఫోలేట్, పొటాషియం మరియు విటమిన్ K సమృద్ధిగా ఉన్న పండ్లు. అనగా ద్రాక్ష, నిమ్మకాయ, నారింజ, కివి. వంటి విటమిన్ సి పండ్లు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. 1000 mg విటమిన్ సి రోజువారిగా తీసుకోవడం వల్ల టైప్-2 డయాబెటిస్ రోగులలో రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గిస్తుంది. ఇది శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. ఫ్రీ రాడికల్స్ ద్వారా దెబ్బతిన్న కణాలను నయం చేయడంలో సహాయపడుతుంది.

6. నేరేడు ;

నేరేడులో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్, కరిగే ఫైబర్‌లు పుష్కలంగా ఉన్నందున మధుమేహానికి ఒక అద్భుతమైన పండుగా చెప్పవచ్చు. అధిక మూత్రవిసర్జన, దాహం వంటి డయాబెటిక్ లక్షణాలను నయం చేయడంతో పాటు ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది. అందుకే ఈ పండు తినటం వల్ల షుగర్ వ్యాధి గ్రస్తులకు మేలు కలుగుతుందని చెప్తారు.

READ ALSO : Diabetes And Exercise : డయాబెటిస్ ఉన్నవారు రోజుకు ఎంత సమయం వాకింగ్ చేయాలో తెలుసా ?

7. దానిమ్మ ;

దానిమ్మలో చక్కెర సమృద్ధిగా ఉంటుంది. అయితే యాంటీఆక్సిడెంట్లకు ఇది మూలం. ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని, లిపిడ్ పెరాక్సిడేషన్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచడానికి, తద్వారా టైప్-2 మధుమేహాన్ని నియంత్రించడంలో సహాయపడతాయి. ఉపవాసం ఉన్నవారిలో రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను అధిక స్థాయిలో తగ్గించేందుకు ఉపకరిస్తాయి. ఇవి రక్త ప్రవాహాన్ని నియంత్రించడంలో , ఫ్రీ-రాడికల్స్ నుండి రక్షించడంలో కూడా సహాయపడతాయి. గుండె సంబంధ వ్యాధుల ప్రమాదాలను తగ్గిస్తుంది. ముఖ్యంగా టైప్-2 డయాబెటిక్ రోగులకు మరింత మేలు చేస్తుంది.

8. జామ ;

జామపండులో అధిక మొత్తంలో లైకోపీన్, డైటరీ ఫైబర్ , విటమిన్ సి, ఎ , పొటాషియం పుష్కలంగా ఉన్నందున ఇది చాలా పోషకమైన పండుగా చెప్పవచ్చు. ప్రేగు కదలికలకు సహాయపడుతుంది. బరువు పెరగకుండా చూసేందుకు ఉత్తమ ఎంపిక . పండు ,దాని ఆకులు తక్కువ GI మరియు GL విలువలను కలిగి ఉంటాయి. తద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. ఒక జామపండులో 38 కేలరీలు ఉంటాయి.

READ ALSO : Health Benefits Of Jamun : డయాబెటిస్‌ఉన్నవారు నేరేడు పండ్లు తినటం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు !

9. చెర్రీస్ ;

చెర్రీస్ అత్యల్ప గ్లైసెమిక్ సూచికను కలిగి ఉండి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను పెరగకుండా చూస్తాయి. ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచే ఆంథోసైనిన్స్ అనే రసాయనాలు వీటిలో ఉన్నాయి. 100 గ్రాముల చెర్రీస్‌లో 50 కేలరీలు ఉంటాయి. అందువల్ల, మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఈ పండ్లు తినటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

10. పియర్ ;

పియర్ పండు డయాబెటిస్ డైట్ ప్లాన్‌కు అద్భుతమైన ఆహారంగా చెప్పవచ్చు. దీనిలో ఫైబర్, విటమిన్ K కు అద్భుతమైన మూలం. ఇది తక్కువ GI సూచికను కలిగి ఉంటుంది. తద్వారా గ్లూకోజ్ శోషణ రేటును తగ్గిస్తుంది. బేరిలో పీచు ఉంటుంది. టైప్-2 డయాబెటిక్ పేషెంట్లలో బ్లడ్ షుగర్ లెవల్స్ తగ్గించడంలో బేరిలో ఉండే ఆంథోసైనిన్లు తోడ్పడతాయి. బేరిలో ఉండే పొటాషియం,యాంటీఆక్సిడెంట్లు ప్రేగు కదలికలను ప్రోత్సహిస్తాయి.