Fighting Diabetes : డయాబెటిస్‌తో పోరాడటంతోపాటు, రక్తంలో చక్కెరను అదుపులో ఉంచే ఈ చిరుధాన్యం గురించి తెలుసా ?

రాగి అనేక భారతీయ వంటకాలలో ముఖ్యంగా దక్షిణ భారదేశ ప్రాంతంలో ప్రధానమైనది. ఈ ధాన్యంలో పోషక విలువలకు ప్రసిద్ధి చెందింది.

Fighting Diabetes : డయాబెటిస్‌తో పోరాడటంతోపాటు, రక్తంలో చక్కెరను అదుపులో ఉంచే ఈ చిరుధాన్యం గురించి తెలుసా ?

Fighting Diabetes

Fighting Diabetes : భారతదేశం పెరుగుతున్న మధుమేహ మహమ్మారిని ఎదుర్కొనేందుకు ఆరోగ్యకరమైన, మరింత సమతుల్య ఆహారం తీసుకోవటం అవసరం. ఇందుకోసం పురాతన కాలపు ఆహారపు అలవాట్లు ఎంతగానో దోహదం చేస్తాయి. అలాంటి పాతకాలపు ఆహారాలలో రాగి కూడా ఒకటి. ఇది రక్తంలో చక్కెర నియంత్రణతోపాటు మొత్తం ఆరోగ్యానికి అద్భుతమైన ప్రయోజనాలను కలిగించే సూపర్‌గ్రెయిన్ గా నిపుణులు సూచిస్తున్నారు.

READ ALSO : ఆకలి ఉన్నప్పుడు తినడం లేదా? ఎంత ప్రమాదమో తెలుసా

రాగి అంటే ఏమిటి?

దీనినే ఫింగర్ మిల్లెట్ అని కూడా పిలుస్తారు, రాగి అనేక భారతీయ వంటకాలలో ముఖ్యంగా దక్షిణ భారదేశ ప్రాంతంలో ప్రధానమైనది. ఈ ధాన్యంలో పోషక విలువలకు ప్రసిద్ధి చెందింది. అధిక స్థాయిలో ప్రోటీన్, ఫైబర్, కాల్షియం మరియు ఖనిజాలు నిక్షిప్తమై ఉన్నాయి. రాగి యొక్క తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించాలనుకునే వారికి అనగా ప్రీ-డయాబెటిక్, డయాబెటిక్ , అలాగే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలనుకునే వారికి ఆదర్శవంతమైన ఆహార ఎంపికగా చెప్పవచ్చు.

READ ALSO : Viral Video: ఆలు తొక్క ఇంత సులభంగా తీయొచ్చా? మీరూ ట్రై చేస్తారా?

బ్లడ్ షుగర్ నియంత్రణకు రాగి వల్ల కలిగే ప్రయోజనాలు ;

రాగిలోని పోషకాలు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. వాటిలో ప్రధానమైనది రక్తంలో చక్కెర నియంత్రణ. దీనిలో ఉండే అధిక ఫైబర్ కంటెంట్ జీర్ణక్రియ రేటును తగ్గిస్తుంది. ఫలితంగా చక్కెర రక్తప్రవాహంలోకి హెచ్చుతగ్గులు లేకుండా స్థిరంగా విడుదల అవుతుంది. ఆకస్మిక చక్కెర స్థాయిల పెరుగుదలను తగ్గిస్తుంది, మధుమేహం నిర్వహణలో తోడ్పడుతుంది.

అంతేకాకుండా రాగిలో ఉండే ఫినోలిక్ సమ్మేళనాలు, యాంటీఆక్సిడెంట్లు ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంతోపాటు, మధుమేహంతోపాటు అనేక ఇతర వ్యాధులతో పోరాటంలో సహాయపడతాయి.

READ ALSO : మెదడుకు హాని కలిగించే అలవాట్లు

రాగిని మీ రోజువారి ఆహారంలో చేర్చుకోవటం ;

రాగి యొక్క అనేక ప్రయోజనాల కారణంగా ఆహారంగా తీసుకోవచ్చు. దీన్ని పిండిగా చేసి వివిధ రకాల ఆహారాలను తయారీకి ఉపయోగించవచ్చు. గంజిగా తయారు చేసుకుని తీసుకోవచ్చు. పాప్‌కార్న్ లాగా చేయవచ్చు. పోషకమైన అల్పాహారం స్మూతీ కోసం పానీయాలలో కలుపుతారు. స్నాక్ బార్‌లను తయారు చేసుకుని తింటారు. అంతేకాకుండా రాగి దోస, రాగి రోటీ వంటి సాంప్రదాయ ఆహారాలను తయారు చేసుకుని తినవచ్చు.

READ ALSO : ఏడవటం వల్ల ఎన్ని లాభాలో తెలుసా..!

చివరిగా ఆధునిక జీవనశైలి, అహారపు అలవాట్ల కారణంగా అనేక మంది ఆరోగ్య సమస్యలతో పోరాడుతున్నారు. అనారోగ్య సమస్యలు దరిచేరకుండా ఉండాలంటే పురాతన కాలం నుండి వస్తున్న ఆహారాపు అలవాట్లను అలవర్చుకోవటం ద్వారా శరీరానికి కావాల్సిన పోషకాలను పొందేందుకు అవకాశం ఉంటుంది. తద్వారా అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చు.