Viral Video: ఆలు తొక్క ఇంత సులభంగా తీయొచ్చా? మీరూ ట్రై చేస్తారా?
ఆలుగడ్డల తొక్కలు తీయడమంటే కొందరికి చాలా చిరాకు. కొన్ని చిట్కాలు వాడితే ఈజీగా పనైపోద్ది.

Peeling Boiled Potatoes
Peeling Boiled Potatoes: ఆలుగడ్డ కూరన్నా, బంగాళాదుంపతో చేసే వంటకాలన్నా దేశంలో చాలా మందికి ఎంతో ఇష్టం. అయితే, ఆలుగడ్డ పొట్టు తీయడానికి చాలా మంది ఇబ్బందులు పడుతుంటారు. అదో పెద్ద పనిగా భావిస్తుంటారు. తొక్కలు తీయడానికి చాలా సమయం పడుతుందని అంటుంటారు.
పొట్టు తీయడానికి రకరకాల పరికరాలను ఉపయోగిస్తారు. ఉడికించిన ఆలుగడ్డల పొట్టు తీయడం కొంచెం సులభమే. ఉడికించిన తర్వాత పొట్టు తీయడానికి కూడా చేతికి గోర్లు ఉంటేనే సాధ్యమవుతుందని వాపోతుంటారు. తాజాగా, ఓ మహిళ మరింత సులభంగా ఆలుగడ్డల తొక్కలు తీసి ఇందుకు సంబంధించిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది.
ఈ వీడియో బాగా వైరల్ అవుతోంది. మొదట ఆలుగడ్డలను నీళ్లలో ఉడికించిన ఆ మహిళ ఆ తర్వాత వాటిని ఆమె ఓ పళ్లెంలో ఉంచింది. ఆలుగడ్డను సగానికి కట్ చేసింది. పూరీలు చేయడానికి వాడే స్కిమ్మర్ లాడిల్ పై ఆలుగడ్డను ఉంచి రుద్దుతూ తొక్కను తీసింది. ఆమె పనిచేస్తున్న విధానం అద్భుతమని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
మంచి ఐడియా ఇచ్చారని, ఇకపై తాము కూడా ఇలాగే ఆలు తొక్కలు తీస్తామంటూ కొందరు పేర్కొన్నారు. ప్రస్తుతం ఏ చిట్కా కోసమైనా నెటిజన్లు ఇటువంటి వీడియోలనే నమ్ముకుంటున్నారు. కష్టపడి పనిచేసే అవసరం లేదకుండా చాలా సులభంగా పనులు చేసుకునే వీడియోలు ఆన్‌లైన్ లో ఎన్నో ఉంటున్నాయి.
View this post on Instagram
Dog Barking : రైల్వే స్టేషన్‌లో కుక్కలా మొరిగిన వందలాదిమంది .. ఎందుకంటే..?