Diabetics Control : షుగర్ తగ్గాలంటే.. ఇవి తినాల్సిందే..!

ప్రస్తుత ఆధునిక జీవనశైలి కారణంగా యుక్త వయస్సులోనే షుగర్ వచ్చేస్తోంది. షుగర్ వ్యాధి అనేది దీర్ఘకాలిక వ్యాధి. ఒకసారి ఈ షుగర్ వచ్చిందంటే.. జీవితాంతం ఆ వ్యాధిని అనుభవించాల్సిందే.

Diabetics Control : ప్రస్తుత ఆధునిక జీవనశైలి కారణంగా యుక్త వయస్సులోనే షుగర్ వచ్చేస్తోంది. షుగర్ వ్యాధి అనేది దీర్ఘకాలిక వ్యాధి. ఒకసారి ఈ షుగర్ వచ్చిందంటే.. జీవితాంతం ఆ వ్యాధిని అనుభవించాల్సిందే. అందుకే షుగర్ రాకుండా ఉండాలంటే మంచి ఆహారపు అలవాట్లు, వ్యాయామం వంటివి పాటించాలి. డయాబెటిస్ వచ్చిన తర్వాత షుగర్ సమస్య అధికమవుతుంది. షుగర్ కంట్రోల్ చేసేందుకు ఆహారంలో మార్పులు చేసుకోవాల్సి వస్తుంది. డయాబెటిస్ కంట్రోల్ ఉంచడానికి ప్రతిరోజూ వ్యాయామం చేయాలి. మందులతో పాటు ఉదయం పూట తీసుకునే అల్ఫాహారం (Breakfast Food) విషయంలోనూ అనేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. డైట్ చార్ట్ ఒకటి సిద్ధం చేసుకోవాలి. అందులో డయాబెటిస్ కంట్రోల్ చేసే ఆహారాన్ని మాత్రమే ఎక్కువగా తీసుకోవాలి. చక్కని అల్ఫాహారం తీసుకోవాలి.

10 Best Things Eating Breakfast Foods For Control Diabetics In Life 

గ్లూకోజ్ శాతాన్ని చాలావరకూ కంట్రోల్ చేసుకోవచ్చు. ఉదయపు అల్ఫాహారంలో ఆకుకూరలు, కూరగాయాలు, తాజా పండ్లు, ముడిధాన్యాలు, కొవ్వులేని మాంసం, చేపలు, ఎండు పప్పులు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలని సూచించారు. ఎలాంటి ఆహార పదార్థాన్ని తీసుకున్నా కూరగాయల ముక్కలుగా తీసుకోవడం అలవాటు చేసుకోండి. ఇక ఇడ్లీలో కూడా క్యారెట్ తురుము లేదా బీట్ రూట్ తురుము కూడా చేర్చుకోవాలి. ఎప్పుడు ఒకే రకమైన పప్పు దినుసులను తినకూడదు. అప్పుడప్పుడు రకరకాల పప్పుధాన్యాలను తింటూ ఉండాలి.

మినప గారెలను తినొద్దు. అందుకు ఆ పప్పును వడలుగా చేసుకుని తింటే బాగుంటుంది. అందులో కొంచెం క్యారెట్, పాలకూర వేసిన రుచికి రుచి అదిరిపోతుంది. చపాతీ పుల్కాతో పాటు గోధుమ పిండితో పుల్కాలను చేసుకోవాలి. పూరీలు తినొద్దు. అందుకు బదులుగా చపాతీలు తినడమే శ్రేయస్కరం. అలాగే కూరను మెంతికూరతో కలిసి తింటే అద్భుతంగా ఉంటుంది. తెల్ల బ్రెడ్ తినొద్దు. దానికి బదులుగా బ్రౌన్ బ్రెడ్ గుడ్డుతో కలిపి తీసుకోవాలి. అప్పుడే షుగర్ కంట్రోల్ చేయడం సాధ్యపడుతుంది.

Read Also : DIABETES FOODS : షుగర్ ఉన్నవారు ఎలాంటి ఆహారం తీసుకోవటం మేలు!

ట్రెండింగ్ వార్తలు