కలకత్తాలో 50 కేజీల బంగారంతో దుర్గమ్మ విగ్రహం

దసరా అంటే పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కలకత్తా కాళీకామాత గుర్తుకొస్తుంది. దసరాలో చేసే శరన్నవరాత్రి వేడుకలకు బెంగాల్ ముస్తాబవుతోంది. ఈ సంవత్సరం కలకత్తా వేడుకలు మరింత ప్రత్యేకతను సంతరించుకున్నాయి. దుర్గాదేవి భారీ విగ్రహాన్ని బంగారంతో తయారు చేస్తున్నారు. దీంతో అమ్మవారి వేడుకల్లో ఈ భారీ బంగారు విగ్రహం ప్రధాన ఆకర్షణగా వెలిగిపోనుంది.
13 అడుగుల ఎత్తుతో తయారయ్యే అమ్మవారి విగ్రహాన్ని 50 కేజీల బంగారంతో తయారుచేస్తున్నారు. దీని విలువ 20 కోట్లకు పైనే ఉంది. బంగారంతో తయారు చేసిన ఈ అమ్మవారి విగ్రహాన్ని సెంట్రల్ కోల్‌కతాలోని సంతోష్ మిత్ర స్క్వేర్ వద్ద ఉన్న మండపంలో ప్రతిష్టించనున్నారు.
ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ..మేలిమి బంగారంతో విగ్రహాన్ని తయారు చేస్తున్నామని..మా కనక దుర్గే ఈమే అనే పేరుతో .. 50 కిలోల బంగారాన్నివిగ్రహం తయారీలో వినియోగిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం బంగారం ధర 10 గ్రాముల బంగారం ధర రూ .40,000గా ఉంది. దీంతో ఈ విగ్రహం ఖరీదు దాదాపు 20 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు నిర్వాహకులు.