Weight Loss : అధిక కొవ్వు సమస్య నుండి బయటపడాలంటే ఈ పండ్లను రోజువారి ఆహారంలో చేర్చుకోండి!
బరువు సమస్య ధరిచేరకుండా ఉండాలన్నా, పెరిగిన బరువును తగ్గించుకోవాలన్నా మన జీవన విధానంతోపాటు ఆహారపు అలవాట్లను మార్చకోవాలి. కొవ్వు పెరగటానికి కారణమయ్యే పదార్థాలను దూరంగా పెట్టాలి.

Add these fruits to your daily diet to get rid of excess fat!
Weight Loss : ముఖ్యంగా తినే ఆహారం, మన జీవనశైలి కారణంగా అధిక బరువు సమస్య ఉత్పన్నం అవుతుంది. శరీరంలో కొవ్వు పేరుకోవడంవల్ల చాలా మంది అధికబరువు సమస్యతో బాధపడుతున్నారు. శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువుగా ఉంటే అది గుండె సంబంధిత వ్యాధులతో పాటు, మధుమేహనికి దారితీయవచ్చు. పొట్ట, పిరుదులు, నడుము భాగాల్లో కొవ్వు పేరుకుపోయి చాలా ఆరోగ్య సమస్యలకు దారితీసస్తుంది. బరువు సమస్య ధరిచేరకుండా ఉండాలన్నా, పెరిగిన బరువును తగ్గించుకోవాలన్నా మన జీవన విధానంతోపాటు ఆహారపు అలవాట్లను మార్చకోవాలి. కొవ్వు పెరగటానికి కారణమయ్యే పదార్థాలను దూరంగా పెట్టాలి. కొవ్వు తగ్గించే ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడేవారు సమతుల్యమైన ఆహారంతో పాటు కొన్ని రకాల పండ్లను తీసుకోవటం ద్వారా కొవ్వును సులభంగా తగ్గించుకోవచ్చు.
అధిక కొవ్వు సమస్య తొలగించే పండ్లు ;
1.అరటి పండ్లు: ఏ సీజన్‌లో అయినా దొరికే ఈ పండ్లను తీసుకోవడం ద్వారా కూడా బరువు తగ్గొచ్చు. వీటిలో చక్కెర శాతం అధికంగా ఉండడంతో ఇవి తిన్నతర్వాత చాలాసేపటి వరకు ఆకలి వేయదు. పైగా వాటిలోని ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం శరీరానికి కావాల్సిన శక్తినిస్తాయి. తక్కువ మోతాదులో తీసుకున్నా ఎక్కువ శక్తి పొందవచ్చు. బరువు పెరిగే అవకాశమే ఉండదు.
2. కమలా పండ్లు : ఈ పండ్లలో పీచు పదార్థం అధికంగా ఉంటుంది. అంతేగాక విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అందుకే ఈ పండ్లను తినడంవల్ల సులువుగా బరువు తగ్గుతారు.
3.ఆపిల్ పండ్లు: ఈ పండ్లు తీసుకోవడంవల్ల రక్తప్రరణ మెరుగుపడుతుంది. అంతేగాక ఈ పండ్లలో నీటి శాతం అధికంగా ఉంటుంది. కాబట్టి ఈ పండ్లు తరచూ తినడంవల్ల కూడా సులువుగా బరువు తగ్గేందుకు అవకాశం ఉంటుంది.
4. కివీ పండ్లు: శీతాకాలంలో మాత్రమే దొరికే ఈ పండ్లల్లో విటమిన్ సి, ఇ, ఫోలేట్, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. కొలెస్టరాల్‌ను అదుపు చేసి బరువును తగ్గించడంలో ఈ పండ్లు ప్రముఖ పాత్ర పోషిస్తాయి.
5. పుచ్చ పండ్లు: అధికంగా నీటి శాతాన్ని కలిగి వుండే ఈ పండ్లను తినడంవల్ల అవలీలగా బరువు తగ్గుతారు. ఈ పండ్లలో కేలరీస్ చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి ఒంట్లోని కొవ్వు శాతం బాగా తగ్గుతుంది.
6. ద్రాక్ష పండ్లు: ఈ ద్రాక్ష పండ్లలో కూడా నీటి శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ పండ్లు కూడా శరీర బరువు తగ్గించడంలో బాగా ఉపయోగపడుతాయి.
7. బెర్రీ పండ్లు: యాంటీ ఇన్‌ఫ్లమేటరీ కాంపౌండ్స్ ఎక్కువగా ఉండే బెర్రీస్‌ని తీసుకోవడంవల్ల వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. అదేవిధంగా శరీర బరువూ తగ్గుతుంది.