Binge Eating Disorder
Binge Eating Disorder Symptoms : అతిగా తినే రుగ్మత గురించి చెప్పాలంటే అధిక మొత్తంలో ఆహారాన్ని కొద్ది సమయం తేడాతో తీసుకోవడం, తినే ఆహారంపై నియంత్రణ కోల్పోవడం వంటి లక్షణాలను కలిగి ఉంటారు. ఈ పరిస్ధితి సాధారణంగా భావోద్వేగాలు, మానసిక పరమైన సమస్యలు, ఇతర ఇబ్బందికరమైన పరిస్ధితులకు కారణంగా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలాంటి వాటితో ఎవరైనా బాధపడుతూ అంతిగా తింటుంటే మాత్రం వారు సమస్య పరిష్కారం కోసం వైద్యులను సంప్రదించటం మంచిది. అతిగా తినటం అన్నది అనేక శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలకు కారణమవుతుంది.
READ ALSO : High Cholesterol : అధిక కొలెస్ట్రాల్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడే ఆహార కలయికలు ఇవే ?
అతిగా తినే రుగ్మత వల్ల ఎదురయ్యే పరిణామాలు.. సంబంధిత వ్యాధులు ;
1. ఊబకాయం ; అతిగా తినడం వల్ల బరువు పెరుగుతారు. ఊబకాయం వచ్చే అవకాశం ఉంటుంది. ఇది గుండె జబ్బులు, టైప్ 2 మధుమేహం, అధిక రక్తపోటుతో సహా అనేక అనారోగ్యాలతో ముడిపడి ఉంటుంది.
2. జీర్ణశయాంతర సమస్యలు ; కడుపులో అసౌకర్యం, యాసిడ్ రిఫ్లక్స్ , ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి. అతిగా తినడం వల్ల కొన్ని జీర్ణ రుగ్మతలు బాధిస్తాయి.
3. మెటబాలిక్ డిజార్డర్స్ ; అతిగా తినడం అనేది సాధారణ జీవక్రియ విధులకు ఆటంకం కలిగించటం ద్వారా మెటబాలిక్ సిండ్రోమ్, ఇన్సులిన్ నిరోధకత మరియు డైస్లిపిడెమియా కి దారితీసే ప్రమాదం ఉంటుంది.
READ ALSO : High Cholesterol : అధిక కొలెస్ట్రాల్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడే ఆహార కలయికలు ఇవే ?
4. మానసిక ఆరోగ్య సమస్యలు ; డిప్రెషన్, ఆందోళన , ఆత్మన్యూనత, అతిగా తినే రుగ్మతలతో బాధపడాల్సి వస్తుంది. ఈ వ్యాధులు ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి.
5. పోషకాహార లోపాలు ; అతిగా తినడం కొన్ని సందర్భాల్లో అనారోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడంతో పాటు, ముఖ్యమైన పోషకాలను తీసుకోకుండా ఉండేలా చేస్తుంది. విటమిన్లు, ఖనిజాలు,ఇతర కీలకమైన పోషకాల లోపాల వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.
6. కార్డియోవాస్కులర్ సమస్యలు ; అతిగా తినడం, ముఖ్యంగా కొవ్వు, చక్కెర అధికంగా ఉన్న ఆహారాలను తీసుకోవటం వల్ల గుండె జబ్బులు మరియు స్ట్రోక్ వంటి హృదయ సంబంధ సమస్యలు పెరిగే అవకాశం ఉంటుంది.
READ ALSO : Bloating : ఆరోగ్యకరమైన ఆహారం తీసుకున్నాకడుపు ఉబ్బరంగా ఉంటుందా? ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసా?
7. భావోద్వేగాలు పెరగటం ; అతిగా తినడం వల్ల అపరాధం, అవమానం, దుఃఖం వంటి భావాలు కలుగుతాయి. ఈ భావోద్వేగాలు మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. అంతేకాకుండా హానికరమైన ఆహారపు అలవాట్ల వైపు దృష్టి మరలేలా చేస్తాయి.
అదే క్రమంలో అతిగా తినే వారందరిలో ఇలాంటి ప్రభావాలే ఉండాలని ఏమీ లేదు. ప్రతి వ్యక్తికి, వ్యక్తికి మధ్య పరిస్ధితులు భిన్నంగా ఉండవచ్చు.