Bloating : ఆరోగ్యకరమైన ఆహారం తీసుకున్నాకడుపు ఉబ్బరంగా ఉంటుందా? ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసా?

ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటున్నామని చాలా మంది భావిస్తుంటారు. సూపర్‌ఫుడ్, ఆకుకూరలు, సలాడ్‌లు తీసుకుంటున్నా ఏదో ఒకవిధంగా, కడుపు ఉబ్బరానికి లోనుకావాల్సి వస్తుంది. కడుపు ఉబ్బరం అసౌకర్యాన్ని కలిగిస్తుంది. తినే సందర్భంలో ఈ పరిస్ధితి ఉండదు. తిన్న కొంత సేపటి తరువాత ఒక్కసారిగా ఉబ్బరం కలగటం ఇబ్బందిని కలిగిస్తుంది.

Bloating : ఆరోగ్యకరమైన ఆహారం తీసుకున్నాకడుపు ఉబ్బరంగా ఉంటుందా? ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసా?

healthy diet causes bloating

Bloating : ఆహార ప్రియులు రోజువారిగా వివిధ రకాల ఆహార పదార్ధాలను తీసుకుంటుంటారు. దీంతో కడుపు ఉబ్బరంగా మారి ఇబ్బంది కరమైన పరిస్ధితిని ఎదుర్కోవాల్సి వస్తుంది. నిత్యం జిడ్డు, కొవ్వు ,చక్కెరతో కూడిన ఆహారం తీసుకున్నప్పుడు మాత్రమే కాకుండా, కొన్ని సార్లు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తిన్నప్పటికీ, ఉబ్బరం, ఆమ్లత్వం , మలబద్ధకం సమస్యలు కనిపిస్తుంటాయి.

READ ALSO : Reduce Gas Problem : ఈ ఆహారాలకు దూరంగా ఉంటే గ్యాస్ సమస్యను తగ్గించుకోవచ్చు!

కడుపు ఉబ్బరాన్ని పోగొట్టుకునేందుకు ఇంటి నివారణలను చిట్కాలను పాటించినప్పటికీ ఏమాత్రం ఫలితం ఉండదు. ఈసందర్భంలో దాని వెనుక ఉన్న అసలు కారణాన్ని తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆహారాన్ని నమలడం, అధిక ఒత్తిడి స్థాయిలు నిరంతర ఉబ్బరానికి ముఖ్యకారణమని నిపుణులు సూచిస్తున్నారు.

ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటున్నామని చాలా మంది భావిస్తుంటారు. సూపర్‌ఫుడ్, ఆకుకూరలు, సలాడ్‌లు తీసుకుంటున్నా ఏదో ఒకవిధంగా, కడుపు ఉబ్బరానికి లోనుకావాల్సి వస్తుంది. కడుపు ఉబ్బరం అసౌకర్యాన్ని కలిగిస్తుంది. తినే సందర్భంలో ఈ పరిస్ధితి ఉండదు. తిన్న కొంత సేపటి తరువాత ఒక్కసారిగా ఉబ్బరం కలగటం ఇబ్బందిని కలిగిస్తుంది.

READ ALSO : కడుపుబ్బరం పోవాలంటే..

పేగు మీ ఆరోగ్యాన్ని కాపాడుకునే బిలియన్ల మైక్రోఫ్లోరాలతో రూపొందించబడి ఉంటుంది. రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడతాయి, బరువు తగ్గడంలో సహాయపడతాయి, వ్యాధిని నివారించవచ్చు మానసిక స్థితిని మెరుగుపరుస్తాయి. కడుపు ఉబ్బరం అనేది జీర్ణక్రియ, చెడు ఆహారం , అవాంఛిత బ్యాక్టీరియా పెరుగుదలతో ముడిపడి ఉంటుంది. ప్రేగులలో కొన్నిసార్లు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు పొట్ట ఉబ్బరానికి దారితీయవచ్చని నిపుణులు చెబుతున్నారు.

ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి ;

గ్యాస్ మరియు ఉబ్బరం కలిగించే కొన్ని కూరగాయలు ఉన్నాయి. అలాంటి వాటిని నివారించటం మంచిది. బ్రోకలీ మరియు కాలీఫ్లవర్ వంటి క్రూసిఫెరస్ కూరగాయలు, కొన్ని ఆరోగ్యకరమైన ఆహారాల్లో జీర్ణంకాని చక్కెరలు అధికంగా ఉండటం వల్ల కడుపు ఉబ్బరానికి కారణమవుతాయి, ఇవి జీర్ణాశయంలో పులిసిపోయి గ్యాస్‌కు కారణమవుతాయి.

READ ALSO : Diabetes : మధుమేహంతో బాధపడుతున్నవారు వేసవి ఉష్ణోగ్రతల వల్ల ఎదురయ్యే సమస్యలను నివారించడానికి పాటించాల్సిన చిట్కాలు !

రోజంతా అల్పాహారం గడిపేవారిలో మైగ్రేటింగ్ మోటార్ కాంప్లెక్స్ అని పిలవబడే వాటికి ఆటంకం కలిగిస్తుంది. దీని వల్ల కూడా కడుపు ఇబ్బరం కలుగుతుంది. తగినంత ఆహారం తీసుకోకపోవడం వల్ల కూడా శరీరంపై ఒత్తిడి పెరుగుతుంది. దీని కారణంగా జీర్ణక్రియ మందగించడం వల్ల ఉబ్బరం పెరుగుతుంది

ఒత్తిడి కారణంగా జీర్ణక్రియ గణనీయంగా మందగించడం వల్ల ఉబ్బరం పెరుగుతుంది. నిద్రలేమి కారణంగా కూడా ఉబ్బరం పరిస్ధితి ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి శారీరక ప్రక్రియ సజావుగా ఉండాలంటే కంటికి సరిపడా నిద్ర చాలా ముఖ్యం. అధిక స్ధాయి శారీరక వ్యాయామాలు ఒత్తిడి కలిగిస్తాయి. దీంతో జీర్ణప్రక్రియ మందగించి కడుపు ఉబ్బరం అధికమౌతుంది.

READ ALSO : Bloating : వేసవిలో కడుపు ఉబ్బరాన్ని నివారించే పానీయం ఇదే !

చాలా మంది త్వరత్వరగా ఆహారాన్ని నమిలి తినకుండా మింగేస్తుంటారు. దీని వల్ల కూడా ఉబ్బరం పరిస్ధితి ఎదుర్కోవాల్సి వస్తుంది. నమలడం వల్ల ఆహారం యొక్క రసాయన విచ్ఛిన్నం ప్రారంభమవుతుంది.దంతాలతో ఆహారాన్ని భౌతికంగా విచ్ఛిన్నం చేయగలిగితే, జీర్ణవ్యవస్థపై తక్కువ పని చేస్తుంది. ఉబ్బరం పరిస్ధితి తగ్గుతుంది. ఆహారాన్ని 15-30 సార్లు నమిలి తినాలి.