Diabetes : మధుమేహంతో బాధపడుతున్నవారు వేసవి ఉష్ణోగ్రతల వల్ల ఎదురయ్యే సమస్యలను నివారించడానికి పాటించాల్సిన చిట్కాలు !

ఎండ వేడి ఇన్సులిన్ తోపాటు ఇతర మధుమేహ ఔషధాల శక్తిని ప్రభావితం చేస్తుంది. కాబట్టి మందులను బయట వేడి ఉష్ణోగ్రతలకు గురికాకుండా ఫ్రిజ్ లేదా ఇన్సులేటెడ్ బ్యాగ్ వంటి చల్లని ప్రదేశంలో ఉంచటం మంచిది.

Diabetes : మధుమేహంతో బాధపడుతున్నవారు వేసవి ఉష్ణోగ్రతల వల్ల ఎదురయ్యే సమస్యలను నివారించడానికి పాటించాల్సిన చిట్కాలు !

diabetes

Diabetes : వేసవి ఉష్ణోగ్రతలు పెరుగుతున్ననేపధ్యంలో మధుమేహం ఉన్నవారు కొన్ని సమస్యలను నివారించడానికి అదనపు జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. అధిక ఉష్ణోగ్రతలు రక్తంలో చక్కెర స్థాయిలను ప్రభావితం చేస్తాయి. డీహైడ్రేషన్ ప్రమాదాన్ని పెంచుతాయి, ఇది తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.

READ ALSO : Foods to Avoid in Summer : వేసవిలో ఈ ఆహారాల విషయంలో జాగ్రత్తలు ఆరోగ్యానికి మంచిది !

వేసవి అధిక ఉష్ణోగ్రతల సమయంలో సురక్షితంగా, ఆరోగ్యంగా ఉండటానికి చిట్కాలు;

హైడ్రేటెడ్ గా ఉండటం : నిర్జలీకరణం ఎవరికైనా ప్రమాదకరం. అయితే మధుమేహం ఉన్నవారికి ఇది చాలా ప్రమాదకరం. రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉన్నప్పుడు, శరీరం మూత్రం ద్వారా ఎక్కువ ద్రవాలను కోల్పోతుంది, ఇది నిర్జలీకరణానికి దారితీస్తుంది. దాహం వేసినా , వేయకపోయినా రోజంతా తగినంత మొత్తంలో నీటిని తీసుకోవడం ద్వారా హైడ్రేటెడ్‌గా ఉండటం ముఖ్యం.

మందులను చల్లని ప్రదేశంలో ఉంచండి : ఎండ వేడి ఇన్సులిన్ తోపాటు ఇతర మధుమేహ ఔషధాల శక్తిని ప్రభావితం చేస్తుంది. కాబట్టి మందులను బయట వేడి ఉష్ణోగ్రతలకు గురికాకుండా ఫ్రిజ్ లేదా ఇన్సులేటెడ్ బ్యాగ్ వంటి చల్లని ప్రదేశంలో ఉంచటం మంచిది.

READ ALSO : Fish Farming : వేసవిలో చేపల చెరువుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

రక్తంలో చక్కెరను తరచుగా తనిఖీ చేసుకోండి : ఎండ వేడి రక్తంలో చక్కెర స్థాయిలను హెచ్చుతగ్గులకు గురి చేస్తుంది. కాబట్టి చక్కెర స్థాయిలను తరచుగా పర్యవేక్షించడం చాలా ముఖ్యం. రక్తంలో చక్కెర స్థాయిలలో మార్పుల చోటు చేసుకుంటుంటే ఇన్సులిన్ లేదంటే దానికి సంబంధించిన మందుల మోతాదులతో సర్దుబాటు చేయాల్సి ఉంటుంది.

లేత-రంగు, వదులుగా ఉండే దుస్తులను ధరించండి : ముదురు రంగు దుస్తులు ఎక్కువ వేడిని గ్రహిస్తాయి. ఎక్కువ వేడిగా అనిపించేలా చేస్తాయి. వదులుగా ఉండే దుస్తులు శరీరానికి గాలి ప్రసరించేలా చేస్తాయి. అంతేకాకుండా చల్లగా ఉంచడంలో సహాయపడతాయి.

READ ALSO : Summer Super Food : వేసవి కాలంలో శరీరానికి అన్ని విధాలుగా మేలు చేసే పెరుగు !

సూర్యరశ్మికి ఎక్కువసేపు గురికావొద్దు : ప్రత్యక్ష సూర్యకాంతి శరీర ఉష్ణోగ్రత త్వరగా పెరగడానికి కారణమవుతుంది, ఇది అలసట లేదా హీట్ స్ట్రోక్‌కు దారితీస్తుంది. వీలైనంత వరకు నీడ ఉన్న ప్రదేశాలలో ఉండటానికి ప్రయత్నించండి. సూర్యుని నుండి ముఖం, కళ్ళను రక్షించడానికి టోపీ , సన్ గ్లాసెస్ ధరించండి.

ఎయిర్ కండిషన్ ఉన్న ప్రదేశాలలో విశ్రాంతి తీసుకోండి : ఆరుబయట ఎక్కువ సమయం గడుపుతున్నట్లయితే ఇది ఏమాత్రం మంచిది కాదని గుర్తించండి. ఎయిర్ కండిషన్డ్ సదుపాయం ఉన్న భవనాలు లేదా వాహనాల్లో విశ్రాంతి తీసుకోవడానికి ప్రయత్నించండి. ఇది శరీరాన్ని చల్లబరుస్తుంది. డీహైడ్రేషన్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

READ ALSO : Bloating And Gas : వేసవిలో ఈ ఆహారాలు తీసుకుంటే కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలను ఎదుర్కోవచ్చు తెలుసా ?

చల్లటి సమయాల్లో మాత్రమే బయటి పనులు ప్లాన్ చేసుకోండి ; రోజులో ఎండ అధికంగా ఉండే సమయంలో వ్యాయామం చేయడం, ఇతర కఠినమైన శారీరక కార్యకలాపాలు చేయడం మానుకోండి. ఉష్ణోగ్రతలు చల్లగా ఉన్నప్పుడు ఉదయాన్నే లేదా సాయంత్రం సమయాల్లో మాత్రమే వ్యాయమాలు, ఇతర కార్యకలాపాలను కొనసాగించటం మంచిది.

వేసవి వాతావరణ పరిస్థితుల్లో ఎదురయ్యే సమస్యలను అధిగమించేందుకు వైద్యుల సూచనలు, సలహాలు తీసుకోవటం మంచిది.