Arjun Kapoor is diagnosed with Hashimoto’s disease
Arjun Kapoor : బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్ సింఘం ఇటీవలే ఎగైన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ సక్సెస్ మీట్ సందర్భంగా అర్జున్ కపూర్ తన ఆరోగ్య సమస్యల గురించి అనేక విషయాలను రివీల్ చేశాడు. డిప్రెషన్, హసిమోటో వ్యాధితో తాను బాధపడుతున్నట్లు పేర్కొన్నాడు. ఈ అనారోగ్యం కారణంగా తాను బరువు సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నానని చెప్పుకొచ్చాడు. తనతో పాటు తల్లి, సోదరి అన్షులా కపూర్ కూడా ఇదే ఆటో ఇమ్యూనో డిజార్డర్ సమస్యతో బాధపడుతున్నారని అర్జున్ కపూర్ పేర్కొన్నాడు.
“నేను ఎప్పుడూ దీని గురించి మాట్లాడలేదు. కానీ, నాకు థైరాయిడ్ గ్రంథికి సంబంధించిన హషిమోటోస్ వ్యాధి కూడా ఉంది. నేను విమానంలో ప్రయాణిస్తే బరువు పెరగవచ్చు. ఎందుకంటే.. అలాంటి పరిస్థితుల్లో నా శరీరం ఇబ్బందికి గురవుతుంది” అని అర్జున్ తెలిపాడు. ఈ ఆటో ఇమ్యూనో డిజార్డర్ అంటే ఏంటి? దీని లక్షణాలు ఎలా ఉంటాయి? ఎలాంటి నివారణ చర్యలను తీసుకోవాలో వివరంగా తెలుసుకుందాం.
హషిమోటో వ్యాధి అంటే ఏమిటి?
హషిమోటోస్ అనేది థైరాయిడ్ గ్రంధికి సంబంధించిన వ్యాధి. థైరాయిడ్ అనేది మెడలోని ఒక చిన్న, సీతాకోకచిలుక ఆకారపు గ్రంథి. జీవక్రియతో సహా అనేక ముఖ్యమైన శారీరక కార్యకలాపాలను నియంత్రిస్తుంది. రోగనిరోధక వ్యవస్థ థైరాయిడ్ గ్రంధిపై పొరపాటున దాడి చేసినప్పుడు హషిమోటోస్ వ్యాధి సంభవిస్తుంది. ఎర్రబడటంతో పాటు ధైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయదు. కాలక్రమేణా, థైరాయిడ్ పూర్తి పనిచేయని స్థితికి చేరుకోవచ్చు. కొన్నిసార్లు దీనిని హైపోథైరాయిడిజం అని కూడా పిలుస్తారు.
హషిమోటో వ్యాధికి కారణాలివే :
హషిమోటోస్ వ్యాధి థైరాయిడ్ పూర్తి స్థాయిలో పనిచేయకపోవడమే. ఇందులో మీ శరీరం రోగనిరోధక వ్యవస్థ, కణాలు, అవయవాలను నాశనం చేస్తుంది. సాధారణంగా, మీ రోగనిరోధక వ్యవస్థ బ్యాక్టీరియా, వైరస్‌ల వంటి హానికరమైన వాటినుంచి మీ శరీరాన్ని రక్షిస్తుంది. అయినప్పటికీ, హషిమోటో వ్యాధిలో ఈ కింది సమస్యలు సంభవిస్తాయి.
హషిమోటో వ్యాధి లక్షణాలివే :
హషిమోటోస్ వ్యాధి ఉన్న కొంతమంది వ్యక్తుల్లో మొదట ఎలాంటి లక్షణాలు ఉండకపోవచ్చు. థైరాయిడ్ గ్రంధి విస్తరించి అది గాయిటర్ వ్యాధికి దారితీస్తుంది. గాయిటర్స్ అనేది హషిమోటో వ్యాధికి ఒక సాధారణ సమస్య. ఇది మీ దిగువ మెడలో ఉంటుంది. వాపు కారణంగా మీ మెడ ముందు భాగాన్ని పెద్దదిగా కనిపించేలా చేస్తుంది.
హషిమోటోస్ వ్యాధి హైపోథైరాయిడిజమ్‌గా మారితే ఈ లక్షణాలు కనిపిస్తాయి.
హషిమోటో వ్యాధి చికిత్స :
మీ థైరాయిడ్ హైపోథైరాయిడిజమ్‌తో ఎంతగా దెబ్బతిన్నది అనేదానిపై హషిమోటోస్ వ్యాధికి చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. మీకు హైపో థైరాయిడిజం లేకుంటే.. మీ వైద్యుడు మందులను సూచించకపోవచ్చు. దానికి బదులుగా మీ లక్షణాలను, థైరాయిడ్ హార్మోన్ స్థాయిలను పర్యవేక్షించవచ్చు. మీకు హైపోథైరాయిడిజం ఉంటే.. మీరు మాత్రలు, జెల్ క్యాప్సూల్ లేదా లిక్విడ్ రూపంలో మందులు తీసుకోవచ్చు. లెవోథైరాక్సిన్ అని పిలిచే ఈ ఔషధం సహజమైన థైరాయిడ్ హార్మోన్ టీ-4 రసాయన లేదా సింథటిక్ వెర్షన్ అని చెప్పవచ్చు.
మీరు చికిత్స ప్రారంభించిన 6 నుంచి 8 వారాల తర్వాత మీ డాక్టర్ మీ థైరాయిడ్ పనితీరును చెక్ చేయమని సూచిస్తారు. ఇందుకోసం (TSH) పరీక్షను నిర్వహిస్తారు. సరైన మోతాదును నిర్ణయించిన తర్వాత పరీక్ష 6 నెలల్లో మళ్లీ ఒక సంవత్సరంలో చేయాల్సి ఉంటుంది. హషిమోటో వ్యాధికి ఎలాంటి నివారణ లేదు. మీరు మీ జీవితాంతం ఈ ప్రిస్క్రిప్షన్ తీసుకోవాలి.