Asteroid Apophis : 2029లో భూమికి అతి దగ్గరగా రానున్న భారీ గ్రహశకలం.. 1100 అడుగుల ‘అపోఫిస్’తో ముప్పు పొంచి ఉందా?
Asteroid Apophis : ఖగోళ శాస్త్రవేత్తలు రాయ్ టక్కర్, డేవిడ్ థోలెన్, ఫాబ్రిజియో బెర్నార్డిచే మార్చి 2004లో ఈ అపోఫిస్ గ్రహశకలాన్ని గుర్తించారు. ఒకప్పుడు భూమికి సమీపంలో ఉన్న అత్యంత ప్రమాదకరమైన ఖగోళ వస్తువులలో ఇదొకటి.

Asteroid Apophis
Asteroid Apophis : మన భూమికి అతి దగ్గరగా ఓ భారీ గ్రహశకలం దూసుకువస్తోంది. 99942 అనే అపోఫిస్ లేదా “గాడ్ ఆఫ్ ఖోస్” అతిపెద్ద ఆస్టరాయిడ్ ఏప్రిల్ 13, 2029న భూమికి అతి దగ్గరగా రానుంది. 2004లో కనుగొన్న దాదాపు 1,100 అడుగుల వెడల్పు ఉన్న అపోఫిస్ భూమిపైకి దూసుకువచ్చే అవకాశం ఉందని ముందస్తుగా ఖగోళ శాస్త్రవేత్తలు అంచనా వేశారు. అయినప్పటికీ, ఈ గ్రహశకలం మన గ్రహం మీదుగా సాధారణ ఉపగ్రహాలకు సమానమైన దూరంలో సురక్షితంగా పయనించనుంది. భూమి ఉపరితలం నుంచి 19,794 మైళ్ల దూరంలో ఈ గ్రహశకలం దూసుకెళ్లనుంది. ఈ సమయంలో అపోఫిస్ అధ్యయనం చేసేందుకు ఖగోళ శాస్త్రవేత్తలకు అవకాశాన్ని అందిస్తుంది.
అపోఫిస్‌తో భూమికి ముప్పు ఉందా? :
ఖగోళ శాస్త్రవేత్తలు రాయ్ టక్కర్, డేవిడ్ థోలెన్, ఫాబ్రిజియో బెర్నార్డిచే మార్చి 2004లో ఈ అపోఫిస్ గ్రహశకలాన్ని గుర్తించారు. ఒకప్పుడు భూమికి సమీపంలో ఉన్న అత్యంత ప్రమాదకరమైన వస్తువులలో ఇదొకటి. ముందస్తు అంచనా ముప్పు 2029 తర్వాత 2036లో భూమికి అతి దగ్గరగా దూసుకురానుంది. మార్చి 2021లో రాడార్ పరిశీలనలు భూమి కనీసం ఒక శతాబ్దం పాటు అపోఫిస్ ప్రభావాన్ని ఎదుర్కోదని సూచించింది.
ఈ గ్రహశకలంతో భూమికి ఎలాంటి ముప్పు లేదని నిర్ధారించింది. అపోఫిస్ గ్రహశకలానికి పురాతన ఈజిప్టు దేవుడు పేరు పెట్టారు. భూమికి అతిదగ్గరగా దూసుకొచ్చే భారీ గ్రహశకలాల్లో ఇదొకటి. అపోఫిస్ అనేది సిలికేట్ రాక్, నికెల్, ఇనుముతో కూడిన రాతి గ్రహశకలం. అంగారకుడు, బృహస్పతి మధ్య గ్రహశకలాల బెల్ట్‌లో ఉద్భవించింది. భూమి కక్ష్య మార్గానికి దగ్గరగా కదులుతుంది. 2029 ఫ్లైబై శాస్త్రవేత్తలకు ఇదొక మైలురాయి. ఎందుకంటే.. భూమికి ముప్పు లేకుండా విశ్వ అవశేషాలను అతి దగ్గరగా చూడవచ్చు.
Read Also : UPI 123Pay Payments : ఇంటర్నెట్ అక్కర్లేదు.. స్మార్ట్‌ఫోన్ లేకుండానే యూపీఐ పేమెంట్స్ చేయొచ్చు!