UPI 123Pay Payments : ఇంటర్నెట్ అక్కర్లేదు.. స్మార్ట్‌ఫోన్ లేకుండానే యూపీఐ పేమెంట్స్ చేయొచ్చు!
RBI UPI Payments : యూపీఐ 123పే అనేది స్మార్ట్‌ఫోన్ యేతర, ఫీచర్ ఫోన్ యూజర్ల కోసం రూపొందించింది. ఇంటర్నెట్ యాక్సెస్ లేకుండానే యూపీఐ సేవలను ఉపయోగించేందుకు వీలు కల్పిస్తుంది.

Making UPI Payments Without Smartphone
RBI UPI Payments : యూపీఐ 123పే లిమిట్.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇటీవల యూపీఐ 123పే కోసం లావాదేవీ పరిమితిని రూ. 5వేల నుంచి రూ. 10వేలకి పెంచింది. అయితే, యూపీఐ 123పే అంటే ఏంటో తెలుసా? యూపీఐ 123పే అనేది స్మార్ట్‌ఫోన్ యేతర, ఫీచర్ ఫోన్ యూజర్ల కోసం రూపొందించింది. ఇంటర్నెట్ యాక్సెస్ లేకుండానే యూపీఐ సేవలను ఉపయోగించేందుకు వీలు కల్పిస్తుంది.
యూపీఐ 123పే కింద లావాదేవీలు ఉచితంగా పూర్తి చేయొచ్చు. యూపీఐ పిన్ అనేది మొబైల్ యాప్. ఐవీఆర్ లేదా మరొక ఛానెల్ ద్వారా మీ ప్రారంభ రిజిస్ట్రేషన్ సమయంలో మీరు క్రియేట్ చేసే 4-6 అంకెల పాస్‌కోడ్. అన్ని బ్యాంక్ లావాదేవీలను అథెంటికేట్ చేసేందుకు ఈ యూపీఐ పిన్ అవసరం. అక్టోబర్ 9, 2024న అభివృద్ధి, నియంత్రణ విధానాలపై ఆర్బీఐ ప్రకటన చేసింది. భారత్‌లోని ఫీచర్ ఫోన్ యూజర్ల కోసం డిజిటల్ పేమెంట్ ఎక్స్పీరియన్స్ మెరుగుపరచడమే లక్ష్యంగా పెట్టుకుంది.
ముఖ్యంగా, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఈ మార్పును అక్టోబర్ 25, 2024 నాటి సర్క్యులర్‌లో ధృవీకరించింది. గడువు తేదీ జనవరి 1, 2025కి సెట్ అయింది. యూపీఐ 123పే ద్వారా కస్టమర్లు తమకు అందించిన జాబితా నుంచి లాంగ్వేజీని ఎంచుకోవచ్చు. లాంగ్వేజీల జాబితాలో ఇంగ్లీష్, హిందీ, కన్నడ, తమిళం, బెంగాలీ, మలయాళం, తెలుగు భాషల్లో అందుబాటులో ఉంది.
యూపీఐ 123 పేమెంట్ : పేమెంట్ మెథడ్స్ ఇవే :
యూపీఐ 123పే స్మార్ట్‌ఫోన్, ఫీచర్ ఫోన్ యూజర్లకు 4 సపోర్టు చేసే మెథడ్స్ ద్వారా వివిధ డిజిటల్ లావాదేవీలను నిర్వహించవచ్చు. ఐవీఆర్ నంబర్ ద్వారా వాయిస్ పేమెంట్, సౌండ్ ఆధారిత పేమెంట్లు, మిస్డ్ కాల్ ఆధారిత పేమెంట్ ఆప్షన్లు, యాప్ ఆధారిత స్కాన్-అండ్-పే ఫీచర్ ఫీచర్ ఫోన్లలో యాక్సస్ చేయొచ్చు.
యూపీఐ 123పే : కస్టమర్లు మల్టీ అకౌంట్లను లింక్ చేయలేరు :
యూపీఐ 123పేలో కస్టమర్లు మల్టీ బ్యాంక్ అకౌంట్లను కలిగి ఉండలేరు. కస్టమర్ మరో అకౌంట్ యాడ్ చేయాలనుకుంటే.. తప్పనిసరిగా ప్రస్తుత బ్యాంక్ అకౌంట్ డి-రిజిస్టర్ చేసి, ఆపై మరో బ్యాంక్ అకౌంట్ యాడ్ చేయాలి.
యూపీఐ 123పేతో బ్యాంక్ అకౌంట్ ఎలా లింక్ చేయాలి? :
- మీ బ్యాంక్ లేదా యూపీఐ సర్వీస్ ప్రొవైడర్ అందించిన యూపీఐ 123పే సర్వీస్ నంబర్‌ను డయల్ చేయండి.
- అందుబాటులో ఉన్న ఆప్షన్ల నుంచి మీకు నచ్చిన లాంగ్వేజీని ఎంచుకోండి.
- మీ బ్యాంక్ అకౌంట్ ఎంటర్ చేసేందుకు లేదా లింక్ చేసే ఆప్షన్ ఎంచుకోండి.
- చివరి 6 అంకెలు, గడువు తేదీతో సహా మీ డెబిట్ కార్డ్ వివరాలను ఎంటర్ చేయండి.
- లావాదేవీలకు సేఫ్ యూపీఐ పిన్ని క్రియేట్ చేసి ఆపై కన్ఫార్మ్ చేయండి.
- మీ బ్యాంక్ అకౌంట్ ఇప్పుడు యూపీఐ 123పేతో లింక్ చేసి యూపీఐ లావాదేవీలను పూర్తి చేయండి.