PM Internship Scheme 2024 : పీఎం ఇంటర్న్‌షిప్ స్కీమ్ 2024 రిజిస్ట్రేషన్ లాస్ట్ డేట్.. ఇప్పుడే అప్లయ్ చేసుకోండి.. పూర్తి వివరాలివే!
PM Internship Scheme 2024 : ఈ ఏడాదిలో పీఎం ఇంటర్న్‌షిప్ స్కీమ్ 2024 కింద మహీంద్రా అండ్ మహీంద్రా, ఎల్ అండ్ టీ, టాటా గ్రూప్, జూబిలెంట్ ఫుడ్‌వర్క్స్ వంటి ప్రముఖ సంస్థలలో స్పెషలైజేషన్ 24 రంగాలలో 80వేల ఇంటర్న్‌షిప్ అవకాశాలను అందిస్తుంది.

PM Internship Scheme 2024
PM Internship Scheme 2024 : కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MCA) ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ స్కీమ్ 2024 కోసం రిజిస్టర్ ప్రక్రియ నవంబర్ 10న ముగియనుంది. అభ్యర్థులు పథకం కింద అధికారిక పోర్టల్ (pminternship.mca.gov.in) ద్వారా వివిధ ఇంటర్న్‌షిప్ స్థానాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఒక్క రోజు మాత్రమే సమయం మిగిలి ఉంది. యూనియన్ బడ్జెట్ 2024లో ప్రకటించిన ఈ పథకం.. ఐదేళ్లలో కోటి మందికి పైగా అభ్యర్థులకు భారత్‌లో టాప్ 500 కంపెనీలలో ఇంటర్న్‌షిప్ అవకాశాలను అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ ఏడాదిలో ఈ పథకం మహీంద్రా అండ్ మహీంద్రా, ఎల్ అండ్ టీ, టాటా గ్రూప్, జూబిలెంట్ ఫుడ్‌వర్క్స్ వంటి ప్రముఖ సంస్థలలో స్పెషలైజేషన్ 24 రంగాలలో 80వేల ఇంటర్న్‌షిప్ అవకాశాలను అందిస్తుంది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఆయిల్ అండ్ ఎనర్జీ, ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్, మ్యానుఫ్యాక్చరింగ్, ట్రావెల్, హాస్పిటాలిటీ వంటి రంగాలు అందుబాటులో ఉన్నాయి.
పీఎం ఇంటర్న్‌షిప్ స్కీమ్ 2024 ఎలా దరఖాస్తు చేయాలి? :
- (pminternship.mca.gov.in) అనే అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి.
- హోమ్‌పేజీలో రిజిస్టర్ లింక్‌పై క్లిక్ చేసి అవసరమైన వివరాలను నింపండి.
- వివరాలను సమర్పించిన తర్వాత అందించిన సమాచారం ఆధారంగా సిస్టమ్ మీ రెజ్యూమ్‌ని ఆటోమాటిక్‌గా రూపొందిస్తుంది.
- లొకేషన్, సెక్టార్, అర్హతలు వంటి ప్రాధాన్యతలతో సహా గరిష్టంగా 5 ఇంటర్న్‌షిప్ స్థానాలకు దరఖాస్తు చేసుకోండి.
- ఫారమ్‌ను సమర్పించండి. ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం హార్డ్ కాపీని దగ్గర ఉంచుకోండి.
పీఎం ఇంటర్న్‌షిప్ పథకం 2024 అర్హత ప్రమాణాలివే :
పీఎం ఇంటర్న్‌షిప్ స్కీమ్ కోసం దరఖాస్తు చేసేందుకు అభ్యర్థులు తప్పనిసరిగా 21 ఏళ్ల నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.
కనీసం హైస్కూల్ లేదా హయ్యర్ సెకండరీ స్కూల్లో ఉత్తీర్ణులై ఉండాలి.
తప్పనిసరిగా ఐటీఐ సర్టిఫికేట్, పాలిటెక్నిక్ ఇన్స్టిట్యూట్ నుంచి డిప్లొమా లేదా బీఏ, బీఎస్‌సీ, బీకామ్, బీసీఏ, బీబీఏ లేదా బీ ఫార్మా వంటి డిగ్రీని కలిగి ఉండాలి.
పీఎం ఇంటర్న్‌షిప్ స్కీమ్ 2024 స్టైపెండ్ :
ఇంటర్న్‌షిప్ వ్యవధిలో, ఇంటర్న్‌లు రూ. 5వేల స్టైఫండ్‌ను అందుకుంటారు. ఇందులో, హోస్ట్ కంపెనీ వారి సీఎస్ఆర్ నిధుల నుంచి రూ. 500 విరాళం ఇస్తుంది. ప్రభుత్వం షార్ట్‌లిస్ట్ చేసిన ఇంటర్న్‌లకు మిగిలిన రూ. 4,500 అందిస్తుంది. ఈ పథకం షెడ్యూల్డ్ కులాలు (SC), షెడ్యూల్డ్ తెగలు (ST) ఇతర వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్ నిబంధనలకు అనుగుణంగా ఉంటుంది.
ఇంటర్న్‌షిప్‌లు 12 నెలల పాటు కొనసాగుతాయి. ఇందులో కనీసం 6 నెలలు ఉద్యోగంలో ట్రైనింగ్ ఎక్స్‌పీరియన్స్ కోసం కేటాయిస్తారు. అదనంగా, ఇంటర్న్‌లు వారి ఇంటర్న్‌షిప్ అంతటా అవసరమయ్యే ఖర్చులకు రూ. 6వేల వన్-టైమ్ స్టైఫండ్‌ను అందుకుంటారు.