Bathukamma..thanjavur bruhadeshwar
Bathukamma..thanjavur bruhadeshwar temple : బతుకమ్మ పండుగ వెనుక ఎన్నో కథలున్నాయి. ప్రకృతిలో విరబూసిన పూలనే దైవంగా కొలిచే అద్భుతమైన అపురూపమైన బతుకమ్మ పండుగ వెనుక ఎన్నో గాధలున్నాయి. శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ బతుకమ్మ పండుగ వెనుక చాలా రకాల కథలున్నాయి. ఎవరి ఎన్ని రకాలుగా చెప్పుకున్నా..‘బతుకు అమ్మా’ అంటూ సుఖంగా..సంతోషంగా బతకమని ఆడబిడ్డలను ఆశీర్వదించటమే.
గడ్డిపూలు కూడా బతుకమ్మలో మమేకమైపోతాయి. తంగేడు, గునుగు, కట్ల, బీర, గుమ్మడి, సీతమ్మ జడకుచ్చులు, బంతి, చామంతి, తామర ఇలా ఎన్నో ఎన్నెన్నో పువ్వులు బతుకమ్మ శిగలో ఇమిడిపోతాయి. తమ పుట్టుకకు సార్థకత లభించిందని మురిసిపోతాయి. బతుకమ్మ సిగలో గుమ్మడి పువ్వులో పసుపు గౌరమ్మ కొలువుదీని ఆడబిడ్డల ఆటలపాటు వింటుంది..చూస్తుంది. చల్లగా ఉండమని గౌరమ్మ ఆడబిడ్డలను ఆశీర్వదిస్తుంది.
బతుకమ్మ పండుగలో ఎన్నో కథలున్నాయి. బతుకమ్మను శివలింగం ఆకాలంలో పేర్చటం వెనుక కూడా ఓ ఆసక్తికర కథ ఉంది. ఆ కథలో శివయ్య ఉన్నాడు. తమిళనాడులోని తంజావూరులో అత్యంత ప్రసిద్ది చెందిన బృహదీశ్వరాలయంలో కొలువైన పరమశివుడు బతుకమ్మ సంబంధముందని బతుకమ్మను శివలింగ ఆకారంలో పేర్చటం వెనుక ఓ కథ ఉంది.
Bathukamma 2023 : బతుకమ్మ పండుగ వెనుక ఆసక్తికర కథలు..
బతుకమ్మని శివలింగం ఆకాలంలో పేర్చడం వెనుక ఓ పురాణగాథ ప్రచారంలో ఉంది. ప్రాచీనమైన తెలంగాణ ప్రాంతాన్ని రాష్ట్రకూట రాజులు పరిపాలించేవారు. దాదాపు రెండు వందల ఏళ్లు పాలించారు. ఈనాటికి తెలంగాణ ప్రాంతాల్లో వీరి పాలనకు సంబంధించిన శాసనాల ఆనవాళ్లు కనిపిస్తుంటాయి. వేములవాడ చాళుక్యుల సామంతులుగా ఉండేవారు. క్రీ.శ 973లో చాళుక్య రాజైన తైలపాడు.. రాష్ట్రకూటుల చివరి రాజైన కర్కుడిని వధించి చాళుక్య రాజ్యాన్ని నెలకొల్పి కుమారుడు సత్యాశ్రయుడికి పట్టాభిషేకం చేయించాడు.
వేములవాడలో ప్రసిద్ధి చెందిన రాజరాజేశ్వరి దేవాలయముంది. ప్రజలు ఆ దేవిని విశేషంగా ఆరాధించేవారు. చోళరాజులు కూడా రాజరాజేశ్వరిని నమ్మేవారు.ఆరాధించేవారు. రాజ రాజ చోళుడు తర్వాత పాలనలోకి వచ్చిన రాజేంద్ర చోళుడు మరో రాజుని యుద్ధంలో ఓడించి వేములవాడలోని రాజరాజేశ్వరి ఆలయాన్ని కూల్చేసి ఆలయంలోని భారీ శివలింగాన్ని తన తండ్రికి బహుమతిగా ఇచ్చాడట. ఆ లింగాన్ని బృహదీశ్వరాలయంలో ప్రతిష్ఠించారట. పార్వతీ సమేతంగా కొలువైన శివలింగాన్ని వేరుచేసి రాజేంద్ర చోళుడు బృహదీశ్వరాలయంలో ప్రతిష్టించారని ప్రతీతి. ఈ విషయం తమిళ శిలాశాసనాల్లోనూ ఉందని చెబుతుంటారు.
Bathukamma 2023 : బతుకమ్మ సిగలో ‘గుమ్మడి పువ్వు’ పసుపు గౌరమ్మ కొలువు
వేములవాడ నుంచి వేరుచేసి తీసుకొన్ని శివలింగాన్ని బృహదీశ్వరాలయంలో ప్రతిష్టించడం ప్రజల్ని తీవ్రంగా కలచివేసిందట. బృహదమ్మ(పార్వతిదేవి, గౌరీ దేవి..బతుకమ్మలో గౌరమ్మ) నుంచి శివలింగాన్ని వేరుచేసినందుకు ఎంతగానో విలపించిందట. తీవ్ర దుఃఖిస్తూ…తమ బాధను చోళులకు తెలియజేసేందుకు శివలింగాకారంలో పూలను పేర్చి బతుకమ్మను నిర్వహించడం ప్రారంభిచారన కథనం. అప్పటి నుంచీ ఏటా బతుకమ్మను ఇలా పూలతో పేర్చి మధ్యలో గౌరమ్మని తలపించేలా పసుపుముద్దను బతుక్మ పైన పెడతారు. బతుకమ్మను శివలింగం రూపంలో పేర్చటం వెనుక ఈ కథనం ప్రాచుర్యంలో ఉంది.