Beetroot And Almond Juice : మహిళల్లో కీళ్లు , కండరాల నొప్పులను తగ్గించే బీట్రూట్, బాదం జ్యూస్!
మంచి పోషకాలు ఉన్న ఆహారాన్ని తప్పనిసరిగా ప్రతిరోజు డైట్లో చేర్చుకుంటే అలసట, నీరసం, నిస్సత్తువ లేకుండా హుషారుగా ఉంటారు. మహిళలు విధినిర్వాహణతో, వివిధ గృసంబంధమైన పనుల్లో యాక్టీవ్ గా ఉండాలంటే బ్రీట్రూట్, బాదం జ్యూస్ బాగా ఉపకరిస్తుంది.

Beetroot and almond juice to reduce joint and muscle pain in women!
Beetroot And Almond Juice : మహిళలు ఇంటిపటునే ఉంటారు కదా వారేమి పెద్ద పనిచేయరు అని చాలా మంది అనుకుంటుంటారు. అయితే మహిళలపై ఉండే పనిఒత్తిడి మగవారిపైన ఉండదు. ఉదయం నిద్రలేచింది మొదలు రాత్రి నిద్రకు ఉపక్రమించే వరకు ఒక్క క్షణం తీరిక లేకుండానే పనిచేయాల్సి ఉంటుంది. మరికొందరు మహిళలు ఆఫీస్ పనులు, ఇంటి పనులు చేసుకుంటూ ఎక్కువగా అలసిపోతూ ఉంటారు. ఆ అలసట కొన్ని సందర్భాల్లో ఆనారోగ్య పరిస్ధితులకు దారి తీస్తుంది.
మంచి పోషకాలు ఉన్న ఆహారాన్ని తప్పనిసరిగా ప్రతిరోజు డైట్లో చేర్చుకుంటే అలసట, నీరసం, నిస్సత్తువ లేకుండా హుషారుగా ఉంటారు. మహిళలు విధినిర్వాహణతో, వివిధ గృసంబంధమైన పనుల్లో యాక్టీవ్ గా ఉండాలంటే బ్రీట్రూట్, బాదం జ్యూస్ బాగా ఉపకరిస్తుంది. అధిక బరువు, రక్తహీనత వంటి సమస్యలతో ఎక్కువగా బాధపడుతున్నవారికి సమస్యలను తగ్గించడానికి ఈ జ్యూస్ చాలా బాగా సహాయపడుతుంది. రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. మెదడు ఆరోగ్యంగా ఉంటుంది. ఆల్జీమర్స్ వంటి సమస్యలు ఏమీ లేకుండా జ్ఞాపకశక్తి కూడా బాగుంటుంది. వయసు పెరిగే కొద్దీ వచ్చే ఎముకలకు సంబంధించిన సమస్యలు రాకుండా ఉంటాయి.
జ్యూస్ తయారీ విధానం ;
ఐదు బాదం పప్పులను రాత్రి సమయంలో నీటిలో వేసి నానబెట్టాలి. తరువాత రోజు ఉదయం నానిన బాదం పప్పులను తొక్క తీసి ఉంచుకోవాలి. అనంతరం ఒక మీడియం సైజ్ బీట్రూట్ తీసుకుని తొక్క తీసి శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత మిక్సీ జార్ లో కట్ చేసిన బీట్రూట్ ముక్కలు, అరకప్పు కొబ్బరి ముక్కలు, తొక్క తీసిన బాదం పప్పులు, ఒక గ్లాసు నీటిని వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని పల్చని వస్త్రం సాయంతో జ్యూస్ ను వేరు చేయాలి. ఈ జ్యూస్ ను వారానికి రెండు సార్లు తీసుకుంటే మహిళలు ఎన్నో రకాల సమస్యల నుంచి బయటపడవచ్చు.