Covid Vaccine.. మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపర్చగలదు.. ఎలాగంటే?

కరోనా వ్యాక్సిన్లు కేవలం వైరస్ వ్యాప్తిని తగ్గించడమే కాదు.. మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో కూడా అద్భుతంగా పనిచేస్తున్నాయని ఓ కొత్త అధ్యయనంలో తేలింది.

Can Covid vaccine improve your mental health : అసలే ఇది కరోనా కాలమాయే.. బయటకు అడుగుపెడితే మాస్క్ ఉండాల్సిందే.. కరోనావైరస్ వ్యాప్తిని కంట్రోల్ చేసేందుకు ఇప్పటికే ప్రపంచ జనాభాకు కరోనా వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చేశాయి. ప్రపంచ జనాభా కొవిడ్ టీకాలను వేయించుకోవడంతో వైరస్ వ్యాప్తి క్రమంతో తగ్గుతోంది. అయితే.. కరోనా వ్యాక్సిన్లు కేవలం వైరస్ వ్యాప్తిని తగ్గించడమే కాదు.. మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో కూడా అద్భుతంగా పనిచేస్తున్నాయని ఓ కొత్త అధ్యయనంలో తేలింది. మహమ్మారి సమయంలో మానసిక రుగ్మతలపై పరిశోధకులు అధ్యయనం చేశారు. సౌతరన్ కాలిఫోర్నియా యూనివర్శిటీకి చెందిన సైంటిస్టుల బృందం ఈ అధ్యయనాన్ని నిర్వహించింది. PLoS Journal లో దీన్ని ప్రచురించింది. కరోనా వ్యాక్సిన్ మొదటి డోసు తీసుకున్న వారిలో కొద్దికాలంలోనే మానసిక ఆందోళనల్లో చాలా మార్పులు కనిపించినట్టు గుర్తించారు.

మహమ్మారి ప్రభావంతో మానసికంగా ఎంతోమంది కృంగిపోయారు. కొవిడ్ బాధితుల జనాభాలో వ్యాక్సిన్ అనంతరం వారి మానసిక స్థితిలో మెరుగైన ఫలితాలు వచ్చినట్టు పరిశోధకులు గుర్తించారు. వ్యాక్సిన్ వేయించుకోనివారిలో కన్నా టీకా వేయించుకున్నవారిలో మానసిక ఆరోగ్యం ఎలా ఉంది అనేదానిపై ప్రధానంగా పరిశోధకులు దృష్టిసారించారు. ఈ రెండింటి గ్రూపుల మధ్య ఫలితాలను పరిశీలించారు. అందులో వ్యాక్సిన్ వేయించుకున్నవారిలో తక్కువ సమయంలోనే మానసిక ఆరోగ్యంపై మెరుగైన ప్రభావం చూపినట్టు గుర్తించారు. ఏప్రిల్ మధ్యనాటికి అమెరికాలో కరోనా మహమ్మారి కారణంగా మానసిక రుగ్మతల ప్రభావం అధికంగా ఉన్నట్టు గత పరిశోధనలో తేలింది. కానీ, మే 2020 ఆరంభంలో దాని ప్రభావం క్రమంగా తగ్గినట్టు గుర్తించారు.
COVID-19 Recovery: కొవిడ్ నుంచి కోలుకున్న 116ఏళ్ల మహిళ

మరోవైపు.. కొవిడ్ వ్యాక్సిన్లు ఆరోగ్య సమస్యలను కూడా తగ్గిస్తున్నాయని తేలింది. టీకా రాకతో ఆర్థికపరంగా, సామాజికంగానూ అభివృద్ధి కనిపిస్తోంది. కొవిడ్ టీకాలతో మానసిక ఆరోగ్యంపై కూడా అనేక ప్రయోజనాలు ఉన్నాయని అధ్యయనంలో పరిశోధకులు తేల్చేశారు. ఈ అధ్యయనంలో 10 మార్చి 2020, 31 మార్చి 2021 మధ్య అమెరికా అంతటా 8,003 టీకాలు తీసుకున్నా, టీకాలు తీసుకోని వారిపై పరిశోధకులు సర్వే నిర్వహించారు. అధ్యయనంలో పాల్గొనేవారిలో నాలుగు అంశాల పేషెంట్ హెల్త్ ప్రశ్నావళిని (PHQ-4) తీసుకున్నారు. అందులో టీకా స్టేటస్, మానసిక రుగ్మతలకు సంబంధించి డేటాను సేకరించారు.

డిసెంబర్ 2020 నుంచి మార్చి 2021 మధ్య టీకాలు తీసుకున్న వ్యక్తుల్లో మొదటి మోతాదు తర్వాత సర్వే నిర్వహించారు. వారిలో మానసిక క్షోభ స్థాయిలు తగ్గినట్లు అధ్యయనంలో రుజువైంది. మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో వ్యాక్సిన్ బాగా పనిచేస్తుందని గుర్తించారు. టీకాలు వేసినవారిని మాత్రమే కాదు.. టీకాలు వేయనివారిని కూడా ప్రభావితం చేస్తుందని పరిశోధక బృందం అధ్యయనంలో తెలిపింది. ఈ పరిశోధనకు కొన్ని పరిమితులు ఉన్నాయని పరిశోధకులు గుర్తించారు. మానసిక వేదన నుంచి కోలుకునే వ్యక్తులు కూడా టీకాలు తీసుకునే అవకాశం ఉందని చెప్పారు. భవిష్యత్ అధ్యయనాలలోనూ ఇలాంటి అంశాలపై మరింతగా పరిశోధించాల్సిన అవసరం ఉందని సూచించారు.
Covid vaccine 12-18: మార్కెట్లోకి చిన్నారులకు వేసే కొవిడ్ వ్యాక్సిన్

ట్రెండింగ్ వార్తలు