Covid vaccine 12-18: మార్కెట్లోకి చిన్నారులకు వేసే కొవిడ్ వ్యాక్సిన్

ఇకపై చిన్నారులకు కూడా కరోనా వ్యాక్సిన్ వచ్చేసిందన్నమాట. సెప్టెంబర్ 15నుంచి మార్కెట్లోకి రానున్న జైడస్ క్యాండిలా వ్యాక్సిన్.. 12 నుంచి 18సంవత్సరాల మధ్య వయస్కులకు సురక్షితం అని...

Covid vaccine 12-18: మార్కెట్లోకి చిన్నారులకు వేసే కొవిడ్ వ్యాక్సిన్

Zycov D Vaccine

Covid vaccine 12-18: ఇకపై చిన్నారులకు కూడా కరోనా వ్యాక్సిన్ వచ్చేసిందన్నమాట. సెప్టెంబర్ 15నుంచి మార్కెట్లోకి రానున్న జైడస్ క్యాండిలా (ZyCoV-D) వ్యాక్సిన్.. 12 నుంచి 18సంవత్సరాల మధ్య వయస్కులకు సురక్షితం అని చెబుతుంది గుజరాత్‌కు చెందిన జైడస్‌ క్యాడిలా కంపెనీ. తాము తయారు చేసిన ZyCoV-D కరోనా వ్యాక్సిన్‌ ప్రస్తుతం ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇతర టీకాలను ఉచితంగా ఇస్తున్నట్లుగా ఈ కొత్త టీకా కూడా ఇచ్చే అవకాశముంది. ధర విషయంలో గవర్నమెంట్ నుంచి ఎలాంటి అగ్రిమెంట్ లేకపోవడంతో ధర విషయంలో ఎటువంటి స్పష్టత లేదు.
విద్యాసంస్థలు తెరుస్తున్న నేపథ్యంలో కొత్త టీకా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని హెల్త్ డిపార్ట్‌మెంట్ భావిస్తోంది. పిల్లలను స్కూళ్లకు, కాలేజీలకు పంపడానికి పేరెంట్స్ లో ఆందోళన కనిపిస్తుంది. ఈ సమయంలో వచ్చిన కొత్త టీకా వారిలో ధైర్యాన్ని నింపేందిగా మారిందని నిపుణులు అంటున్నారు.
రెండేళ్ల కంటే పెద్దవాళ్లకు వ్యాక్సిన్
నవంబర్‌ నెలలో భారత్‌ బయోటెక్‌కు చెందిన మరో టీకా అందుబాటులోకి రానుంది. దాన్ని రెండేళ్లకు పైబడిన వారందరికీ వేయడానికి వీలుంటుందని వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది.
ZyCoV-D టీకా మూడు డోసులు వేసుకోవాల్సి ఉంటుంది. 28 రోజుల గ్యాప్ తో వ్యాక్సిన్ వేస్తారు. మొత్తంగా మూడు డోసులను 56 రోజుల్లోగా పూర్తి చేస్తారు. ప్రస్తుతం కోవాగ్జిన్, కోవిషీల్డ్‌ టీకాలు రెండు డోసులు వేస్తుండగా.. జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ వంటి కొన్ని టీకాలు ఒక డోసు వేస్తున్నారు. జైకోవ్‌–డీ టీకాను సెప్టెంబర్ 15వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో వేసేలా ప్రణాళిక రచించారు.
రాష్ట్రంలో 12–18 ఏళ్ల వయస్సువారు 48 లక్షల మంది ఉంటారని అంచనా. వారందరికీ మూడు డోసుల టీకా వేయాలంటే కనీసం ఆరు నెలల సమయం పట్టే అవకాశముందని అంచనా వేస్తున్నారు.
ఇంట్రాడెర్మల్‌ వ్యాక్సిన్‌ ZyCoV-D ప్రపంచంలోనే మొట్టమొదటి ప్లాస్మిడ్‌ డీఎన్‌ఏ టీకా. ఫార్మాజెట్‌ అనే పరికరంతో చేతిపై ప్రెస్‌ చేస్తారు. అలా చర్మం లోపలి పొరల్లోకి వ్యాక్సిన్‌ వెళుతుంది. సూది రహిత టీకా కావడం వల్ల చేతి దగ్గర నొప్పి ఉండే అవకాశం లేదు. దీన్ని 2 నుంచి 8 డిగ్రీల సెల్సియస్‌ వద్ద నిల్వ చేయవచ్చు.