Obesity : ఆలస్యంగా తినటం, నిద్రపోవటం ఊబకాయానికి దారితీస్తాయా?
అంతేకాకుండా టీ, కాఫీలకు బదులుగా గ్రీన్, వైట్ , బ్లాక్ టీ వంటివి తీసుకోవాలి. కెఫిన్ కూడా బరువు పెరగటానికి కారణమౌతుందని నిపుణులు చెబుతున్నారు.

Can eating and sleeping late lead to obesity?
Obesity : ఆలస్యంగా నిద్రపోవటం, తినడం వంటివి ఏమాత్రం మంచిది కాదు. ఇలాంటి జీవనశైలికి అలవాటు పడ్డ వారు క్రమంగా బరువు పెరుగుతారు. ఊబకాయానికి దారితీస్తుంది. ప్రతిరోజు రాత్రి ఎనిమిది గంటల సమయానికి తినటం పూర్తి చేసుకుని నిత్రపోవటం అలవాటు చేసుకుంటే బరువు సమస్య అనేది ఉండదు.
అంతేకాకుండా టీ, కాఫీలకు బదులుగా గ్రీన్, వైట్ , బ్లాక్ టీ వంటివి తీసుకోవాలి. కెఫిన్ కూడా బరువు పెరగటానికి కారణమౌతుందని నిపుణులు చెబుతున్నారు. రాత్రి సమయంలో తక్కువ ఆహారంతో సరిపెట్టుకోవటం మంచి పద్దతే అయితే మరుసటి రోజు నీరసం ఉండకుండా ఉండాలంటే పండ్లు, మజ్జిగ వంటివి తప్పనిసరిగా తీసుకోవాలి.
జిమ్, యోగా వంటి చేయకపోయినా ఉదయం నడవటం, ఈత , టెన్నీస్ వంటివి చేయాలి. బద్ధకం వదిలిపెట్టాలి. త్వరగా మేల్కొని రోజువారి కార్యకలాపాలకు ప్రాధాన్యత నిస్తే బరువు తగ్గటం ఖాయం.
మంచి నీరు ఎక్కవగా తీసుకోవాలి. రాత్రి సమయంలో యూరిన్ కు లేవాల్సి వస్తుందని నీరు తాగరు. ఇది సరైంది కాదు రాత్రి సరిపడిన మోతాదులో నీరు సేవించాలి. కీర దోసం, నిమ్మ ముక్కలు, పుదీనా వంటివి కలిపి నీళ్లు తీసుకోవాలి. ఇలా చేయటం వల్ల శరీరంలో వ్యర్ధాలు బయటకు వెళ్లిపోతాయి. అదనపు కొవ్వులూ కరిగిపోతాయి.