Ganesh Pooja Samagri: వినాయక చవితి.. గణపయ్య పూజకు ఏమేం కావాలి..

వినాయక చవితి పండగ అలా కాదు.. ఊరూ వాడా ఒక్కటై సంబరంగా జరుపుకునే పండుగ.

Ganesh Pooja Samagri: వినాయక చవితి.. గణపయ్య పూజకు ఏమేం కావాలి..

Updated On : August 26, 2025 / 8:15 PM IST

Ganesh Pooja Samagri: హిందువుల ప్రధాన పండుగలలో వినాయక చవితి ఒకటి. దేశవ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుపుకునే పండుగ కూడా వినాయక చవితి. చతుర్థి రోజున గణనాధుడిని భక్తిశ్రద్ధలతో ఆరాధించడం వలన ఆయన అనుగ్రహం కలిగి సుఖ సంతోషాలతో ఉండొచ్చని పండితులు చెబుతున్నారు. విఘ్నాధిపతిని కొలవడం ద్వారా విఘ్నాలన్నీ తొలగి అన్నీ శుభాలే జరుగుతాయని విశ్వసిస్తారు. ఊరువాడ అంతా ఎంతో ఉత్సాహంగా విగ్రహాలను ప్రతిష్టిస్తారు. భక్తిశ్రద్ధలతో గణపయ్యకు పూజలు చేస్తారు.

శివుడు సైత ఏదైనా పని మొదలు పెట్టే వినాయకుడికి పూజ చేసే మొదలు పెడతాడని పురాణాల్లో ఉంది. అలాంటి విఘ్నాధిపతికి ప్రతి ఏటా వైభవంగా జరిపే పండగే వినాయక చవితి.

ఏ పండుగ అయినా కుటుంబసభ్యులు, బంధుమిత్రుల మధ్య జరుపుకోవడం కామన్. వినాయక చవితి పండగ అలా కాదు.. ఊరూ వాడా ఒక్కటై సంబరంగా జరుపుకునే పండుగ. అలాంటి వినాయక చవితి రోజున బొజ్జ గణపయ్య పూజకు ఏమేం కావాలో తెలుసా? పూజకు కావాల్సిన సామగ్రి వివరాలు తెలుసుకుందాం..

వినాయక చవితి రోజున గణనాధుడి పూజకు కావాల్సిన సామాగ్రి:

పసుపు
కుంకుమ
కర్పూరం
అగరబత్తి
అరటిపండ్లు
మామిడి ఆకులు
పత్రి
దారం
పాలు
పెరుగు
తేనె
నెయ్యి
పంచదార
నూనె
దీపారాధనకు వత్తులు
తమలపాకులు
పువ్వులు
కొబ్బరికాయ
అక్షితలు
కలశం కోసం చెంబు
21 రకాల పత్రి

Also Read: వినాయక చవితి.. చంద్రుడిని ఎందుకు చూడకూడదు? పొరపాటున చూస్తే ఏం చేయాలి?