Friendship Band : ఫ్రెండ్ షిప్ బ్యాండ్ కొంటున్నారా? ఏ రంగు దేనికి సంకేతమో తెలుసా?

ఫ్రెండ్ షిప్ డే రోజు స్నేహితులకు ఫ్రెండ్ షిప్ బ్యాండ్ కడతాం. అసలు ఫ్రెండ్ షిప్ బ్యాండ్ ఎందుకు కడతారు? వాటిలోని రంగులు దేనికి సంకేతమో తెలుసా?

Friendship Band

Friendship Band : ప్రపంచంలో డబ్బు లేని వారు ఉంటారేమో కానీ స్నేహితుడు లేని వారు ఉండరు. కష్టంలో, సుఖంలో పాలు పంచుకునేందుకు ప్రతి ఒక్కరికి స్నేహితులు ఉంటారు. ఫ్రెండ్ షిప్ డే రోజు ఎంతో ఇష్టమైన స్నేహితులకు ఫ్రెండ్ షిప్ బ్యాండ్ కడతారు. అసలు ఎందుకు కడతారో తెలుసా?

RICH KID: స్నేహితులతో కాలక్షేపంకోసం విమానం మొత్తాన్ని బుక్ చేసుకున్న కుర్రాడు! ఆ తరువాత ఏం జరిగిందంటే?

భారతదేశంలో ఏటా ఆగస్టు నెలలో వచ్చే మొదటి ఆదివారం ‘అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం’ జరుపుకుంటాం. స్నేహ బంధానికి గుర్తుగా ఆరోజు అందరూ ఫ్రెండ్ షిప్ బ్యాండ్స్ కట్టుకుంటారు. అసలు ఫ్రెండ్ షిప్ బ్యాండ్ ఎందుకు కట్టుకుంటాము? అంటే స్నేహానికి చిహ్నంగా వీటిని స్నేహితుల మణికట్టుపై కడతారు. కట్టే సమయంలో ఏదైనా కోరుకుంటే మంచి జరుగుతుందని చెబుతారు. ఇక ఆ బ్యాండ్ అరిగిపోయే వరకూ ధరించాలి. దానిని తయారు చేయడంలో పడిన కష్టాన్ని ప్రేమను కూడా గౌరవించాలి.

 

ఇప్పుడంటే మార్కెట్లో ఎన్నో రకాల మోడల్స్ లో ఫ్రెండ్ షిప్ బ్యాండ్స్ దొరుకుతున్నాయి. నిజానికి ఒకప్పుడు వీటిని రంగు రంగుల ఊలు, లేదా దారపు పోగుతో స్వయంగా తయారు చేసి స్నేహితులకు కట్టేవారు. ఈ రంగుల వెనుక కూడా ఎన్నో అర్ధాలు ఉన్నాయి. స్నేహితుల మధ్య ఉన్న ప్రేమ, ఆప్యాయత, ఆనందానికి చిహ్నంగా రంగులను సెలక్ట్ చేసుకుంటారు.

 

ఎరుపు రంగు- అదృష్టం, సాహసం

ఆరెంజ్ రంగు-ఆనందం, ఉత్సాహం

పసుపు-స్నేహ, ఆశావాదం, సృజనాత్మకత

ఆకుపచ్చ-ఆశ, కరుణ

నీలం-శాంతి, ప్రేరణ, విధేయత

ఊదా రంగు-స్నేహం, ఆడంబరం

గులాబీ-ఆప్యాయత, ప్రేమ, దయ

నలుపు-శక్తి, విశ్వాసం 

ఇలా ఈ రంగులు ఈ స్వభావాలని సూచియని నమ్ముతారు.

Friendship : సంతోషకరమైన జీవితం కోసం ఈ 6 రకాల స్నేహితులతో సన్నిహితంగా ఉండటం మంచిదా ?

ఫ్రెండ్ షిప్ బ్యాండ్స్ అమెరికా నుంచి ఉద్భవించాయని చెబుతారు. అలాగే చైనా, అరబిక్ దేశాల్లో మొదట సంప్రదాయంగా ఉద్భవించాయి. జీవితంలో మన వెన్నంటి ఉండి మార్గాన్ని చూపించిన ఎందరో స్నేహితులను గుర్తుంచుకుని వారిని అభినందించాల్సిన సమయం స్నేహితుల దినోత్సవం. వివిధ దేశాల్లో ఈ అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవాన్ని పలు తేదీల్లో జరుపుకుంటూ ఉంటారు.  2023 భారతదేశంలో ఆగస్టు 6 అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం జరుపుకుంటున్నాం. మీ స్నేహితుల స్వభావాన్ని బట్టి వారితో మీకున్న అనుబంధాన్ని బట్టి రంగు రంగుల ఫ్రెండ్ షిప్ బ్యాండ్స్ సెలక్ట్ చేసుకోండి. మీ స్నేహాన్ని సెలబ్రేట్ చేసుకోండి.

ట్రెండింగ్ వార్తలు