Friendship : సంతోషకరమైన జీవితం కోసం ఈ 6 రకాల స్నేహితులతో సన్నిహితంగా ఉండటం మంచిదా ?

ఆరోగ్యకరమైన సరిహద్దులను కలిగి ఉన్న స్నేహితులతో సన్నిహితంగా మెలగటం మంచిది. అలాకాకుండా వ్యక్తిగత విషయాల్లో తొంగిచూస్తూ మనల్ని ఇబ్బందుల్లోకి నెట్టే స్నేహం ఏమాత్రం సరైంది కాదు.

Friendship : సంతోషకరమైన జీవితం కోసం ఈ 6 రకాల స్నేహితులతో సన్నిహితంగా ఉండటం మంచిదా ?

keep friendship

Friendship : వాస్తవానికి స్నేహితులు లేకుంటే జీవితం కష్టంగా ఉంటుంది. వారితో నిరంతరం స్నేహసంబంధాలను కలిగి ఉండాలి. కొందరు మన జీవితంలోకి ఏదో ఒక ప్రయోజనం, ఆశించి స్నేహితులుగా వస్తారు. రిలేషన్ షిప్ బ్రేక్-అప్‌ కాకుండా ఉండాలంటే స్నేహితులను ఎంపిక చేసుకునే విషయంలో తగిన జాగ్రత్తలు పాటించాలి. స్నేహబంధం విడిపోవటం అంటే మనస్సును ఎంతో బాధిస్తుంది.

READ ALSO : వేస‌విలో మొక్క‌ల సంర‌క్ష‌ణ ఇలా..

మనలో చాలా మంది స్నేహితులతో కనెక్ట్ అవ్వాలనే కోరికతో మన జీవితంలోకి చెడు స్నేహాలకు ఆకర్షితులవుతారు. వారితో మనమనస్సులోని భావాలను వెల్లడిస్తాము. ఒకడుగు ముందుకు వేసి రహస్యాలను పంచుకుంటాము. శ్రేయోభిలాషులు కాని వ్యక్తుల నుండి కొన్ని సమస్యలకు, పరిస్ధితులకు సూచనలు అడుగుతాము. ఈ రకమైన స్నేహాన్ని కొనసాగించడం వల్ల జరిగే మంచి కంటే ఎక్కువ హానిని జరిగే ప్రమాదం ఉంటుంది. ఇలాంటి స్నేహాలను కొనసాగించటం కంటే నివారించటమే మేలు.

స్నేహబంధాన్ని కొనసాగించబోయే ముందుగా ఈ 6 రకాల స్నేహితుల గురించి నిపుణులు చెబుతున్న మాటలు ;

1. నిరంతరం పరిచయం అవసరం లేని వారు : నిరంతరం పరిచయం అవసరం లేని స్నేహితులకు దగ్గరగా ఉండటం మంచిది. అలాంటి వారిని కలిసినప్పుడు వారిని ఆలింగనం చేసుకోండి. జీవితం బిజీగా ఉంటుందని, ఇది ముఖ్యమని అర్థం చేసుకునే వారితో స్నేహసంబంధాలను కొనసాగించండి.

READ ALSO : Rheumatoid Arthritis : డెలివరీ తర్వాత తల్లుల్లో రుమటాయిడ్ ఆర్థరైటిస్.. దీనిని ఎదుర్కోవటానికి చిట్కాలు !

2. మిమ్మల్ని మారమని బలవంతం చేసే స్నేహితులు : మీరు ఇలా ఉన్నారు. అలా కాదు ఇలా ఉండాలంటూ సూచిస్తూ నిరంతరం మీలో మార్పు కోరుకుంటూ , మంచి సూచనలు ఇచ్చే స్నేహితులతో సన్నిహితంగా ఉండాలి. ఒకవేళ అనుకోని పరిస్ధితుల్లో మీకు , వారికి మధ్య విభేదాలు ఉన్నప్పుడు మిమ్మల్ని కావాలనుకున్న వారితో స్నేహ సంబంధం కలిగి ఉండటం మంచిదే.

3: ఆరోగ్యకరమైన సరిహద్దులను కలిగి ఉండే స్నేహితులు: ఆరోగ్యకరమైన సరిహద్దులను కలిగి ఉన్న స్నేహితులతో సన్నిహితంగా మెలగటం మంచిది. అలాకాకుండా వ్యక్తిగత విషయాల్లో తొంగిచూస్తూ మనల్ని ఇబ్బందుల్లోకి నెట్టే స్నేహం ఏమాత్రం సరైంది కాదు. ఎవరైనా హద్దుల్లో ఉండటం స్ఫూర్తిదాయకం. దీని వల్ల స్నేహసంబంధాలు కూడా ఆరోగ్యకరంగా ఉంటాయి.

READ ALSO : Ignoring Social Media : రోజులో కేవలం 15 నిమిషాలు సోషల్ మీడియాను దూరంపెడితే మీ ఆరోగ్యం మెరుగుపడటం ఖాయం !

4. మీరు సమస్యల్లో ఉన్నప్పుడు మీ వెన్నంటి ఉండే స్నేహితులతో సన్నిహితంగా ఉండండి ; అనుకోని సందర్భాల్లో మీరు కష్టాల్లో , ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వాటిని పంచుకునే సమయంలో మీకు తోడుగా ఉండే స్నేహితులకు సన్నిహితంగా మెలగండి. అలా కాకుండా మీరు సమస్యల్లో ఉన్నప్పుడు మీతో దూరంగా ఉండాలనుకునే వారి విషయంలో జాగ్రత్తగా వ్యవహిరంచటం మంచిది.

5. మీకు మంచి జరగాలని కోరుకునే వారు: మీకు జవాబుదారీగా సున్నితంగా ఉండే స్నేహితులకు సన్నిహితంగా ఉండాలి. మీ శ్రేయస్సును కోరుకునే వారు, ఉన్నతస్ధాయిలో ఉండాలనుకునే వారు మీ స్నేహితులుగా కలిగి ఉండటం జీవితాన్నే మార్చేస్తుంది. అలాంటి వారితో స్నేహం ఉత్తమంగా ఉంటుంది.

READ ALSO : Women’s Health : మహిళల ఆరోగ్యం కోసం ఎలాంటి ఆహారం అవసరమంటే ?

6. మీకు మద్దతుగా నిలిచే స్నేహితులు: మీకు నిరంతరం మద్దతుగానిలిచే స్నేహితులకు దగ్గరగా ఉండండి. అలాంటి వారితో సమయాన్ని వెచ్చించడం వల్ల అన్ని రకాలుగా మీకు ఎంతో మంచి జరుగుతుంది.