Rheumatoid Arthritis : డెలివరీ తర్వాత తల్లుల్లో రుమటాయిడ్ ఆర్థరైటిస్.. దీనిని ఎదుర్కోవటానికి చిట్కాలు !

అనియంత్రిత రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న స్త్రీలలో ముందస్తు జననం వంటి సమస్యలు ఉత్పన్నం అవుతాయి. అందువల్ల గర్భం ధరించడానికి 3 నుండి 6 నెలల ముందు వ్యాధిని అదుపులోకి తీసుకురావటం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.

Rheumatoid Arthritis : డెలివరీ తర్వాత తల్లుల్లో రుమటాయిడ్ ఆర్థరైటిస్.. దీనిని ఎదుర్కోవటానికి చిట్కాలు !

Rheumatoid arthritis

Rheumatoid Arthritis : రుమటాయిడ్ ఆర్థరైటిస్ కలిగిన మహిళలు అనేక సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ సమస్యను కలిగి ఉన్న స్త్రీలు ఇతరులకన్నా గర్భం ధరించే అవకాశం తక్కువగా ఉంటుంది. అలాగే, అనియంత్రిత రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న స్త్రీలలో ముందస్తు జననం వంటి సమస్యలు ఉత్పన్నం అవుతాయి. అందువల్ల గర్భం ధరించడానికి 3 నుండి 6 నెలల ముందు వ్యాధిని అదుపులోకి తీసుకురావటం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. అధ్యయనాల ప్రకారం డెలివరీ తర్వాత ఈ సమస్య ముప్పు మరింత పెరగే అవకాశం ఉంటుంది. కాబట్టి కొత్త తల్లులైన వారు ఈ సవాళ్లును ఎదుర్కొవాల్సి ఉంటుంది.

READ ALSO : Arthritis Problems : ఆర్ధరైటిస్ సమస్యలు రాకుండా ఉండాలంటే ఆహారంలో చేపలు చేర్చుకోండి!

రుమటాయిడ్ ఆర్థరైటిస్‌లో ప్రసవించిన తరువాత అధ్యయనాలు చెబుతున్నట్లు కొన్నిసార్లు ఈ సమస్య మరింత తీవ్రమవుతుంది. డెలివరీ తర్వాత శరీరంలో నొప్పి, కీళ్ల నొప్పులు ఎక్కువగా అధికంగా ఉంటాయి. మహిళలు తగినంత విశ్రాంతి తీసుకోవాలి. నవజాత శిశువులను చూసుకునే వారి సామర్థ్యాన్ని ప్రభావితం చేసే నిర్దిష్ట సవాళ్లను ఎదుర్కొవాల్సి రావచ్చు. వాటి గురించి నిపుణులు ఏంచెబుతున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

ఆర్థరైటిస్‌తో కొత్తగా తల్లులైన వారు ఎదుర్కోనే సవాళ్ళు ;

శారీరక పరిమితులు: కీళ్లనొప్పులు, దృఢత్వం, కదలికలు తగ్గడానికి కారణమవుతాయి. కొత్తగా తల్లులైనవారు తమ పిల్లలను ఎత్తుకోవటం, మోసుకెళ్లడం, ఆహారం తినిపించటం వంటి పనులను చేయడం కష్టంగా ఉంటుంది. ఒకరకంగా చెప్పాలంటే వారి రోజువారీ కార్యకలాపాలు కొనసాగించటానికి అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుంది.

READ ALSO : Rheumatoid Arthritis : రుమటాయిడ్ ఆర్ధరైటిస్ ప్రమాదకరమైనదా!

అలసట: ఆర్థరైటిస్ సంబంధిత అలసట సాధారణంగా ఉంటుంది. అయితే నవజాత శిశువు సంరక్షణ నేపధ్యంలో ఈ సమస్య మరింత తీవ్రమవుతుంది. నిద్ర లేకపోవడం, శిశువును చూసుకోవడంలో శారీరక శ్రమ అలసట స్థాయిలు మరింత తీవ్రతరం అవుతాయి. కొత్తగా తల్లులైన వారు ఆర్థరైటిస్ లక్షణాలను తగ్గించుకోవటం కష్టతరంగా మారుతుంది.

ఆర్థరైటిస్‌తో బాధపడుతున్న కొత్తగా తల్లులైనవారు తప్పనిసరిగా తీసుకోవాల్సిన ఆహారాలు ;

పచ్చిమిర్చి, పసుపు, ఆలివ్ నూనెను ఆహారాల్లో ఉపయోగించటం వల్ల ఆర్థరైటిస్‌ వల్ల కలిగే మంట నియంత్రణలో ఉంటుంది. ఆహారంలో ఉప్పు, చక్కెర, ఆయిల్ ను వాడకపోవటమే మంచిది. వీటిని ఉపయోగించటం వల్ల లక్షణాలు మరింత తీవ్రతరం అవుతాయి. చేపలు, బ్రోకలీ , బాదం వంటిని తీసుకోవటం కీళ్ళనొప్పులకు ఉపయోగకరమని నిపుణులు సూచిస్తున్నారు.

READ ALSO : ఆర్థరైటిస్ నొప్పిని తగ్గించే సహజసిద్ధమైన చిట్కాలు !

ఆర్ధరైటిస్ తో బాధపడుతున్న కొత్తగా తల్లులైన వారు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే తగినంత విశ్రాంతి తీసుకోవడం, కుటుంబ సభ్యుల సహాయసహకారాలు తీసుకోవటం వంటివి చేయాలి. ఎందుకంటే ఇంటిపనితోపాటు, ఇతర పనులు చేయటం వల్ల కీళ్ల నొప్పులు తీవ్రమవుతాయి. కాబట్టి తగిన జాగ్రత్తలు పాటించటం మంచిదని నిపుణులు చెబుతున్నారు.