Alzheimer's disease
Alzheimer’s Disease : ప్రతిరోజూ ఆరోగ్యంపై ప్రభావం చూపే అనేక రకాల పర్యావరణ, జీవనశైలి కారకాలకు మనం గురవుతుంటాం. వీటిలో అత్యంత ముఖ్యమైన కారకాల్లో ఒకటి మన శ్వాసకు సంబంధించింది. అల్జీమర్స్ వ్యాధి వచ్చే ప్రమాదాన్ని తగ్గించడంలో రోజువారీ శ్వాస వ్యాయామాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని ఇటీవలి పరిశోధనల్లో తేలింది.
READ ALSO : సిగరెట్ తాగుతున్నారా..! ఇవి తింటే ఊపిరితిత్తులు సేఫ్ _ Best & Healthy Food for Smokers
రోజువారీ శ్వాస వ్యాయామాలు అల్జీమర్స్ వ్యాధి ప్రమాదాన్ని తగ్గించగలవా?
శ్వాస వ్యాయామాలు మెదడులోని ఆక్సిజన్ ను పెంచుతాయి. తద్వారా మెదడు పనితీరు మెరుగవుతుంది. సాధారణ శ్వాస వ్యాయామాలు మెదడు పనిచేసే విధానాన్ని మెరుగుపరుస్తాయి. ఒత్తిడి స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. సాధారణ శ్వాస వ్యాయామాలు గ్యాస్ సమస్యను తగ్గించడంలో సహాయపడతాయి.
అల్జీమర్స్ వ్యాధి ప్రమాదాన్ని తగ్గించడంలో ఏ రకమైన శ్వాస వ్యాయామాలు సహాయపడతాయి?
రోజూ చేసే అనేక రకాల శ్వాస వ్యాయామాలు ఉన్నాయి. వీటితొ పాటు దీర్ఘ శ్వాస, డయాఫ్రాగటిక్ శ్వాస, ముక్కులు ద్వారా శ్వాస, లోతైన శ్వాస తీసుకోవటం వంటి విధానాలు దోహదపడతాయి. శ్వాసను నెమ్మదిగా పీల్చడం, లోతుగా పీల్చడం, రిలాక్సేషన్ టెక్నిక్ వంటివి ఉపయోగపడతాయి.
READ ALSO : Eating Fruit : ప్రతిరోజూ ఒక పండు తినడం ఎందుకు అవసరం? నిపుణులు ఏం చెబుతున్నారంటే ?
అల్జీమర్స్ దరిచేరకుండా ఉండేందుకు లోతైన శ్వాస విధానం ;
లోతైన శ్వాసను అనుసరించటానికి సౌకర్యవంతమైన స్థానంలో కూర్చోవాలి. కళ్ళు మూసుకోని ముక్కు ద్వారా నెమ్మదిగా గాలి పీల్చుకోవాలి. నాలుగు అంకెలు లెక్కించేంతవరకు గాలిని అలాగే పట్టి ఉంచాలి. తరువాత నెమ్మదిగా నోటి ద్వారా గాలి పీల్చుకోవాలి. శ్వాస యొక్క లయపై దృష్టి సారించి ఇలా కొన్ని నిమిషాల పాటు ఈ ప్రక్రియను కొనసాగించాలి.
డయాఫ్రాగటిక్ శ్వాస ప్రక్రియ ;
డయాఫ్రాగటిక్ శ్వాస అనేది శ్వాసను నియంత్రించడానికి డయాఫ్రాగమ్ కండరాన్ని ఉపయోగించడంపై దృష్టి సారించే ఒక సాంకేతికతకగా చెప్పవచ్చు. అల్జీమర్స్ రాకుండా చూడటంలో డయాఫ్రాగ్మాటిక్ శ్వాస ప్రక్రియ బాగా ఉపకరిస్తుంది. డయాఫ్రాగ్మాటిక్ శ్వాస ప్రక్రియకు సంబంధించి ముందుగా వెనుకభాగంలో ఒక చేతిని ఛాతీపై , మరొకటి పొట్ట పై ఉంచడం ద్వారా ప్రారంభించాలి. ముక్కు ద్వారా నెమ్మదిగా శ్వాస తీసుకోవాలి.
READ ALSO : Lung Cancer : ఊపిరితిత్తుల క్యాన్సర్ లక్షణాలు, గుర్తించటంలో దోహదపడే ముందస్తు పరీక్షలు!
ఊపిరి పీల్చుకున్నప్పుడు, డయాఫ్రాగమ్‌తో గాలిని బయటకు నెట్టడం, కడుపుని లోపలికి లాగడంపై దృష్టి పెట్టాలి. శ్వాస ప్రక్రియపై దృష్టిపెట్టి డయాఫ్రాగమ్ యొక్క కదలికను గమనిస్తూ ఈ ప్రక్రియను కొన్ని నిమిషాలు చేయాలి.
అల్జీమర్స్ రాకుండా చేయటంలో తోడ్పడే నాసికా శ్వాస ప్రక్రియ?
ముక్కు ద్వారా చేసే శ్వాస ప్రక్రియకు ముందుగా కుడి బొటనవేలును ఉపయోగించి కుడి ముక్కు రంధ్రాన్ని మూసివేయాలి. ఎడమ ముక్కు రంధ్రం ద్వారా గాలి పీల్చుకోవాలి. తరువాత కుడి ఉంగరపు వేలితో ఎడమ ముక్కు రంధ్రాన్ని మూసివేసి, కుడి ముక్కు రంధ్రం ద్వారా గాలి పీల్చుకోవాలి. ఇలా పలు మార్లు ఈ ప్రక్రియను చేయాలి.
READ ALSO : Green Tea : గ్రీన్ టీ ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరుస్తుందంటే?
అల్జీమర్స్ వ్యాధి ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడే ఇతర చర్యలు:
శ్వాస వ్యాయామాలతో పాటు, అల్జీమర్స్ వ్యాధి ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడే ఇతర జీవనశైలి మార్పులు ఉపయోగపడతాయి. రోజువారి వ్యాయామాలు, ఆరోగ్యకరమైన ఆహారం, తగిన మోతాదులో నిద్రపోవడం వంటివి అనుసరించాలి.