Lung Cancer : ఊపిరితిత్తుల క్యాన్సర్ లక్షణాలు, గుర్తించటంలో దోహదపడే ముందస్తు పరీక్షలు!

అదే సమయంలో వ్యాధి తీవ్రత అధికంగా ఉన్నప్పుడు న్యుమోనియా , తరచుగా శ్వాసకోశ ఇన్ఫెక్షన్లకు గురికావటటం, పక్కటెముకల వద్ద నొప్పి, మింగడంలో ఇబ్బంది, ముఖం, మెడ లేదా చేతుల్లో వాపు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఊపిరితిత్తుల క్యాన్సర్ ధూమపానం చేసేవారిలో, ధూమపానం చేయనివారిలో కూడా వస్తుంది.

Lung Cancer : ఊపిరితిత్తుల క్యాన్సర్ లక్షణాలు, గుర్తించటంలో దోహదపడే ముందస్తు పరీక్షలు!

Lung cancer symptoms, early tests that help in detection!

Lung Cancer : ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అత్యధిక క్యాన్సర్‌ మరణాలకు కారణం ఊపిరితిత్తుల క్యాన్సర్. ఊపిరితిత్తుల క్యాన్సర్ అనేది ఊపిరితిత్తులలోని ఏదైనా భాగంలో ప్రారంభమౌతుంది. క్యాన్సర్ అనేది కణితుల పెరుగుదలకు దారితీసే కణాల వేగవంతమైన , అనియంత్రిత విభజనకు దారితీసే పరిస్థితి. ఈ పరిస్ధితి వల్ల ఊపిరితిత్తులలో కణితుల పెరుగుదల శ్వాస సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. శ్వాసక్రియ ప్రక్రియలో ఊపిరితిత్తులు కీలక పాత్ర పోషిస్తాయి.

క్యాన్సర్ ప్రారంభ దశలో ఎలాంటి లక్షణాలు కనిపించనప్పటికీ కణితి పెరుగుతున్న కొద్ది శ్వాసకు సంబంధించి ఇబ్బందులు తలెత్తుతాయి. క్యాన్సర్ బారిన పడిన వారిలో నిరంతర దగ్గు వారాల వరకు కొనసాగుతుంది. శ్వాస ఆడకపోవుట, కఫంలో రక్తం, ఛాతి నొప్పి , దగ్గుతున్నప్పుడు లేదా లోతైన శ్వాస తీసుకుంటున్నప్పుడు గురక, గొంతు బొంగురుపోవటం, స్వరంలో మార్పులు, బరువు కోల్పోవటం, ఆకలి లేకపోవటం, అలసట, తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి.

అదే సమయంలో వ్యాధి తీవ్రత అధికంగా ఉన్నప్పుడు న్యుమోనియా , తరచుగా శ్వాసకోశ ఇన్ఫెక్షన్లకు గురికావటటం, పక్కటెముకల వద్ద నొప్పి, మింగడంలో ఇబ్బంది, ముఖం, మెడ లేదా చేతుల్లో వాపు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఊపిరితిత్తుల క్యాన్సర్ ధూమపానం చేసేవారిలో, ధూమపానం చేయనివారిలో కూడా వస్తుంది. పొగ పీల్చే వారిలో పొగకు గురైనప్పుడు, ఊపిరితిత్తుల ఆరోగ్యకరమైన కణజాలం దెబ్బతింటుంది. అదృష్టవశాత్తూ, దెబ్బతిన్న కణాలను కాలక్రమేణా ఊపిరితిత్తుల ద్వారా సరిచేయవచ్చు. అయితే పొగతాగేవారిలో ఊపిరితిత్తులు పనిచేయడం కష్టమవుతుంది ఇది కణాలకు శాశ్వత నష్టం కలిగిస్తుంది.

పరీక్షలతో ఊపిరితిత్తుల క్యాన్సర్ ను గుర్తించటం ;

ఊపరితిత్తుల క్యాన్సర్ ను ముందస్తు గా గుర్తించాలంటే కొన్ని రకాల పరీక్షలు అవసరమౌతాయి. మామోగ్రామ్‌, కొలనోస్కోపీ వంటి పరీక్షలను ముందుగా నిర్వహించాల్సి ఉంటుంది. . అంతేకాకుండా రొమ్ము, పెద్దపేగు క్యాన్సర్‌ ఆనవాళ్లను తొలిదశలోనే గుర్తించటానికి ఈ పరీక్షలు తోడ్పడతాయి. అయితే ఊపిరితిత్తి క్యాన్సర్‌ ముందస్తు పరీక్షతో చికిత్సలో మంచి ఫలితం కనిపిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. స్క్రీనింగ్ చేయడం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్‌ని ముందుగానే గుర్తించి ట్రీట్‌మెంట్ చేయించుకునేందుకు అవకాశం ఉంటుంది. క్యాన్సర్‌కి ఎక్కువ ప్రమాదం ఉన్న వ్యక్తులు రెగ్యులర్‌గా చెకప్ చేయించుకోవాలి. దీని వల్ల లక్షణాలను ముందుగానే కనుక్కోవచ్చు. ప్రస్తుతం ఊపిరితిత్తుల క్యాన్సర్ చికిత్సలో కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ వంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి.