Night Sleep : రాత్రిళ్లు నిద్రపట్టటంలేదా!..అయితే ఈ టిప్స్ పాటించండి…

రాత్రి పడుకునేముందు అరికాళ్లకు ఆముదం లేదా నువ్వుల నూనె, లేదా కొబ్బరి నూనెతో మర్దన చేయాలి. దీనివల్ల నిద్ర బాగా పడుతుంది. గోరువెచ్చని పాలను నిద్రకు ఉపక్రమించే అరగంట ముందు తాగాలి. గోర

Sleep

Night Sleep : ప్రశాతంగా నిద్రపోవటమనేది కూడా ఓ వరం లాంటిదే. చాలా మందికి రాత్రిళ్ళు సరిగా నిద్రపట్టక ఇబ్బంది పడుతుంటారు. మెత్తని పరుపు, నిద్రకు అనుకూలమైన వాతావరణం ఉన్నప్పటికీ నిద్ర మాత్రం రాదు. దీనికి అనేక కారణాలు లేకపోలేదు. ఇందుకు ఆరోగ్య సంబంధమైన కారణాలు కొన్నైతే, వ్యక్తిగతంగా తమ జీవనశైలిలో నెలకొనే వత్తిళ్ళు మరికొన్ని. అన్నీ కలిసి రాత్రినిద్రకు భంగం కలిగిస్తుంటాయి.

నిద్రపోవాలని నిర్ణయానికి వచ్చినప్పుడే ముందుగా శరీరాన్ని మానసికంగా సిద్ధం చేసుకోవాలి. పగలు జరిగిన ఘటనలను మెదళ్ళ నుండి పక్కనపెట్టాలి. వాటి గురించి నిద్రపోయే సమయంలో ఆలోచించటం అంతమంచిది. కాదు ఆలా ఆలోచిస్తూ ఉంటే నిద్రపట్టదు. రాత్రి నిద్ర సరిగా పట్టని వారు కొన్ని చిట్కాలు పాటిస్తే సుఖంగా నిద్రపోయేందుకు దోహదం చేస్తాయి.

గసగసాలను దోరగా వేయించి పల్చని బట్టలో వేసుకుని నిద్రించే ముందు వాసన పీలుస్తూ ఉండాలి. ఇలా చేస్తే మెల్లమెల్లగా నిద్రలోకి జారుకుంటారు. పడుకునే ముందు నాటు ఆవునెయ్యి గోరువెచ్చగా చేసుకొని ముక్కు రంధ్రాల్లో రెండు చుక్కలు వేసుకోవాలి. దీనివల్ల కూడా రాత్రిళ్ళు ప్రశాంతంగా నిద్రపోయేందుకు అవకాశం ఉంటుంది.

రాత్రి పడుకునేముందు అరికాళ్లకు ఆముదం లేదా నువ్వుల నూనె, లేదా కొబ్బరి నూనెతో మర్దన చేయాలి. దీనివల్ల నిద్ర బాగా పడుతుంది. గోరువెచ్చని పాలను నిద్రకు ఉపక్రమించే అరగంట ముందు తాగాలి. గోరువెచ్చని పాలు తాగటంవల్ల నిద్రవస్తుంది. చేతివేళ్లతో లేదా దువ్వెనతో తలవెంట్రుకలను మృదువుగా దువ్వుకుంటూ ఉండాలి. చేతులతో అరికాళ్లను మెల్లమెల్లగా మర్దన చేసుకుంటే నిద్రపట్టేందుకు అవకాశం ఉంటుంది.

నిద్ర పోవడానికి రెండు గంటల ముందు నుంచి మొబైల్‌ ఫోన్‌ చూడటం మానేయాలి. అంతేకాదు, రాత్రిళ్లు తల పక్కన మొబైల్‌ పెట్టుకుంటే రేడియేషన్‌ ప్రభావం వల్ల కూడా సరిగా నిద్ర రాదు. కాబట్టి మొబైల్‌ను దూరంగా పెట్టడం మంచిది. `రోజూ రాత్రి పడుకునే ముందు కొద్దిసేపు కళ్లు మూసుకుని ధ్యానం చేయాలి. సంగీతం వంటి వాటిని వింటూ ఉన్నా అలాగే నిద్రలోకి జారుకుంటారు. ఎప్పుడైతే మనస్సును ప్రశాంతంగా ఉంచుతారో అప్పుడు నిద్ర వదన్నా వస్తుంది.