Hair Health : వర్షకాలంలో జుట్టు ఆరోగ్యం కోసం పెరుగుతో ఇలా చేసి చూడండి !

వర్షాలకు తడవటం వల్ల జుట్టు జిడ్డుగా మారుతుంది. తలస్నానం చేసినప్పటికీ తల జిడ్డుగా ఉంటుంది. దీని నుండి బయటపడాలంటే అరకప్పు పెరుగులో, ఒక టీ స్పూన్‌ తేనె, ఒక స్పూన్ బాదం నూనె వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని తలకు ప్యాక్‌లా అప్లై చేయాలి.

Hair Health : వర్షకాలంలో చల్లని వాతావరణం, తరుచుగా వర్షంలో తడవటం వల్ల ఆప్రభావం జుట్టుపై పడుతుంది. దీని వల్ల జుట్టురాలిపోవటం, జిడ్డుగా తయారవ్వటం, చుండ్రు, వంటి సమస్యలు ఉత్పన్నం అవుతాయి. అదే సమయంలో హార్మోన్లలో మార్పులు కూడా తోడవ్వటం, పోషకాహారలోపం, కాలుష్య కారకాలు, మానసిక ఒత్తిడి తదితర కారణాలు జుట్టు ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి.

READ ALSO : No Confidence Motion: ఆవులు, గేదెల్ని కూడా లెక్కిస్తారు, మా లెక్కలు ఒద్దా? ఆర్ఎస్ఎస్ పేరు ప్రస్తావిస్తూ జేడీయూ నేత ఫైర్

ఈ పరిస్ధితులు చివరకు జుట్టు రాలిపోవటానికి దారితీస్తాయి. వర్షకాలంలో జుట్టుకు పోషణకు పెరుగు బాగా సహాయపడుతుంది. పెరుగులో ఉండే పోషకాలు జుట్టు ఆరోగ్యానికి మంచి కండిషనర్‌గా పనిచేస్తాయి. వెంట్రుకలకు బలాన్ని ఇచ్చి, మెరుపు సంతరించుకునేలా చేస్తాయి. పెరుగుతో కూడిన ప్యాక్స్ జుట్టును కాపాడడంలో సహాయపడతాయి.​

వర్షకాలంలో చుండ్రు సమస్య అధికంగా ఉంటుంది. పెరుగు, నిమ్మరసంతో ఈ సమస్యకు చెక్‌ చెప్పవచ్చు. చుండ్రుతో ఇబ్బందిపడుతున్నవారు నాలుగు టేబుల్‌స్పూన్ల హెన్నా పొడిలో రెండు టేబుల్‌స్పూన్ల నిమ్మరసం వేసి బాగా కలపాలి. దానిలోనే పెరుగు వేసి బాగా పేస్ట్‌లా కలుపుకోవాలి. ఈ పేస్టును జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు అప్లై చేసి 30 నిమిషాల పాటు ఆరనివ్వాలి. అనంతరం షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా వారానికి ఒక్కసారి చేయటం వల్ల చుండ్రు సమస్య తొలగిపోతుంది.​

READ ALSO : Google Chrome Users : గూగుల్ క్రోమ్ యూజర్లకు ప్రభుత్వం హెచ్చరిక.. మీ బ్రౌజర్ వెంటనే అప్‌డేట్ చేసుకోండి.. లేదంటే ముప్పు తప్పదు..!

వర్షాలకు తడవటం వల్ల జుట్టు జిడ్డుగా మారుతుంది. తలస్నానం చేసినప్పటికీ తల జిడ్డుగా ఉంటుంది. దీని నుండి బయటపడాలంటే అరకప్పు పెరుగులో, ఒక టీ స్పూన్‌ తేనె, ఒక స్పూన్ బాదం నూనె వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని తలకు ప్యాక్‌లా అప్లై చేయాలి. దానిని 20 నిమిషాల పాటు ఆరనిచ్చిన అనంతరం షాంపూతో తలస్నానం చేయాలి.

మెంతుల్ని రాత్రంతా నానబెట్టుకోవాలి. ఉదయం మిక్సీ పట్టుకోని ఒక గిన్నెలో పెరుగులో వేసి దీనినికలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. ఆ పేస్టును జుట్టు మొదళ్ల నుంచి చివర్ల వరకు, మాడుకూ పట్టించాలి. అలా గంట పాటు ఉంచుకోని తరువాత షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా వారానికి ఒక సారి చేయటం వల్ల జట్టు చివర్లు చిట్లిపోవడాన్ని తగ్గుతుంది. అలాగే జుట్టు రాలటం తగ్గుతుంది.​

READ ALSO : ఒకే ఫోన్‌లో 2 వాట్సాప్ అకౌంట్లను ఎలా వాడాలంటే?

జుట్టు రాలిపోతున్న సమస్యతో బాధపడుతున్నవారు ఎండబెట్టి పొడి చేసిన మందార ఆకులు, కొద్ది మందార పువ్వుల పొడిని తీసుకుని.. దీనిలో ఉసిరి పొడి, మెంతుల పొడి కలుపుకోవాలి. దానికి కొద్ది పెరుగు చేర్చుకుని పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించాలి. 20 నిమిషాలపాటు ఆరనివ్వాలి. అనంతరం మైల్డ్‌ షాంపూతో తలస్నానం చేయాలి. ఈ విధంగా చేస్తే జుట్టు రాలడం తగ్గిపోతుంది.

ట్రెండింగ్ వార్తలు