Google Chrome Users : గూగుల్ క్రోమ్ యూజర్లకు ప్రభుత్వం హెచ్చరిక.. మీ బ్రౌజర్ వెంటనే అప్‌డేట్ చేసుకోండి.. లేదంటే ముప్పు తప్పదు..!

Google Chrome Users : ఫిషింగ్ అటాక్స్, డేటా ఉల్లంఘనలు, మాల్వేర్ ఇన్‌ఫెక్షన్‌ల ప్రమాదాన్ని కలిగించే వెబ్ బ్రౌజర్ నిర్దిష్ట వెర్షన్లలో హై రిస్క్ బగ్స్ గురించి CERT-In గూగుల్ క్రోమ్ (Google Chrome)యూజర్లను హెచ్చరిస్తోంది.

Google Chrome Users : గూగుల్ క్రోమ్ యూజర్లకు ప్రభుత్వం హెచ్చరిక.. మీ బ్రౌజర్ వెంటనే అప్‌డేట్ చేసుకోండి.. లేదంటే ముప్పు తప్పదు..!

Government issues high-risk warning for Google Chrome users

Google Chrome Users : భారత ప్రభుత్వ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) ఇటీవల (Google Chrome) యూజర్లకు హై రిస్క్ హెచ్చరికను జారీ చేసింది. CERT-In గూగుల్ క్రోమ్ నిర్దిష్ట వెర్షన్లలో అనేక బగ్స్ ఉన్నాయని హెచ్చరించింది. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఏజెన్సీగా (CERT-In) బ్రౌజర్ భద్రతా ప్రమాదాల గురించి క్రోమ్ యూజర్లను హెచ్చరిస్తుంది.

CERT-In హెచ్చరిక ప్రకారం.. క్రోమ్ యూజర్లు తమ సున్నితమైన సమాచారాన్ని బహిర్గతం చేసే వివిధ భద్రతా సమస్యలను ఎదుర్కొంటారు. ఈ ప్రమాదాలలో ఫిషింగ్ అటాక్స్, డేటా ఉల్లంఘనలు, మాల్వేర్ ఇన్ఫెక్షన్‌లు ఉన్నాయి. వినియోగదారులు జాగ్రత్తగా ఉండటంతో పాటు తమను తాము ప్రొటెక్ట్ చేసుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యమని తెలిపింది.

హై-సెవరిటీ రిస్క్ అంటే ఏమిటి? :
అటాక్ చేసే వ్యక్తి మీ కంప్యూటర్‌ను కంట్రోల్ చేయడానికి అనుమతించే మల్టీ సెక్యూరిటీ లోపాలను గూగుల్ క్రోమ్ కలిగి ఉంది. ప్రాంప్ట్‌లు, వెబ్ పేమెంట్ల API, SwiftShader, Vulkan, Video, WebRTCతో సహా క్రోమ్ అనేక ప్రాంతాల్లో ఈ దుర్బలత్వాలు ఉన్నాయి. అటాక్ చేసే వ్యక్తి వీడియోలో హీప్ బఫర్ ఓవర్‌ఫ్లో లేదా PDFలో ఇంటిజార్ ఓవర్‌ఫ్లో కూడా ఉపయోగించుకోవచ్చు.

Read Also : Netflix Password Sharing : భారత్‌లో నో పాస్‌వర్డ్ షేరింగ్.. నెట్‌ఫ్లిక్స్ అకౌంట్ ఎవరికి ఉచితం? ఎవరు చెల్లించాలంటే?

V8లో టైప్ గందరగోళం కారణంగా గూగుల్ క్రోమ్‌లో అనేక భద్రతా లోపాలు ఉన్నాయి. విజువల్స్‌లో హీప్ బఫర్ ఓవర్‌ఫ్లో (WebGL)లో అనేక సమస్యలు తలెత్తవచ్చు. హానికరమైన వెబ్‌సైట్‌ను విజిట్ చేసే యూజర్లను మోసగించడం ద్వారా దాడి చేసే మోసగాళ్లు ఈ దుర్బలత్వాలను ఉపయోగించుకోవచ్చు. మీరు హానికరమైన వెబ్‌సైట్‌ను విజిట్ చేస్తే.. దాడి చేసే వ్యక్తి మీ కంప్యూటర్‌ను కంట్రోల్ చేయొచ్చు. మీ వ్యక్తిగత డేటాను దొంగిలించవచ్చు.

CERT-In ద్వారా క్రోమ్ బ్రౌజర్ లోపాల లిస్టు మీకోసం..
* CVE-2023-4068
* CVE-2023-4069
* CVE-2023-4070
* CVE-2023-4071
* CVE-
* 2023-4072 – CVE-2023-4073
* OVE-2023-4074
* CVE -2023-4075
* CVE-2023-4076
* CVE-2023-4077
* CVE-2023-4078

CERT-In ఈ లోపాలను కలిగి ఉన్న గూగుల్ క్రోమ్ ప్రభావిత వెర్షన్‌లను రివీల్ చేసింది. Linux, Mac యూజర్లు 115.0.5790.170కి ముందున్నగూగుల్ క్రోమ్ వెర్షన్లలో Windows కోసం 115.0.5790.170/.171కి ముందు క్రోమ్ వెర్షన్లతో అప్‌డేట్ చేసుకోవాలి. తమ సిస్టమ్‌లను ప్రొటెక్ట్ చేసుకునేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలి.

మీ డివైజ్ ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి :
మీ సిస్టమ్‌లను ప్రొటెక్ట్ చేసుకోవడానికి గూగుల్ క్రోమ్ వీలైనంత త్వరగా లేటెస్ట్ వెర్షన్‌కి అప్‌డేట్ చేయాలని CERT-In వినియోగదారులకు సూచిస్తోంది. ఈ లోపాలను పరిష్కరించడానికి గూగుల్ ఇప్పటికే ఒక కొత్త అప్‌డేట్ రిలీజ్ చేసింది.

గూగుల్ క్రోమ్ అప్‌డేట్ చేయాలంటే? :
గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి.
విండో రైట్ టాప్ కార్నర్‌లో మూడు చుక్కలను క్లిక్ చేయండి.
Help> Google Chrome > About ఎంచుకోండి.
అప్‌డేట్ అందుబాటులో ఉంటే.. Chrome దాన్ని ఆటోమాటిక్‌గా డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేస్తుంది.
Update ఇన్‌స్టాల్ చేసిన తర్వాత క్రోమ్ రీస్టార్ట్ అవుతుంది.
మీరు ఈ దశలను ఫాలో చేయడం ద్వారా అప్‌డేట్‌ల కోసం మాన్యువల్‌గా కూడా చెక్ చేయవచ్చు.

Government issues high-risk warning for Google Chrome users

Government issues high-risk warning for Google Chrome users

గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి.
విండో రైట్ టాప్ కార్నర్‌లో 3 చుక్కలను క్లిక్ చేయండి.
Help > Google Chrome > About ఎంచుకోండి.
Updates కోసం Check ఆప్షన్ క్లిక్ చేయండి.
సిస్టమ్‌ను అప్‌డేట్ చేయకుండా ఆన్‌లైన్ లోపాల నుంచి మీ డివైజ్‌లను ప్రొటెక్ట్ చేసేందుకు అనుసరించాల్సిన కొన్ని అదనపు సెక్యూరిటీ టిప్స్ ఉన్నాయి.

మీరు విజిట్ చేసే వెబ్‌సైట్‌లు, మీరు క్లిక్ చేసే లింక్‌ల గురించి కూడా జాగ్రత్తగా ఉండాలి. వెబ్‌సైట్ సురక్షితంగా ఉందో లేదో మీకు తెలియకపోతే నివారించడం ఉత్తమం. మీ ఆన్‌లైన్ అకౌంట్లన్నింటిని స్ట్రాంగ్ పాస్‌వర్డ్‌లను క్రియేట్ చేయడం, స్టోర్ చేయడానికి స్ట్రాంగ్ పాస్‌వర్డ్ మేనేజర్ ఉపయోగించండి.

దీన్ని అందించే మీ ఆన్‌లైన్ ఖాతాలన్నింటికీ టూ-ఫ్యాక్టర్డ్ అథెంటికేషన్ (2FA)ని ప్రారంభించండి. మీరు ఆన్‌లైన్‌లో, ముఖ్యంగా సోషల్ మీడియాలో ఏ సమాచారాన్ని షేర్ చేస్తారో జాగ్రత్తగా ఉండండి. లేటెస్ట్ సెక్యూరిటీ ప్యాచ్‌లతో మీ ఆపరేటింగ్ సిస్టమ్, సాఫ్ట్‌వేర్‌ను లేటెస్టుగా ఉంచండి. మాల్వేర్ నుంచి మీ కంప్యూటర్‌ను ప్రొటెక్ట్ చేయడానికి ఫైర్‌వాల్, యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించండి.

Read Also : Google Pixel 7 Pro Discount : గూగుల్ పిక్సెల్ 7ప్రో ఫోన్‌పై రూ. 17వేలు డిస్కౌంట్.. ఈ ఫోన్ ఎందుకు కొనాలంటే?