Sukanya Samriddhi Yojana : పోస్టాఫీసులో అద్భుతమైన స్కీమ్.. మీ పిల్లల చదువు, పెళ్లి నాటికి రూ. 72 లక్షలు సంపాదించుకోవచ్చు.. ఎలాగంటే?
Sukanya Samriddhi Yojana : పోస్టాఫీసు సుకన్య సమృద్ధి యోజన (SSY) పథకంలో మీ పిల్లల పేరుతో పెట్టుబడి పెట్టండి. ఏకంగా రూ . 72 లక్షలు సంపాదించుకోవచ్చు.
Sukanya Samriddhi Yojana
Sukanya Samriddhi Yojana : పోస్టాఫీసులో పెట్టుబడి పెడుతున్నారా? మీ పిల్లల పేరుతో ఇలా పెట్టుబడి పెట్టండి.. మీ కూతురి చదువులకు లేదా పెళ్లి సమయానికి భారీ మొత్తంలో డబ్బులు కూడబెట్టుకోవచ్చు. మీరు చేయాల్సిందిల్లా.. పోస్టాఫీసు అందించే అద్భుతమైన పథకాల్లో సుకన్య సమృద్ధి యోజన (SSY) పథకంలో పెట్టబడి పెట్టడమే.
దేశంలోని చాలామంది తల్లిదండ్రులు (Sukanya Samriddhi Yojana) తమ ఆడపిల్లల భవిష్యత్తు అవసరాలకు సంబంధించి ఆందోళన చెందుతుంటారు. ప్రతి పేరెంట్ తమ కుమార్తె కెరీర్, విద్య, వివాహం కోసం అమసరమైన డబ్బును కూడబెట్టాలని భావిస్తుంటారు.
ప్రస్తుతం అనేక సేవింగ్స్ స్కీమ్స్ ఉన్నప్పటికీ అందులో ఆడపిల్లల భవిష్యత్తు కోసం కేంద్ర ప్రభుత్వం అందించే సుకన్య సమృద్ధి యోజన అత్యంత ముఖ్యమైనది. పోస్టాఫీసు చిన్న పొదుపు పథకాలలో ఈ SSY ఒకటి. మీ డిపాజిట్లను ఆదా చేసుకోవడమే కాకుండా ఇతర పథకాల కన్నా భారీ మొత్తంలో ఎక్కువ వడ్డీ రేట్లను పొందవచ్చు. అక్టోబర్ నుంచి డిసెంబర్ 2025 వరకు త్రైమాసికానికి 8.2 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. మీ కుమార్తె భవిష్యత్తు కోసం ఏకంగా రూ. 72 లక్షల డబ్బులను సంపాదించుకోవచ్చు.
రూ. 72 లక్షల సంపాదన ఎలా? :
సుకన్య సమృద్ధి యోజన పథకంలో చక్రవడ్డీ ఉంటుంది. డిపాజిట్ చేసిన మొత్తంపై వడ్డీని ఏటా చక్రవడ్డీ వస్తుంది. అసలు మొత్తానికి కలిపి తర్వాతి సంవత్సరాల్లో మరింత ఎక్కువ రాబడిని ఇస్తుంది. ఈ పథకానికి 15 సంవత్సరాలు మాత్రమే పెట్టుబడి పెట్టాలి. అయితే, అకౌంట్ 21 ఏళ్లలో మెచ్యూరిటీ చెందుతుంది. మీరు గత 6 ఏళ్లలో ఒక్క రూపాయి కూడా డిపాజిట్ చేయకపోయినా మీరు ఇప్పటికీ వడ్డీని పొందుతారు.
మీరు ప్రతి ఏడాదిలో రూ. 1.50 లక్షలు డిపాజిట్ చేస్తే.. 15 ఏళ్లలో మీ మొత్తం డిపాజిట్ రూ. 22.50 లక్షలు అవుతుంది. ప్రస్తుత 8.2 శాతం వడ్డీ రేటు ప్రకారం.. మీరు మెచ్యూరిటీ తర్వాత సుమారు రూ. 71,82,119 అందుకుంటారు. ఇందులో, దాదాపు రూ. 49,32,119 వడ్డీ మాత్రమే. ఈ డబ్బు మీ కుమార్తె చదువు లేదా వివాహం సమయానికి అందుతుంది.
పథకానికి ప్రభుత్వ హామీ :
బేటీ బచావో, బేటీ పఢావో క్యాంపెయిన్ కింద ప్రారంభమైన సుకన్య సమృద్ధి యోజన ఇప్పుడు లక్షలాది కుటుంబాలకు అత్యంత ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ పథకం కింద ఇప్పటివరకు రూ. 3.25 లక్షల కోట్లకు పైగా డబ్బులు జమ అయ్యాయి. అయితే అకౌంట్ల సంఖ్య 40 మిలియన్లకు పైగా చేరుకుంది. ఈ పథకంలో పెట్టుబడికి ఎలాంటి మార్కెట్ రిస్క్ ఉండదు. చాలా సురక్షితం కూడా ప్రభుత్వమే వడ్డీ రేటును త్రైమాసికానికి ఒకసారి సమీక్షిస్తుంది. ప్రస్తుతం, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ 8.2 శాతంతో అత్యధిక రేటును అందిస్తుంది.
పన్ను ప్రయోజనాలివే :
సుకన్య సమృద్ధి యోజన (SSY) ద్వారా పన్ను ఆదా చేసుకోవచ్చు. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద ఈ పథకం కింద డిపాజిట్లు రూ. 1.5 లక్షల వరకు మినహాయింపు పొందవచ్చు. అయితే, ఈ బెనిఫిట్ పాత పన్ను విధానాన్ని ఎంచుకునే పన్ను చెల్లింపుదారులకు మాత్రమే వర్తిస్తుంది. ఈ పథకం అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే.. వడ్డీ మెచ్యూరిటీ మొత్తం రెండూ పన్ను రహితంగా ఉంటాయి. ఫలితంగా ఈఈఈ కేటగిరీ కింద వర్గీకరించారు. ఇందులో పెట్టుబడితో వడ్డీ, మెచ్యూరిటీ పన్ను రహితంగా ఉంటాయి.
అకౌంట్ ఓపెన్ రూల్స్ :
ఈ స్కీమ్ పెట్టుబడికి చాలా ఈజీగా ఉంటుంది. కనీసం రూ. 250 డిపాజిట్ చేయాలి. మీ ఆర్థిక అవసరాలను బట్టి మొత్తాన్ని రూ. 50 గుణిజాలలో పెంచుకోవచ్చు. కనీసం రూ. 250 వార్షిక డిపాజిట్ తప్పనిసరి. ఈ అకౌంట్ 10 ఏళ్ల కన్నా తక్కువ వయస్సు ఉన్న ఆడపిల్ల పేరు మీద తల్లిదండ్రులు లేదా గార్డియన్లు ఓపెన్ చేయొచ్చు. అకౌంట్ ఓపెన్ చేయడం చాలా సులభం. ఏదైనా పోస్టాఫీసు లేదా బ్యాంకులో ఈ స్కీమ్ పొందవచ్చు.
