Diabetes Affects The Skin : మధుమేహం చర్మంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసా? ఈ లక్షణాల కనిపిస్తే జాగ్రత్త పడటం మంచిది..

మధుమేహంతో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది పురుషులు, మహిళలు , పిల్లలు బాధపడుతున్నారు. ప్రధానంగా జీవనశైలి వ్యాధిగా మధుమేహం మారింది. భారతదేశంలో మధుమేహం చాపక్రింద నీరులా విస్తరిస్తుంది. రోజురోజుకు దీని బారిన పడుతున్నవారి సంఖ్య పెరుగుతుంది.

Diabetes Affects The Skin : మధుమేహం చర్మంతో సహా శరీరంలోని అనేక భాగాలను ప్రభావితం చేస్తుంది. మధుమేహం చర్మంపై ప్రభావం చూపినప్పుడు రక్తంలో చక్కెర (గ్లూకోజ్) స్థాయిలు చాలా ఎక్కువగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు.

READ ALSO : కాఫీతో మధుమేహం దూర‌మవుతుందా?

మధుమేహంతో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది పురుషులు, మహిళలు , పిల్లలు బాధపడుతున్నారు. ప్రధానంగా జీవనశైలి వ్యాధిగా మధుమేహం మారింది. భారతదేశంలో మధుమేహం చాపక్రింద నీరులా విస్తరిస్తుంది. రోజురోజుకు దీని బారిన పడుతున్నవారి సంఖ్య పెరుగుతుంది.

మధుమేహంతో బాధపడే వారిలో ఎదురయ్యే చర్మ సమస్యలు , లక్షణాలు ;

1. చర్మంపై పసుపు, ఎరుపు లేదా గోధుమ రంగు మచ్చలు ;

మధుమేహం ఉన్నవారిలో చర్మంపై అప్పుడప్పుడు మొటిమల లాగా కనిపించే చిన్న గడ్డలు ఏర్పడతాయి. అవి క్రమేపి అభివృద్ధి చెందుతాయి. ఈ గడ్డలు వాపు ఉండి , చర్మం దళసరిగా మారి పాచెస్‌ ఏర్పడతాయి. ఇవి పసుపు, ఎరుపు లేదా గోధుమ రంగులో ఉంటాయి. రక్తంలో చక్కెర స్థాయిలు, టైప్-2 మధుమేహం ఎక్కువగా ఉన్న చాలా మంది వ్యక్తులు చర్మ సమస్యలను కలిగి ఉంటారు.

READ ALSO : Diabetes : వాయుకాలుష్యంతో మధుమేహం ముప్పు! పట్టణ వాసుల్లోనే అధికమా?

2. చర్మం గట్టిపడటం ;

చేతి వేళ్లు, కాలిపై చర్మం బిగుతుగా మారుతుంది. దీనిని వైద్యపరిభాషలో డిజిటల్ స్క్లెరోసిస్ అని పిలుస్తారు. చేతి వేళ్లు దృఢంగా మారతాయి. కదల్చటం కష్టం అవుతుంది. మధుమేహం నియంత్రించకపోతే చేతివేళ్లు గట్టిగా మారతాయి. గట్టిగా, మందంగా ఉండి, వాపు ఉంటుంది. కొన్నిసార్లు, చర్మం గట్టిపడటం సమస్య ముఖం, భుజాలు మరియు ఛాతీకి వ్యాపిస్తుంది.

3. గాయం మానటంలో ఎక్కువ సమయం పట్టటం ;

మధుమేహం వల్ల శరీరం ఇన్సులిన్‌ను అవసరమైన విధంగా ఉపయోగించలేకపోతుంది, ఇది అధిక రక్తంలో చక్కెర స్థాయిలకు దారితీస్తుంది. గాయం త్వరగా మానకుండా చేస్తుంది. మధుమేహం రోగనిరోధక వ్యవస్థ లోపాన్ని, రక్త ప్రసరణను బలహీనపరుస్తుంది. ఇన్ఫెక్షన్ల బారిన పడేలా చేస్తుంది. గాయాలకు చికిత్స చేయకుండా వదిలేయడం సంక్లిష్టతలకు
దారి తీస్తుంది.

READ ALSO : Diabetes : మధుమేహం సమస్య గుండె,బీపీ, మూత్రపిండాల సమస్యలకు దారితీస్తుందా?

4. బొబ్బలు ;

ఇది చాలా అరుదుగా సంభవిస్తుంది. మధుమేహం ఉన్న వ్యక్తులు చర్మంపై అకస్మాత్తుగా బొబ్బలు కనిపించటాన్ని గమనించవచ్చు. పెద్ద పొక్కులు, బొబ్బలు కాళ్లు, ముంజేతులపై ఏర్పడతాయి. తీవ్రమైన కాలిన గాయాల్లాగా బొబ్బలు కనిపిస్తాయి. కాలిన తర్వాత ఏర్పడే బొబ్బల మాదిరిగా ఈ బొబ్బలు బాధను కలిగించవు.

గమనిక ; అందుబాటులో ఉన్న వివిధ మార్గాల్లో సమాచారం సేకరించి అందించటమైనది. కేవలం అవగాహన కోసం మాత్రమే . వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు వైద్యులను సంప్రదించి తగిని చికిత్స పొందటం మంచిది.

ట్రెండింగ్ వార్తలు