Sitting On The Floor : నేలపై కూర్చోవడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసా?

నేలపై కూర్చోవటం వల్ల రక్తప్రసరణ సజావుగా ఉంటుంది. తిన్న ఆహారం కూడా జీర్ణమవుతుంది. అంతేకాకుండా బరువు తగ్గటంలో కూడా నేలపై కూర్చువటం వల్ల సాధ్యమవుతుంది. నేలపై కూర్చోవటం వల్ల మీరు తినే ఆహారాన్ని తక్కువ మోతాదులో తీసుకునేందుకు వీలుంటుంది.

Sitting On The Floor : నేలపై కూర్చోవడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసా?

Sitting On The Floor

Updated On : April 10, 2023 / 11:54 AM IST

Sitting On The Floor : అన్నం తినేటప్పుడు నేలపై కూర్చోవడం భారతీయ సంస్కృతులలో ఒక సాధారణ పద్ధతి. ఇంకా చెప్పాలంటే కుర్చీలు, టేబుల్స్ వచ్చిన తరువాత నేలపై కూర్చోవటం అన్నది చాలా వరకు తగ్గిపోయింది. నేలపై కూర్చోవడం వల్ల చురుకుదనంతోపాటు, శరీర కదలికలు సులభ తరంగా మార్చుకోవచ్చు. దీని వల్ల కండరాలు శక్తివంతంగా మరతాయి. నేలపై కూర్చోవటం కొంతమేర అసౌకర్యంగానే ఉంటుంది. మరికొందరిలో కీళ్ల సమస్యలకు దారితీస్తుంది.

READ ALSO : Watermelon : వేసవిలో శరీరాన్ని చల్లగా,ఆరోగ్యంగా ఉంచే పుచ్చకాయ !

నేలపై కూర్చోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ;

కుర్చీ, బల్లపై కూర్చునే దానికంటే నేలపై కూర్చుకోవటం వల్ల స్ధిరత్వం ఉంటుంది. కుర్చీల్లో కూర్చోవటం వల్ల తుంటి బాగం బిగుతుగా మారే అవకాశం ఉంటుంది. అయితే నేతలపై కూర్చోవటం వల్ల హిప్ ఫ్లెక్సిబిలిటీని పెంచుతుంది. కండరాలను సాగదీయడంలో , చలనశీలతను పెంచటంలో ఈ పద్ధతి దోహదపడుతుంది. ఇది ఒకరకమైన శారీర శ్రమలాంటిదే. కాళ్ళ దిగువ కండరాలను సాగదీసేందుకు కింద కూర్చోవటం అన్నది దోహదపడుతుంది.

నేలపై కూర్చోవటం వల్ల రక్తప్రసరణ సజావుగా ఉంటుంది. తిన్న ఆహారం కూడా జీర్ణమవుతుంది. అంతేకాకుండా బరువు తగ్గటంలో కూడా నేలపై కూర్చువటం వల్ల సాధ్యమవుతుంది. నేలపై కూర్చోవటం వల్ల మీరు తినే ఆహారాన్ని తక్కువ మోతాదులో తీసుకునేందుకు వీలుంటుంది. అతిగా తినటం సాధ్యం కాదు కాబట్టి బరువు పెరిగే అవకాశం ఉండదు. టేబుల్ పై కూర్చుని తినటం తో పోలిస్తే క్రింద నేలపై కూర్చుని ఆహారం తీసుకుంటే తక్కువ మోతాదులో సరిపెట్టడాన్ని గమనించవచ్చు.

READ ALSO : Ignoring Social Media : రోజులో కేవలం 15 నిమిషాలు సోషల్ మీడియాను దూరంపెడితే మీ ఆరోగ్యం మెరుగుపడటం ఖాయం !

నేలపై కూర్చోవాలనుకుంటే ముందుగా అత్యంత సౌకర్యవంతమై ప్రదేశాన్ని చూసుకోవాలి. మోకాళ్లపై కూర్చోవడం, కాళ్లకు అడ్డంగా కూర్చోవడం, వంగి కూర్చోవడం, సైడ్ సిట్, స్ట్రడ్లింగ్ సిట్, ఎక్స్‌టెండెడ్ సిట్, స్క్వాటింగ్ వంటి కొన్ని ముఖ్యమైన సిట్టింగ్ పొజిషన్‌లలో నేలపై కూర్చోవడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఎగువ మరియు దిగువ పొత్తికడుపు, కటి కండరాలు సాగుతాయి. దీని వల్ల నొప్పుల నుండి ఉపశమనం లభిస్తుంది.

అయితే నేలపై కూర్చోవడం వల్ల కీళ్లపై అదనపు ఒత్తిడి, అవయవాలపై భారం, రక్త ప్రవాహం సక్రమంగా లేకపోవటం, భంగిమ సక్రమంగా లేకపోవటం వల్ల ఇప్పటికే కీళ్ల సమస్యలను ఎదుర్కొనేవారిలో అవి మరింత తీవ్రతరం చేయడం వంటి అనేక ప్రతికూల ప్రభావాలు చవిచూడాల్సి వస్తుంది. వీటితోపాటు తుంటి, మోకాలి లేదా చీలమండ సమస్యలు తలెత్తి నేలపైన నిలబడటం కష్టంగా మారే ప్రమాదం ఉంటుంది.

READ ALSO : Lassi : వేసవిలో శరీరానికి మేలు చేసే లస్సీ!

ఒకవేళ నేలపై కూర్చోవాలనుకుంటే ఎక్కువ సమయం కూర్చుకోవటం మంచిది కాదని గుర్తుంచుకోవాలి. నొప్పి వంటి ఇబ్బందులను కూర్చున్న సమయంలో ఎదురైతే అసౌకర్యాన్ని తొలగించుకునేందుకు అటు ఇటు లేచి నడవటం, ఆస్ధానం నుండి మరో స్ధానానికి మారటం మంచిది.