High Sugar Consumption : అధిక చక్కెర వినియోగం ప్రవర్తనపై ప్రభావం చూపుతుందా? ఇందులో వాస్తవ మెంత ?

చక్కెర తీసుకోవటం అన్నది శరీరంలో శక్తి హెచ్చుతగ్గులకు దారితీస్తుంది. ఏదైనా తీపిని తిన్నప్పుడు, రక్తంలో చక్కెర స్థాయిలు ఆకాశాన్ని తాకుతాయి. ఇది అకస్మాత్తుగా శక్తి మరియు చురుకుదనాన్ని ఇస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలు పడిపోతున్నప్పుడు శక్తి కూడా తగ్గిపోతుంది, తద్వారా మీరు నిదానంగా, చిరాకుగా , ఏపనిపై దృష్టి సారించలేకపోతారు.

High Sugar Consumption : మన ఆరోగ్యానికి అధిక చక్కెర వినియోగం అన్నది చేటు చేస్తుంది. సాధారణ మొత్తంలో చక్కెర తీసుకోవటం వల్ల బాగానే ఉన్నప్పటికీ, అది మోతాదుకు మించి తీసుకుంటే మాత్రం ఎక్కువ బరువు పెరగడం, మధుమేహం ఇతర తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. అదే క్రమంలో అధిక చక్కెర తీసుకోవటం అన్నది మన ప్రవర్తనపై కూడా గణనీయమైన ప్రభావాన్ని చూపుతుందని చాలా మందికి తెలియదు. అధిక చక్కెర మీ ప్రవర్తనను అనేక విధాలుగా ప్రభావితం చేస్తుంది. అదెలాగో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

READ ALSO : High Blood Sugar: రక్తంలో చక్కెర స్థాయి పెరిగిందన్న విషయాన్ని తెలిపే 15 లక్షణాలు

చక్కెర మీ ప్రవర్తనను ప్రభావితం చేసే వివిధ మార్గాలు ;

అధిక చక్కెర హార్మోన్ల అసమతుల్యతను కలిగిస్తుంది ; చక్కెర సెరోటోనిన్, డోపమైన్ విడుదలకు కారణమవుతుంది, రెండు న్యూరోట్రాన్స్మిటర్లు మనల్ని సంతోషంగా, రిలాక్స్‌గా ఉండేలా దోహదపడతాయి. చక్కెర కొద్ది మొత్తంలో తీసుకోవటం ప్రయోజనకరంగా ఉన్నప్పటికీ, ఎక్కువ చక్కెర తీసుకుంటే మాత్రం హార్మోన్లలో అసమతుల్యతకు దారి తీస్తుంది, దీనివల్ల మనం ఆత్రుతగా, చిరాకుగా, దూకుడు స్వభావాన్ని ప్రదర్శించటం వంటి లక్షణాలు కలిగి ఉంటాం.

ఎక్కువ చక్కెర మూడ్ మార్పులకు దారితీస్తుంది ;

చక్కెర తీసుకోవటం అన్నది శరీరంలో శక్తి హెచ్చుతగ్గులకు దారితీస్తుంది. ఏదైనా తీపిని తిన్నప్పుడు, రక్తంలో చక్కెర స్థాయిలు ఆకాశాన్ని తాకుతాయి. ఇది అకస్మాత్తుగా శక్తి మరియు చురుకుదనాన్ని ఇస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలు పడిపోతున్నప్పుడు శక్తి కూడా తగ్గిపోతుంది, తద్వారా మీరు నిదానంగా, చిరాకుగా , ఏపనిపై దృష్టి సారించలేకపోతారు.

READ ALSO : Blood Sugar : రక్తంలో అధిక చక్కెర స్ధాయిలను నియంత్రించటంలో సహాయపడే ముల్లంగి!

ఎక్కువ చక్కెర నిద్రకు భంగం కలిగిస్తుంది ;

చక్కెర ఎక్కువగా తీసుకోవటం నిద్రలేమికి దారితీస్తుంది. శరీరం చక్కెరను జీర్ణం చేసినప్పుడు, అది కార్టిసాల్ అనే హార్మోన్‌ను విడుదల చేస్తుంది. ఈ హార్మోన్ ఒత్తిడికి ప్రతిస్పందనగా విడుదలవుతుంది. నిద్రపోవడం కష్టతరంగా మారుస్తుంది. అంతేకాకుండా షుగర్ గాఢ నిద్రకు ఆటంకం కలిగిస్తుంది. తరువాత రోజు ఉదయం అలసట , గజిబిజిగా ఉన్నట్లు అనిపిస్తుంది.

షుగర్ మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేయగలదా?

వీటన్నింటితో పాటు, చక్కెర మానసిక ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. చక్కెర అధికంగా ఉండే ఆహారాలు డిప్రెషన్‌తో సంబంధం కలిగి ఉన్నాయని అనేక అధ్యయనాలు నిరూపించాయి. అధిక చక్కెర వినియోగాన్ని ఆందోళన ప్రమాదాన్ని పెంచుతాయని మరికొన్ని అధ్యయనాల్లో తేలింది.

READ ALSO : Reduce Belly Fat : 40 ఏళ్లకు పైబడిన మహిళలు బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవటానికి దోహదపడే ఆహారాలు !

చక్కెర వల్ల కలిగే శక్తి హెచ్చుతగ్గులు, అలాగే హార్మోన్ల అసమతుల్యత , చక్కెర ఇన్సులిన్ స్థాయిలను వేగంగా పెంచడానికి కారణమవుతుంది, ఇది శరీరంలోని హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తుంది. ఇది శక్తి స్థాయిలలో హెచ్చుతగ్గులకు, అలసట మరియు మూడ్ స్వింగ్‌లకు దారితీస్తుంది.

సాధారణంగా, మహిళలు రోజుకు 100 కేలరీల కంటే ఎక్కువ చక్కెరను తినకూడదు. పురుషులు రోజుకు 150 కేలరీల కంటే ఎక్కువ తినకూడదు. అధిక చక్కెర మీ ప్రవర్తనపై ప్రభావం చూపుతుందని స్పష్టమైంది. ఆరోగ్యం శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని చక్కెర తీసుకోవడం పరిమితం చేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు