High Blood Sugar: రక్తంలో చక్కెర స్థాయి పెరిగిందన్న విషయాన్ని తెలిపే 15 లక్షణాలు

High Blood Sugar: రక్తంలో చక్కెర స్థాయి బాగా పెరిగిపోతే (హైపర్‌గ్లైసీమియా-hyperglycemia) ఎన్నో దుష్ప్రభావాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయి పెరిగిందన్న విషయాన్ని తెలిపేలా కొన్ని లక్షణాలు కనపడుతాయి.

High Blood Sugar: రక్తంలో చక్కెర స్థాయి పెరిగిందన్న విషయాన్ని తెలిపే 15 లక్షణాలు

High Blood Sugar

High Blood Sugar: మధుమేహం ఒక్కసారి వచ్చిదంతే దాన్ని జీవితాంతం భరించాల్సిందే. మధుమేహాన్ని నియంత్రణలో ఉండచుకోవడం మినహా మనం చేసేదేమీ ఉండదు. ఒకప్పుడు మధుమేహం సాధారణంగా వయసు పై బడుతున్న వారికి వచ్చేది. ఇప్పుడు యువతలో కూడా చాలా మంది మధుమేహం బారిన పడుతున్నారు.

చాలా మంది చాలా బద్ధకంతో వ్యాయామం చేయకుండా, ఆహార నియమాలు పాటించకుండా శరీరంలో చక్కెర స్థాయిని పెంచేసుకుంటారు. రక్తంలో చక్కెర స్థాయి బాగా పెరిగిపోతే (హైపర్‌గ్లైసీమియా-hyperglycemia) ఎన్నో దుష్ప్రభావాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయి పెరిగిందన్న విషయాన్ని తెలిపేలా కొన్ని లక్షణాలు కనపడుతాయి.

1. అలసట: రక్తంలో చక్కెర స్థాయి పెరిగిందన్న విషయాన్ని తెలిపే తొలి లక్షణం విపరీతమైన అలసట.

2. మసక చూపు: కళ్లు మసకగా కనపడతాయి. రక్తంలో చక్కెర స్థాయి పెరిగితే దాని ప్రభావం కంటి చూపుపై పడుతుంది.

3. తలనొప్పి: మధుమేహ స్థాయి అధికంగా ఉంటే తలనొప్పులు సర్వసాధారణమైపోతాయి.

4. అధిక మూత్ర విసర్జన: పదే పదే బాత్రూంకు వెళ్లాల్సి వస్తుంది. అధిక చక్కెరను గ్రహించడం, వడపోయడం వంటి ప్రక్రియలో కిడ్నీలపై అధిక భారం పడుతుంది. దీంతో యూరిన్ ద్వారా అధిక చక్కెర బయటకు వెళ్లిపోతుంది.

5. అధిక దాహం: రక్తంలో చక్కెర స్థాయి పెరిగితే పాలీడిప్సియా (Polydipsia)తో బాధపడతారు. అంటే అధికంగా దాహం వేస్తుంది.

6. అధిక ఆకలి: ఈ లక్షణం కూడా మధుమేహ స్థాయి పెరిగిందన్న సూచనను ఇస్తుంది.

7. నోరు ఎండిపోవడం: అన్ని వేళలా నోరు ఎండిపోతుంది. నీరు అధికంగా తాగాలనిపిస్తుంది. నోటిలో లాలాజం తగ్గిపోతుంది.

8. ఊపిరి తీసుకోవడంతో కష్టం: మధుమేహ స్థాయి పెరిగితే ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతాయి.

9. మతిమరుపు: తికమక పడడం, మతిమరుపు, ఏకాగ్రత లేకపోవడం వంటి లక్షణాలతోనూ బాధపడతారు. కొందరిలో డిప్రెషన్ కూడా కనపడుతుంది.

10. పొత్తికడుపు నొప్పి: రక్తంలో చక్కెర స్థాయి పెరిగితే పొత్తికడుపు నొప్పి, జీర్ణాశయ సమస్యలు ఎదురవుతాయి.

11. గాయాలు త్వరగా మానవు: శరీరానికి గాయలైతే అవి మానడానికి చాలా సమయం పడుతుంది.

12. ఇన్ఫెక్షన్ల ముప్పు: ఇన్ఫెక్షన్లు పదే పదే వచ్చే ప్రమాదం ఉంటుంది.

13. చర్మ సమస్యలు: చర్మం సాధారణం కంటే అధికంగా పొడిగా ఉంటుంది. దురదవంటి సమస్యలూ ఎదురవుతాయి.

14. తిమ్మిర్లు: రక్త సరఫరా సరిగ్గా ఉండకపోవడంతో శరీరంలోని పలు భాగాలపై ఆ ప్రభావం పడుతుంది. తిమ్మిర్లతో బాధపడతారు.

15. అధిక జ్వరం: రక్తంలో చక్కెర స్థాయి పెరిగితే అధిక జ్వరంతోనూ బాధపడతారు. శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గిపోవడంతో అనారోగ్యం బారిన పడతారు.

Summer Heat : వేసవి వేడి కారణంగా పనిలో అలసిపోయారా? తక్షణమే శక్తిని పెంచుకోవడానికి చిట్కాలు !