Stair Climbing : మెట్లు ఎక్కేందుకు పట్టే సమయమే మీ గుండె ఆరోగ్యాన్ని నిర్ధేశిస్తుందా? గుండె ఆరోగ్యానికి మెట్లు ఎక్కటం వ్యాయామాల్లో ఒక భాగమేనా?

చాలా మంది తమ వ్యాయామాల్లో ఇంటి మెట్లు ఎక్కటాన్ని కూడా ఒక భాగం చేసుకుంటారు. మెట్లు ఎక్కటం కూడా వ్యాయామాల్లో ఒక భాగమని నిపుణులు చెబుతున్నారు. క్రమం తప్పకుండా మెట్లు ఎక్కటం , దిగటం వంటివి చేసే వారిలో గుండె, ఊపిరితిత్తుల సామర్ధ్యం , కండరాలు గణనీయంగా పుంజుకున్నట్లు అధ్యయనాల్లో తేలింది.

Stair Climbing : మెట్లు ఎక్కేందుకు పట్టే సమయమే మీ గుండె ఆరోగ్యాన్ని నిర్ధేశిస్తుందా? గుండె ఆరోగ్యానికి మెట్లు ఎక్కటం వ్యాయామాల్లో ఒక భాగమేనా?

stair climbing

Updated On : October 19, 2022 / 1:13 PM IST

అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్‌, మధుమేహం, నిశ్చల జీవనశైలి వంటివి ఈ గుండె వ్యాధులకు కారణమవుతున్నాయి. క్రమంతప్పకుండా వ్యాయామాలు చేయడం, మధుమేహ నియత్రణ వంటి వాటి ద్వారా ఈ సమస్యల బారిన పడకుండా కాపాడుకోవచ్చు. గుండె ఆరోగ్యంగా ఉందో గుర్తించేందుకు అతి సులభమైన పద్ధతిలలో మెట్లు ఎక్కడం ఒకటి. భవిష్యత్‌లో కార్డియాక్‌ వ్యాధుల బారిన పడకుండా అవగాహన దీని ద్వారా కలుగుతుంది. రెండు నిమిషాలలో మీ గుండె పనితీరును ఖర్చు లేకుండా ఈ మెట్ల పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చు.

చాలా మంది తమ వ్యాయామాల్లో ఇంటి మెట్లు ఎక్కటాన్ని కూడా ఒక భాగం చేసుకుంటారు. మెట్లు ఎక్కటం కూడా వ్యాయామాల్లో ఒక భాగమని నిపుణులు చెబుతున్నారు. క్రమం తప్పకుండా మెట్లు ఎక్కటం , దిగటం వంటివి చేసే వారిలో గుండె, ఊపిరితిత్తుల సామర్ధ్యం , కండరాలు గణనీయంగా పుంజుకున్నట్లు అధ్యయనాల్లో తేలింది. అంతేకాకుండా దెబ్బతిన్న కండరాలు పునరుత్తేజం కావటానికి తోడ్పడుతుంది.

ఒక నిమిషంలో 40 మెట్లు ఎక్కగలిగితే మీ గుండె ఆరోగ్యంగా ఉన్నట్లు. అలా కాకుండా నాలుగు మెట్లు ఎక్కేందుకు ఒకటిన్నర నిమిషాల కంటే ఎక్కువ సమయం తీసుకుంటే, మీ ఆరోగ్యం క్షీణిస్తుందని గుర్తించి వైద్యుడిని సంప్రదించడం మంచిది. సమయం దొరక్క, వ్యాయామశాలలు అందుబాటులో లేకపోవటం, వ్యాయామాలకు తగిన స్ధలం లేని వారు ఇంటి మెట్లు ఎక్కటం, దిగటం వంటివి చేయాలి. అయితే గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు, గుండె ఆపరేషన్లు చేయించుకుని ఉన్నవారు వైద్యుల సూచనలు సలహాలతోనే ఈ తరహా వ్యాయామాలు చేయటం మంచిది.