Tasty Teja : ఎనిమిదేళ్లు ఒక్క అమ్మాయితో కూడా మాట్లాడలేదు.. బాడీ షేమింగ్ చేసేవాళ్ళు..
తాజాగా టేస్టీ తేజ ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు జరిగిన బాడీ షేమింగ్ గురించి చెప్పుకొచ్చాడు.(Tasty Teja)
Tasty Teja
Tasty Teja : సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తూ జబర్దస్త్ తో గుర్తింపు తెచ్చుకున్న టేస్టీ తేజ ఆ తర్వాత ఫుడ్ ఇంటర్వ్యూలు చేస్తూ యూట్యూబ్ ఛానల్ తో బాగా ఫేమ్ తెచ్చుకున్నాడు. బిగ్ బాస్ తో మరింత వైరల్ అయి ఇప్పుడు సినిమాల్లో కూడా నటిస్తున్నాడు. తాజాగా టేస్టీ తేజ ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు జరిగిన బాడీ షేమింగ్ గురించి చెప్పుకొచ్చాడు.(Tasty Teja)
Also Read : Allu Ayaan : బన్నీ తనయుడు అల్లు అయాన్ క్రిస్మస్ రీల్ చూశారా..? వీడియో వైరల్..
టేస్టీ తేజ మాట్లాడుతూ.. దాదాపు ఎనిమిదేళ్లు నేను ఒక్క అమ్మాయితో కూడా మాట్లాడలేదు. నా లైఫ్ లో లవ్, అమ్మాయిలు లేరు. నాకు ఇన్ సెక్యూర్ ఫీలింగ్ చాలా ఉండేది. చిన్నప్పట్నుంచి కూడా స్కూల్ లో అమ్మాయిలతో మాట్లాడినా, వాళ్ళ మధ్యలో నడిచినా వీడు లావుగా ఉన్నాడు, నల్లగా ఉన్నాడు అని కామెంట్స్ వచ్చేవి. నాలో నాకే భయం ఉండేది. నాతో అసలు అమ్మాయిలు మాట్లాడాతారా అనుకునేవాడిని. దాన్నుంచి రావడానికి చాలా టైం పట్టింది.
నా లైఫ్ లో అసలు అమ్మాయే లేదు. ఇంట్లో వాళ్ళతో తప్ప ఎవరితో మాట్లాడేవాడిని కాదు. ఇంటర్ నుంచి జాబ్ లో జాయిన్ అయ్యేవరకు ఆల్మోస్ట్ 8 ఏళ్ళు బయట అమ్మాయిలతోనే మాట్లాడలేదు. బిగ్ బాస్ తర్వాత అందులో చేసిన వాళ్లంతా నాకు మంచి ఫ్రెండ్స్ అయి మాట్లాడుతుంటే నాతో కూడా అమ్మాయిలు ఫ్రెండ్షిప్ చేస్తారా అనుకునేవాడిని. బిగ్ బాస్ లో శోభా శెట్టి, శుభశ్రీ ఫ్రెండ్షిప్ వల్ల చాలా మారాను. వాళ్ళు నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చారు అని తెలిపాడు.
Also Read : Shagna sri venun : దర్శకురాలిగా మారుతున్న హీరోయిన్.. వరుణ్ సందేశ్ తో సినిమా అనౌన్స్..
