Multiplex Theaters : హైదరాబాద్ మల్టీప్లెక్సుల్లో మరో కొత్త దోపిడీ.. మొదలుపెట్టిన ప్రసాద్ ఐమాక్స్..
హైదరాబాద్ ప్రసాద్ ఐ మాక్స్ లో మరో రెండు కొత్తరకం దోపిడీలు మొదలుపెట్టారు. (Multiplex Theaters)
Multiplex Theaters
Multiplex Theaters : మల్టీప్లెక్స్ థియేటర్స్ లో ఇప్పటికే టికెట్ రేట్లు పెంచేసి, వందల్లో పాప్ కార్న్, కూల్ డ్రింక్, తినుబండారాల రేట్లు పెట్టి దోపిడీ చేస్తున్నారని సామాన్య ప్రజలతో పాటు సినీ ప్రముఖులు కూడా విమర్శలు చేస్తున్నారు. సరదాగా వీకెండ్ లో ఒక సాధారణ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మాల్ కి వెళ్తే వెయ్యి నుంచి రెండు వేలు వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.(Multiplex Theaters)
టికెట్ రేట్లు తగ్గించడానికి మేము రెడీ కానీ మల్టిప్లెక్స్ థియేటర్స్ ఒప్పుకోవట్లేదని నిర్మాతలే బహిరంగంగా చెప్తున్నారు. ఫుడ్ రేట్స్ కూడా వాళ్ళ ఆధీనంలోనే ఉన్నాయని నిర్మాతలు చెప్తున్నారు. మల్టిప్లెక్స్ ల దోపిడీ పై ఇప్పటికే నెగిటివిటి వస్తుండగా మరో కొత్తరకం దోపిడీ మొదలైంది.
Also See : Kajal Aggarwal : ఫ్యామిలీతో కాజల్ అగర్వాల్ క్రిస్మస్ సెలబ్రేషన్స్.. ఫొటోలు వైరల్..
Multiplex Theaters
హైదరాబాద్ ప్రసాద్ ఐ మాక్స్ లో మరో రెండు కొత్తరకం దోపిడీలు మొదలుపెట్టారు. పార్కింగ్ లోపల ఖాళీ ఉన్నా శుక్రవారం, సినిమా రిలీజ్ ల సమయంలో ఖాళీ లేదు అని అబద్దం చెప్తూ బయట వెహికల్ పార్కింగ్ పెట్టి పార్కింగ్ ఫీజ్ తీసుకుంటున్నారు. మల్టీప్లెక్స్ లో సినిమా చూస్తే పార్కింగ్ ఫీజ్ లేదు అని కోర్టు ఉత్తర్వులు ఉన్నా, సినిమాకు వచ్చిన జనాల దగ్గర్నుంచి పార్కింగ్ బయట పెట్టి బలవంతంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. ఎవరైనా ప్రశ్నించినా, అడిగినా సమాధానం చెప్పడానికి కూడా అక్కడ ఎవరూ ఉండట్లేదు. నార్త్ వాళ్ళను, కేవలం హిందీ మాట్లాడేవాళ్ళను సెక్యూరిటీగా పెట్టి మేనేజ్మెంట్, సూపర్ వైజర్స్ ఎవరూ పట్టించుకోవట్లేదు. పైగా పార్కింగ్ ఫీజ్ కట్టినా వెహికల్ బాధ్యత మాది కాదు అంటూ బోర్డులు పెట్టడం గమనార్హం.
ఇక మరో దోపిడీ అయితే సరికొత్తది. ఎక్కువమంది మాల్స్ కి సాయంత్రం పూటే వస్తారు. ఆఫీస్ ల నుంచి, కాలేజీల నుంచి వచ్చేవాళ్ళు ఎక్కువే ఉంటారు. చాలా మంది ల్యాప్ టాప్ బ్యాగ్స్, కాలేజీ బ్యాగ్స్ క్యారీ చేస్తారు. అన్ని మల్టీప్లెక్స్ లలో బ్యాగ్స్ ని చెకింగ్ చేసి లోపలికి పంపిస్తారు. కానీ ఇప్పుడు ప్రసాద్ ఐ మాక్స్ లో బ్యాగ్ లను లోపలికి పంపించట్లేదు. బయట డిజి లాకర్ అనే పేరిట లాకర్లు పెట్టి గంటకు పది రూపాయలు అంటూ వసూలు చేస్తున్నారు.
Also Read : Ram Charan : ఎన్టీఆర్ తర్వాత రామ్ చరణ్ తో.. చెర్రీతో జత కట్టనున్న లేటెస్ట్ యూత్ క్రష్..
ఎవరైనా బ్యాగ్ వేసుకొని ఐ మాక్స్ లో సినిమాకు వెళ్లారంటే ఆ బ్యాగ్ దాయడానికి మూడు గంటలు ముప్పై రూపాయలు ఎక్స్ ట్రా చెల్లించాల్సిందే. PVR థియేటర్స్ లో బ్యాగ్స్ ని లోపలికి అనుమతించకపోయినా ఫ్రీగా సెక్యూరిటీ ఇస్తారు. వేరే మల్టిప్లెక్స్ లలో చెక్ చేసి పంపిస్తారు. కానీ ప్రసాద్ ఐ మాక్స్ లో లోపలికి అనుమతించకుండా లాకర్ పేరుతో డబ్బులు వసూలు చేస్తుండటంతో తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
సరదాగా కొంత సమయం గడుపుదాం, సినిమా చూద్దాం అని వచ్చే సామాన్య ప్రజల దగ్గర ఇలా కూడా డబ్బులు వసూలు చేస్తారా అని షాక్ అవుతున్నారు. అసలు హైదరాబాద్ లో సినిమా చూడాలి అంటే ప్రసాద్ ఐమాక్స్ లోనే చూడాలి అని ప్రతి గురు, శుక్రవారాలు ఈ థియేటర్ వద్ద జనాలు కొత్త సినిమాల కోసం కిటకిటలాడతారు. ఇలాంటి పరిస్థితిని ఐ మాక్స్ క్యాష్ చేసుకుంటుంది అంటూ విమర్శలు వస్తున్నాయి.
