గుడ్‌న్యూస్… రైతు భరోసా డబ్బులు వచ్చేస్తున్నాయ్..
రైతులు, పంట సమాచారాన్ని ప్రభుత్వం శాటిలైట్ ఇమేజెస్ ద్వారా సిద్ధం చేస్తోంది.
Rythu Bharosa: యాసంగి సీజన్ రైతు భరోసా డబ్బులను తెలంగాణ సర్కారు సంక్రాంతి పండుగ నేపథ్యంలో రిలీజ్ చేయాలని భావిస్తోంది. రైతు భరోసా కింద ఏడాదికి ఎకరానికి మొత్తం కలిపి రూ.12,000 ఇస్తారన్న విషయం తెలిసిందే.
రైతులు, పంట సమాచారాన్ని ప్రభుత్వం శాటిలైట్ ఇమేజెస్ ద్వారా సిద్ధం చేస్తోంది. సంక్రాంతిలోపు ఈ ప్రక్రియ పూర్తవనుంది. పంటలు సాగు చేయని భూములను ఈ పథకం నుంచి మినహాయించే ఛాన్స్ ఉంది. దీనిపై అసెంబ్లీ సమావేశాల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
Also Read: క్రిస్మస్ వేళ ఐసిస్‌పై భీకర దాడులు చేయించిన ట్రంప్.. హతమైన ఉగ్రవాదులకు పండుగ శుభాకాంక్షలు అంటూ..
రైతు భరోసా పథకాన్ని రైతులకు ఆర్థిక భద్రత కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం అమలు చేస్తోంది. రైతులపై సాగు పెట్టుబడుల భారాన్ని తగ్గించి, వారు ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేయడమే దీని ఉద్దేశం. వ్యవసాయం మీద ఆధారపడిన కుటుంబాలకు ఈ పథకం బాగా ఉపయోగపడుతుంది.
ఈ పథకం కింద ప్రభుత్వం ప్రతి రైతుకు ఏడాదికి ఎకరానికి మొత్తం రూ.12,000 ఆర్థిక సహాయం అందిస్తోంది. ఖరీఫ్, యాసంగి సీజన్లకు విడతలుగా ఈ మొత్తాన్ని రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేస్తారు. మధ్యవర్తుల జోక్యం లేకుండా నేరుగా డబ్బులు అందుతుండడంతో రైతులకు పూర్తి లబ్ధి చేకూరుతోంది.
రైతు భరోసా ద్వారా విత్తనాలు, ఎరువులు, కూలీ ఖర్చులు వంటి ప్రారంభ పెట్టుబడులకు ఆర్థిక అండ లభిస్తోంది. ముఖ్యంగా చిన్న సన్నకారు రైతులకు ఇది ఎంతో ఉపయోగకరంగా మారింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ రైతు భరోసా అమలులో పారదర్శకత పెంచుతోంది. శాటిలైట్ చిత్రాల ఆధారంగా పంటల సాగు వివరాలు సేకరించి అర్హతను నిర్ధారిస్తోంది.
