క్రిస్మస్‌ వేళ ఐసిస్‌పై భీకర దాడులు చేయించిన ట్రంప్.. హతమైన ఉగ్రవాదులకు పండుగ శుభాకాంక్షలు అంటూ..

“క్రైస్తవులపై జరుపుతున్న హత్యాకాండను ఆపకపోతే తీవ్రమైన ప్రతిఫలం ఉంటుందని ఈ ఉగ్రవాదులను ముందే హెచ్చరించాను. ఈ రాత్రి అదే జరిగింది” అని ఆయన ట్రూత్ సోషల్ వేదికలో పోస్టు చేశారు.

క్రిస్మస్‌ వేళ ఐసిస్‌పై భీకర దాడులు చేయించిన ట్రంప్.. హతమైన ఉగ్రవాదులకు పండుగ శుభాకాంక్షలు అంటూ..

Updated On : December 26, 2025 / 7:53 AM IST

Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నైజీరియా వాయవ్య ప్రాంతంలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులపై తమ బలగాలతో భారీ దాడులు చేయించారు. నైజీరియాలో క్రైస్తవుల హత్యలను ఆపాలని ఇటీవలే ట్రంప్‌ హెచ్చరించారు. ట్రంప్‌ వార్నింగ్‌ ఇచ్చిన నేపథ్యంలో ఈ దాడులు జరగడం గమనార్హం.

“క్రైస్తవులపై జరుపుతున్న హత్యాకాండను ఆపకపోతే తీవ్రమైన ప్రతిఫలం ఉంటుందని ఈ ఉగ్రవాదులను ముందే హెచ్చరించాను. ఈ రాత్రి అదే జరిగింది” అని ఆయన ట్రూత్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

Also Read: చికిత్స కోసం ఆసుపత్రిలో 8 గంటలు వెయిట్ చేసిన వ్యక్తి.. చివరకు నొప్పిని భరించలేకపోతున్నానంటూ మృతి

నైజీరియాలో క్రైస్తవులపై ఐసిస్‌ ఉగ్రవాదులు చేస్తోందని ట్రంప్ అన్నారు. ఈ మారణకాండ ఆపకపోతే నరకం చూపిస్తానని తాను గతంలోనే వార్నింగ్ ఇచ్చినట్లు గుర్తుచేశారు. తన వార్నింగ్‌ను వారు పట్టించుకోలేదని తెలిపారు.

దీంతో వారు ఇప్పుడు అనుభవిస్తున్నారని చెప్పారు. భీకర దాడులు చేశామని, హతమైన ఉగ్రవాదులతో పాటు అందరికీ క్రిస్మస్‌ శుభాకాంక్షలని ట్రంప్‌ తెలిపారు. నైజీరియా అధికారుల అభ్యర్థన మేరకు నిర్వహించిన దాడిలో అనేకమంది ఐసిస్ ఉగ్రవాదులు మరణించినట్లు అమెరికా అధికారులు తెలిపారు.

ట్రంప్ పాలనలో నైజీరియాలో అమెరికా బలగాలు నిర్వహించిన తొలి దాడులివి. అక్టోబర్, నవంబర్ నెలల్లో ఆయన ఆ దేశంపై ఊహించని విమర్శలు చేస్తూ అక్కడి క్రైస్తవులు “అస్తిత్వ సంక్షోభం” ఎదుర్కొంటున్నారని అన్నారు.