ప్రయాణికులకు శుభవార్త.. సంక్రాంతికి ఊరు వెళ్తున్నారా? ఈ మార్గాల్లో మరికొన్ని ప్రత్యేక రైళ్లు..

ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.

ప్రయాణికులకు శుభవార్త.. సంక్రాంతికి ఊరు వెళ్తున్నారా? ఈ మార్గాల్లో మరికొన్ని ప్రత్యేక రైళ్లు..

South Central Railway

Updated On : December 26, 2025 / 10:15 AM IST

సంక్రాంతి వేళ సొంత ఊర్లకు వెళ్లాలనుకుంటున్న వారికి రైల్వే శాఖ గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఇప్పటికే పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు రైల్వే చెప్పిన విషయం తెలిసిందే. ఇప్పుడు వాటికి అదనంగా మరిన్ని ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.

మొత్తం ఆరు ప్రత్యేక రైళ్లు నడుస్తాయి. కాకినాడ నుంచి సికింద్రాబాద్‌ మీదుగా వికారాబాద్‌, నాందేడ్‌ మార్గాల్లో ఈ రైళ్ల సేవలు ఉంటాయి. అలాగే, వికారాబాద్‌ నుంచి సికింద్రాబాద్‌ మీదుగా మచిలీపట్నం మార్గంలో రైళ్లు నడుస్తాయి.

6 ప్రత్యేక రైళ్ల వివరాలు

  • రైలు (07450) కాకినాడ నుంచి జనవరి 19వ తేదీన సాయంత్రం 4.45 గంటలకు బయలుదేరి తదుపరి రోజు ఉదయం 7 గంటలకు వికారాబాద్‌కు చేరుకుంటుంది.
  • రైలు (07451) వికారాబాద్‌ నుంచి జనవరి 20వ తేదీన ఉదయం 9 గంటలకు బయలుదేరి రాత్రి 9.15 గంటలకు కాకినాడకు చేరుకుంటుంది.
  • రైలు (07452) నాందేడ్‌ నుంచి జనవరి 12న మధ్యాహ్నం 1.30 గంటలకు బయలుదేరి తదుపరి రోజు ఉదయం 9 గంటలకు కాకినాడకు చేరుకుంటుంది.
  • రైలు (07453) కాకినాడ నుంచి జనవరి 13న మధ్యాహ్నం ఒంటి గంటకు బయలుదేరి తదుపరి రోజు ఉదయం 7 గంటలకు నాందేడ్‌కు చేరుకుంటుంది.
  • రైలు (07454) మచిలీపట్నం నుంచి జనవరి 11, 18వ తేదీల్లో ఉదయం 10 గంటలకు బయలుదేరి, తదుపరి రోజు రాత్రి 8 గంటలకు వికారాబాద్‌ చేరుకుంటుంది.
  • రైలు(07455) వికారాబాద్‌ నుంచి జనవరి 11, 18 తేదీల్లో రాత్రి 10 గంటలకు బయలుదేరి తదుపరి రోజు ఉదయం 8.15 గంటలకు మచిలీపట్నం చేరుకుంటుంది.