హైదరాబాద్ వాసులకు అలర్ట్.. కొత్త జోన్లు, సర్కిళ్ల ప్రకటన.. మీరు ఏ జోన్‌లోకి వస్తారో చెక్ చేసుకోండి..
12 జోన్లు అందులో ఉండే సర్కిళ్లు ఇవే..
GHMC
GHMC: గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ) పునర్విభజనకు సంబంధించిన తుది నోటిఫికేషన్ విడుదలైంది. ఇంతకుముందు జీహెచ్‌ఎంసీ పరిధి 6 జోన్లు, 30 సర్కిళ్లుగా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు అది 12 జోన్లు, 60 సర్కిళ్లు, 300 డివిజన్లకు చేరింది.
హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దడంలో భాగంగా.. 650 చదరపు కి.మీ విస్తీర్ణంతో ఉన్న జీహెచ్‌ఎంసీ పరిధిని ఓఆర్ఆర్ అవతలి వరకు 2,053 చదరపు కి.మీ వరకు సర్కారు విస్తరించింది. జీహెచ్‌ఎంసీ అవతల ఉన్న మొత్తం 27 మున్సిపాలిటీలతో పాటు కార్పొరేషన్లను విలీనం చేసింది.
Also Read: గుడ్‌న్యూస్… రైతు భరోసా డబ్బులు వచ్చేస్తున్నాయ్..
దీంతో 300 డివిజన్లతో మహా హైదరాబాద్ ఉంది. కొత్త జోనల్, సర్కిల్ ఆఫీసులను సైతం ఖరారు చేశారు. గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థలో తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్‌లోని 27 పట్టణ స్థానిక సంస్థలను విలీనం చేయడంతో పెరిగిన పరిధిని 300 వార్డులుగా చేశారు.
12 జోన్లు, 60 సర్కిళ్ల వివరాలు
| క్రమ సంఖ్య | జోన్లు | సర్కిళ్లు |
|---|---|---|
| 1 | మల్కాజ్‌గిరి | కీసర, అల్వాల్, బోయిన్‌పల్లి, మౌలాలీ, మల్కాజ్‌గిరి |
| 2 | ఉప్పల్ | ఘట్‌కేసర్, కాప్రా, నాచారం, ఉప్పల్, బోడుప్పల్ |
| 3 | ఎల్బీ నగర్ | నాగోల్, సరూర్ నగర్, ఎల్బీ నగర్, హయత్‌నగర్ |
| 4 | శంషాబాద్ | ఆదిభట్ల, బడంగ్‌పేట్, జల్‌పల్లి, శంషాబాద్ |
| 5 | రాజేంద్ర నగర్ | రాజేంద్ర నగర్, అత్తాపూర్, చార్మినార్, బహదూర్‌పురా, ఫలక్‌నుమా, చంద్రాయణగుట్ట, జంగమ్మెట్ |
| 6 | చార్మినార్ | సంతోష్ నగర్, యాకుత్‌పురా, మలక్‌పేట్, చార్మినార్, మూసారాంబాగ్ |
| 7 | గోల్కొండ | గోషామహల్, కార్వాన్, గోల్కొండ, మెహిదీపట్నం, మాసబ్ ట్యాంక్ |
| 8 | ఖైరతాబాద్ | ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, బోరబండ, యూసుఫ్‌గూడ, అమీర్‌పేట్ |
| 9 | సికింద్రాబాద్ | కవాడిగూడ, ముషీరాబాద్, అంబర్‌పేట్, తార్నాక, మెట్టుగూడ |
| 10 | శేరిలింగంపల్లి | నార్సింగి, పటాన్‌చెరు, అమీన్‌పూర్, మియాపూర్, శేరిలింగంపల్లి |
| 11 | కూకట్‌పల్లి | మాదాపూర్, ఆల్విన్ కాలనీ, కూకట్‌పల్లి, మూసాపేట్ |
| 12 | కుత్బుల్లాపూర్ | చింతల్, జీడిమెట్ల, దుండిగల్ కొంపల్లి, గాజులరామారం, నిజాంపేట్, మేడ్చల్ |
