Pancreatic Cancer : ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ప్రారంభ లక్షణాలు ఇవే !

ప్యాంక్రియాస్ కొవ్వులు, ప్రోటీన్లు మరియు కార్బోహైడ్రేట్లను జీర్ణం చేయడానికి అవసరమైన ఎంజైమ్‌లను ఉత్పత్తి చేయడం ద్వారా జీర్ణక్రియలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

Pancreatic Cancer : ప్యాంక్రియాస్ అనేది శరీరంలో చాలా ముఖ్యమైన అవయవం. గ్లూకాగాన్, ఇన్సులిన్‌ అనే రెండు ముఖ్యమైన హార్మోన్లను ఉత్పత్తి చేయడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడటంలో ప్యాంక్రియాస్ కీలకపాత్ర పోషిస్తుంది. ఇన్సులిన్ జీర్ణమైన ఆహారం నుండి గ్లూకోజ్‌ను గ్రహించడానికి కణాలకు సహాయపడితే, గ్లూకోగాన్ గ్లూకోజ్ స్థాయిని తక్కువగా ఉన్నప్పుడు పెంచడం ద్వారా శరీరానికి పోషణను అందిస్తుంది. ప్యాంక్రియాస్ కొవ్వులు, ప్రోటీన్లు మరియు కార్బోహైడ్రేట్లను జీర్ణం చేయడానికి అవసరమైన ఎంజైమ్‌లను ఉత్పత్తి చేయడం ద్వారా జీర్ణక్రియలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ప్యాంక్రియాస్ కణజాలంలో ప్రాణాంతక కణాలు ఏర్పడటాన్ని ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అంటారు. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌ను నిశ్శబ్ద వ్యాధిగా చెప్పవచ్చు.

READ ALSO : ఎండ్ స్టేజ్ లివర్ డిసీజ్ లో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో తెలుసా ?

ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ లక్షణాలు ;

క్యాన్సర్ లక్షణాలు ప్రారంభ దశల్లో స్పష్టంగా కనిపించవు. దీని వల్ల రోగనిర్ధారణలో జాప్యం జరుగుతుంది. వ్యాధి ముదిరిన కొద్ది కొన్ని లక్షణాలు బహిర్గతమౌతాయి.

1.ఆకస్మిక బరువు తగ్గడం
2. ఆకలి తగ్గటం
3. డిప్రెషన్
4. రక్తంలో చక్కెర స్థాయిలు ఆకస్మికంగా పెరగడం (డయాబెటిస్)
5. బలహీనత & అలసట
6. విపరీతమైన ఆకలి లేదా దాహం
7. ముదురు రంగు మూత్రం
8.దిగువ వెన్ను మరియు కడుపు నొప్పి
9.రక్తం గడ్డకట్టడం
10.కంళ్లు పసుపురంగులోకి మారటం
11. కాలివాపు, కాలు నొప్పి
12. వికారం, వాంతులు
13. అతిసారం

READ ALSO : Non-Alcoholic Fatty Liver : ప్రాణాంతకంగా నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్.. సమస్య నుండి బయటపడేందుకు మార్గాలు

ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ప్రమాద కారకాలు ;

అధిక కొవ్వు ఆహారాలు ; అధిక కొవ్వు పదార్ధం కలిగిన ఆహారాన్ని ఎక్కువగా తినటం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. ఇది ప్యాంక్రియాస్‌తో సహా శరీరంలోని అనేక అవయవాల పనితీరును దెబ్బతీస్తుంది.

మధుమేహం ; రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో లేనప్పుడు, అంతర్గత అవయవాల పనితీరుపై ప్రభావంపడుతుంది. అవయవాలకు తీవ్ర నష్టం కలిగిస్తుంది.

ధూమపానం ; వివిధ రకాల క్యాన్సర్ వ్యాధులకు ధూమపానం ముఖ్యకారణం. ధూమపానం క్యాన్సర్ కణాల ఉత్పత్తిని పెంచుతుంది.

READ ALSO : Sudden Weight Loss : అకస్మాత్తుగా బరువు తగ్గడం అన్నది అంతర్లీన ఆరోగ్య సమస్యగా భావించాలా ?

వ్యాయామం చేయకపోవటం ; ఆరోగ్యంగా ఉండటానికి రోజువారి వ్యాయామం సరైన మార్గంగా చెప్పవచ్చు. రోజుకు కనీసం 30 నిమిషాలు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల రోగనిరోధక వ్యవస్థ పెరిగి ప్రాణాంతక వ్యాధులతో పోరాడటానికి తోడ్పడుతుంది. బరువు పెరిగటం, ఊబకాయం అన్నది ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌కు కారణమయ్యే హార్మోన్ల అసమతుల్యతకు కారణమౌతుంది.

ఆల్కహాల్ తీసుకోవడం ; మద్యం అధికంగా చేసే వ్యక్తులలో ప్యాంక్రియాస్ బలహీనంగా మారుతుంది. ఆల్కహాల్ అంతర్గత అవయవాల పనితీరును దెబ్బతీస్తుంది.

రసాయనాల ప్రభావం ; విష రసాయనాలు, పురుగుమందులకు గురికాకుండా ఉండాలి. అలాంటి వాటికి గురైతే ప్యాంక్రియాస్ పై ప్రభావం పడుతుంది.

READ ALSO : Obesity and Cancer : ఊబకాయంతో క్యాన్సరు వచ్చే ప్రమాదం ఉందా ?

కాలేయం దెబ్బతినడం ; దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధితో బాధపడేవారిలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంది. కాలేయం, ప్యాంక్రియాస్ కలిసి ఆహారాన్ని జీర్ణం చేయడం,శుద్ధి చేయడంలో తోడ్పడతాయి.

కుటుంబ చరిత్ర ; ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌తో బాధపడుతున్నకుటుంబం చరిత్ర కలిగి ఉన్నవారు ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఇది జన్యు పరివర్తన కారణంగా జరిగే ప్రమాదం ఉంటుంది.

ట్రెండింగ్ వార్తలు